డైలీ సీరియల్

బంగారుకల 45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మరుసు చూపు రాజవైద్యుల నుంచి వీరేంద్రునిమీదికి మరలి ఆగిపోయిందో క్షణం. తర్వాత ఆయన చూపు శ్రీకృష్ణదేవరాయల మీద నిలిచింది.
ఈ చక్రవర్తి తన రాయలేనా? విధి ఎంత విచిత్రమైనది. ఆనాడు ఈ రాయలను మహారాజు చంపమంటే చంపలేదు. రక్షించి సింహాసనమెక్కించి, విశాల సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశాడు. రాజ్యమే కావాలనుకుంటే ఆనాడు తనను అడ్డుకునేవారెవరు? ఆరేళ్ల పసివాడిని బలిగొనేంత కసాయివాడా తిమ్మరుసు? ఈ నింద పడటంకన్నా దీనిని రాయలు అంగీకరించటమే నరకంగా ఉంది. వీరేంద్రా! నీ పన్నాగం సఫలయిందని సంతోషిస్తున్నావా! విజయనగర సామ్రాజ్యలక్ష్మి వైభవం మసకబారుతోందా! ఇంతకాలం తాను వేయికళ్ళతో కాపాడుకుంటూ వస్తున్న తన రాయల చుట్టూ ఏదైనా ముళ్ళకంచె పడిందా!
ఆవేదన, ఆందోళనలతో ఆ వృద్ధమంత్రి పరితపిస్తున్నాడు. తనమీద మోపబడిన నిందకన్నా సామ్రాజ్య రక్షణకు సంబంధించిన ఆవేదనే ఆయనలో ఎక్కువగా ఉప్పొంగుతున్నది.
ప్రధాన న్యాయమూర్తి తిమ్మరుసు మంత్రికి ఇలా వివరించాడు.
‘‘విజయనగర సామ్రాజ్య నిర్మాతగా ఈ రాజ్యం మిమ్ములను ఆప్తుడిగా భావించింది. ప్రభువులు తండ్రి సమంగా ఆదరించారు. నలభై ఏళ్ళు ఈ రాజ్యానికి ప్రధానమంత్రిగా సేవలందించారు.
అయినా ప్రభువులు ఈ సందర్భంలో మీకు కృతజ్ఞత చూపించనవసరం లేదని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యంలో గతంలో మీరు మీ బాధ్యతను పూర్తిగా నెరవేర్చలేదు. ఆనాడు మహారాజుగా ఉన్న ప్రభువు సోదరుడు మహారాజుగారి కళ్ళు పీకించమని మీకు ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞను మీరు నెరవేర్చక వారిని మోసగించి మేక కన్నులు చూపి ద్రోహం చేశారు. ఇప్పుడు రాకుమారుని విషప్రయోగం చేసి చంపించటంవల్ల మళ్లా రాజద్రోహిగా నిలిచారు’’.
మళ్ళీ సభనుద్దేశించి ‘‘ఈ సాళువ తిమ్మరుసు బ్రాహ్మణుడు కాబట్టి మరణశిక్ష విధించలేము. ఈ నేరానికి శిక్ష వీరి రెండు కళ్ళు పొడిచేయటమే!’’ తీర్పు ముగించి ప్రధాన న్యాయమూర్తి మహారాజుకేసి నిస్సహాయంగా చూశాడు.
శ్రీకృష్ణదేవరాయలు తలదించుకొని కనుకొనకుల్లో ఊరుతున్న చెమ్మను కొనగోటితో విదిలించారు. తన కళ్ళు పీకకుండా కాపాడి చక్రవర్తిని చేసిన అప్పాజీకి తానిచ్చే బహుమానం ఆయన కళ్ళు పొడిపించటమా! హా దైవమా! నాకెందుకీ శిక్ష విధించావు.
రాయలు మూగవ్యధతో తీర్పును ఆమోదిస్తున్న సూచన ఇచ్చారు.
‘‘మరో రెండునాళ్ళకు సూర్యోదయానికి ఈ సాళువ తిమ్మరుసు కళ్ళు పొడిచే శిక్ష అమలు చేయమని ప్రభువుల ఆజ్ఞ’’ ప్రధాన న్యాయాధికారి చివరిగా వినిపించాడు.
తిమ్మరుసు హతాశుడైపోయారు. గోవిందరాయల కళ్ళు ఎరుపెక్కినై. అతనేనాడో తిరుగుబాటు ప్రకటించేవాడు, కానీ తిమ్మరుసువల్లే ఆగిపోయాడు.
శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం మీద అద్భుత వైభవంగా విరాజిల్లుతున్న ఆ దృశ్యాన్ని ఆపాదమస్తకం రాయలమూర్తిని కళ్ళారా, మనసారా నిండుగా చూసుకున్నారు అప్పాజీ. కన్నీటి తెర కమ్ముకుంది. రాయల రూపం మసకబారింది. ఇంతలో భటులు వచ్చి తిమ్మరుసును కారాగారానికి తీసుకెళ్తుండగా ప్రభువు పరితాపంలో దిగ్గున లేచి సౌధాంతరాళంలోకి నిష్క్రమించారు.
సభ అంతటా కలకలం.
‘‘ద్రోహం.. అన్యాయం’’ అరిచారెవో! అంతటా అదే నినాదాలు. వెళ్తున్న తిమ్మరుసు ఆగి వెనుదిరిగాడు. చేతులు జోడించి సభకు వందనం చేసి ఇలా అన్నారు.
‘‘అయ్యా! మీ అందరికీ శతాధిక వందనాలు. విధి బలీయం. విజయనగర సామ్రాజ్య పరిరక్షణకు ఇంతకాలం మీరందించిన సేవలు, త్యాగాలు అనుపమానాలు. దయచేసి ఇకమీదట కూడా ఇదేవిధంగా మహాసామ్రాజ్య భారాన్ని వహించండి. ఇదే నా కడసారి ప్రార్థన’’ తిమ్మరుసు భటుల వెంట వెళ్లిపోతుంటే సభ యావత్తూ కన్నీరు మున్నీరుగా అయింది.
రాజరికం ఇచ్చిన ఫలం ఇదా! అంతటి మహామంత్రికే ఈ గతి పడితే తమలాంటి వారి గతి ఏమిటి? ఏ విషకీటకం ప్రభువు మెదడులో జొరబడింది. తమలో తాము గుసగుసలాడుకుంటున్న ఆ సభలో వీరేంద్రుడు మీసం మెలేయటం చంద్రప్పకు అసహనీయంగా వుంది.
***

