డైలీ సీరియల్

యమహాపురి 7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదంతా ఎందుకు? నువ్వు స్టేషన్ బయట జవాన్‌తో మాట్లాడ్డం గమనించే, నేను గుమ్మం దాటి వచ్చి నిన్ను రిసీవ్ చేసుకున్నాను. దిసీజ్ జస్టే శాంపుల్. ఇదంతా గంగా మహిమ!’’ అన్నాడు ఈశ్వర్.
గంగాధరం మొహమాటపడి తల వంచుకున్నాడు. అక్కణ్ణిచి ఈశ్వర్ శ్రీకర్‌ని ఆ పక్క గదిలోకి తీసుకెళ్లాడు.
అక్కడ యూనిఫాంలో ముగ్గురు కానిస్టేబుల్స్ ఉన్నారు. ఈశ్వర్ వాళ్లని ‘్థర్టీ, ఫార్టీ, ఫిప్టీ’ అని శ్రీకర్‌కి పరిచయం చేశాడు.
‘‘మీరు చెప్పినవి వీళ్ల నంబర్సులా లేవే’’ అన్నాడు శ్రీకర్.
‘‘కరెక్టే.. అవి వాళ్ల నంబర్లు కాదు- వయసులు. పీటర్ థర్టీ, ఆలీ ఫార్టీ, పెంచల్ ఫిప్టీ..’’
‘‘నా పేరు పెంచల్రావు. సార్ ముద్దుగా పెంచల్ అంటారు’’ వివరించాడు పెంచల్రావు.
‘‘నిజమే- వీళ్లందరికీ సీనియర్ గోల్డెన్ మాన్ పెంచల్ అంటే ముద్దు పడ్డం సహజం. నేనే కాదు, నువ్వూ ముద్దుపడాలి. నో సజెషన్. ఇటీజ్ ఆర్డర్’’ కన్నుగీటాడు ఈశ్వర్.
‘‘వయసొక్కటే నా సీనియారిటీ. యాభై ఏళ్లొచ్చాయని గోల్డెన్ మాన్. అదీ సార్ చెబుతున్నారు’’ అన్నాడు పెంచల్రావు కొద్దిగా సిగ్గుపడుతూ.
‘‘పెంచల్ అలాగే అంటాడు కానీ- ఇతగాడికీ చుట్టుప్రక్కల తెలియని సమాచారం లేదు. ఓ ఎన్‌సైక్లోపీడియా అనుకోవచ్చు. ఇనె్వస్టిగేషన్లకి గొప్పగా ఉపయోగపడతాడు’’ అన్నాడు ఈశ్వర్.
‘‘ఆ ఎన్‌సైక్లోపీడియాలో సగం మేటర్ మేమిచ్చిందే. సార్‌కి పెంచల్ అంటేనే ముద్దు. అందుకని మా ఇద్దరి పేర్లూ చెప్పరు’’ అన్నాడు అలీ.
ఈశ్వర్ నవ్వి, ‘‘పైకి అలాగంటాడు గానీ, అలీ మనసులో వేరే ఊహ ఉంది. అదేమిటంటే, నేను సెక్యులర్ కాదని!’’ అన్నాడు.
ఇటీవల మీడియాలో తరచుగా వినిపించి విసుగు తెప్పిస్తున్న సెక్యులర్ అన్న పదం అక్కడా వినబడగానే శ్రీకర్ కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు.
ఈలోగా పీటర్ అందుకుని, ‘‘అలీ మనసులోనే కాదు, నా మనసులోనూ అదే ఊహ. లేకపోతే మమ్మల్ని కూడా మీతో తీసుకోండి సార్ అని చెప్పాం- కానీ, వద్దని ఇక్కడే వదిలేస్తున్నారు!’’ అన్నాడు.
క్రిందివారిమీద పై అధికారులు జులుం చెయ్యడం పోలీసు కుటుంబంలో రివాజు. అలాంటిదిక్కడ అరమరికలు లేని గొప్ప స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తుంటే- ‘‘నేనిప్పుడే లోకంలో ఉన్నాను?’’ అనుకున్నాడు శ్రీకర్.
‘‘పోలీస్ స్టేషన్లో ఇలా కూడా ఉండొచ్చన్నమాట’’ అనుకుంటూనే, ‘ఇలాగే ఉండాలి’ అని కూడా అనుకున్నాడు.
‘‘అటువైపు రెండు గదుల్లో ఒకటి లాకప్ రూం. ఇంకొకటి మినీ కాంటీన్. మినీ కాంటీన్ నువ్వోసారి చూడాలి పద!’’ అన్న ఈశ్వర్ మాటలతో మళ్లీ ఈలోకంలోకి వచ్చాడు శ్రీకర్. ఇద్దరూ కాంటీన్‌కి వెడితే-
చిన్న గది, గ్యాస్‌స్టవ్, రిఫ్రిజిరేటర్, మిక్సీ, వెట్ గ్రైండర్, మైక్రో ఓవెన్ వగైరాలతో ఓ ఆధునిక మధ్యరగతి మాడ్యులార్ కిచెన్లో ఉండే సదుపాయాలన్నీ అక్కడున్నాయి.
అక్కడ సుమారు ముప్ఫై ఏళ్ల యువకుడు, పాతికేళ్ల యువతి ఉన్నారు.
యువకుడు గళ్ల లుంగీమీద టీషర్టు వేసుకున్నాడు. పెద్దగా చదువుకున్నట్లు అనిపించకపోయినా, ముఖంలో సంస్కారం ఉట్టిపడుతోంది.
యువతి చుడీదార్ వేసుకుంది. చెప్పుకోదగ్గ అందగత్తె కాకపోయినా నాజూగ్గా, ఆకర్షణీయంగా ఉంది.
‘‘ఇతడు చందూ, మా మాస్టర్ కుక్. ఈమె సీత, చందూకి ఇంట్లో భార్య, ఇక్కడ అసిస్టెంటు’’ అన్నాడు ఈశ్వర్. వాళ్ళిద్దరూ చేతులు జోడించారు. శ్రీకర్ ప్రతి నమస్కారం చేశాడు.
‘‘వీళ్లు ఆదర్శ దంపతులు. కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో ఫుల్‌స్టాప్ పెట్టేశారు. చందూ తల్లిదండ్రులు వీళ్లతోనే ఉంటున్నారు. వీళ్లిక్కడున్నప్పుడు- తాతా, బామ్మా- పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. వీళ్లక్కడున్నప్పుడు అత్తమామల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటుంది సీత. వీళ్లని కూడా మన స్ట్ఫాలాగే అనుకోవాలి’’ అని, ‘‘ఇప్పుడు నా రూంకి- అదే నీ రూకి వెడుతున్నాం’’ అన్నాడు ఈశ్వర్.
పెద్ద టేబుల్. దానివెనుక ఎగ్జిక్యూటివ్ ఛెయిర్. బల్లమీద కంప్యూటర్ మానిటరూ, కీబోర్డూ.
బల్లకి ఇవతల నాలుగు మెత్తటి కుర్చీలు. గోడలకి ఆనుకుని ఫైల్సుండే కాబినెట్స్.
ఒక్కమాటలో చెప్పాలంటే- కార్పొరేట్ ఆఫీసుల్లో సిఇఓ గదిలా ఉన్నదా రూం.
‘‘ఇంకా నీకు ఛార్జి ఇవ్వలేదు కాబట్టి- అందాకా బాస్ సీట్లో నేనే కూర్చుటాను’’ అంటూ వెళ్లి టేబుల్ వెనుక కుర్చీలో కూర్చున్నాడు ఈశ్వర్. శ్రీకర్ ఇవతల వైపు ఈశ్వర్‌కి ఎదురుగా కూర్చున్నాడు.
‘‘చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ముందు కర్టెసీ. కాఫీ, టీ, ఎనీథింగ్ కూల్?’’ అంటూ టేబుల్‌పై ఉన్న రిమోట్‌లాంటి పరికరంపై ఓ మీట నొక్కాడు ఈశ్వర్.
‘‘యాజ్ యూ లైక్’’ అన్నాడు శ్రీకర్.
‘‘కాఫీ?’’ అన్నాడు ఈశ్వర్. తలూపాడు శ్రీకర్.
‘‘మిస్టర్ శ్రీకర్! కాఫీ వచ్చేలోగా నీకిప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి. వాటిలో ముఖ్యమైనది- నేనిప్పుడు బదిలీమీద ఎందుకు వెడుతున్నానన్నది..’’ ఆగాడు ఈశ్వర్.
శ్రీకర్ నొసలు చిట్లించి, ‘‘అంటే ఇక్కడ కూడా బాగా పొలిటికల్ ఇంటర్‌ఫియరెన్స్...’’ అని ఆగాడు.
‘‘నో నో నో- అలాంటిదేం లేదు. నిజం చెప్పాలంటే మనకిక్కడ పొలిటికల్ సపోర్టు బాగా ఉంది. సపోర్టంటే రాజకీయంగా కాదులే.. మనమేం చేసినా మన జోలికి రాకుండా ఉండడమే- మనకి పొలిటీషియన్స్ ఇచ్చే గొప్ప సపోర్టు’’ నవ్వాడు ఈశ్వర్.
‘‘కానీ ఈశ్వర్! నిజంగా మనం పద్ధతి పాటిస్తే- నేతలు మనకి సపోర్టు ఇస్తారా?’’ అన్నాడు శ్రీకర్.

ఇంకా ఉంది

వసుంధర