12
‘‘మనం ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలి. వీరేంద్రుని కుట్రని బహిర్గగతం చేయాలి’’ నవ వధువు మంజరి దేశ క్షేమం కోసం ఆరాటపడుతున్నది.
‘‘మనమేం చేయగలం మంజూ! అంతటి తిమ్మరుసులవారే నేరాన్ని నెత్తిన వేసుకుని తల వంచుకుంటే’’ చంద్రప్ప ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అతని మనసులోని భారం మంజరికే తెలుసు.
‘‘వారు నేరాన్ని అంగీకరించి కాదు తల దించుకుంది. తన పట్ల రాయలవారి నమ్మకం సడలటం చూసిన వేదనతోనే!’’ మంజరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
వాళ్ళిద్దరూ ప్రజల్లో చైతన్యం కలిగించి ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చే ప్రయత్నం చేశారు. నగర ప్రజలంతా మంజరినే సమర్థించారు.
‘‘ఇది అన్యాయం. తిమ్మరుసుల వారికీ శిక్ష విధించటం మేం సహించం’’ ఒక పౌరుడన్నాడు.
‘‘మహామంత్రే లేకపోతే రాయలకి విలువేముంటుంది. ఈ దురన్యాయాన్ని ఆపాలి. పదండి అందరం వెళ్లి ప్రభువుతో మొరపెట్టుకుందాం’’ మరొకడన్నాడు.

- ఇంకా ఉంది

- చిల్లర భవానీదేవి