డైలీ సీరియల్

యమహాపురి 39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రి విదిలించుకోబోతే అప్పూ పట్టు బిగించాడు. ఇద్దరిమధ్యా కాసేపు పెనుగులాట. చివరికి చంద్రి, ‘‘రాస్కెల్! ఒంటరిగా ఆడపిల్ల కనబడితే కళ్లు నెత్తికెక్కాయా?’’ అంటూ చాచి లెంపకాయ కొట్టింది అప్పూని.
అప్పూకిది ఊహించని ఘటన. క్షణం పాటు నిశే్చష్టుడయ్యాడు.
అంతలో అక్కడ నలుగైదురుగురు జనం మూగారు. వాళ్లలో కానిస్టేబుల్ సుందరం కూడా ఉన్నాడు.
‘‘ఏం జరిగిందమ్మా?’’ అన్నాడు సుందరం.
అప్పూ కంగారుపడ్డాడు. ఆమె ఏదో చెప్పేలోగా తనే, ‘‘మేమిద్దరం ఫ్రెండ్స్! ఏదో చిన్న మిస్ అండర్‌స్టాండింగ్. ఇది మా పెర్సనల్ విషయం’’ అన్నాడు.
‘‘నాకలా అనిపించడంలేదు’’ అని సుందరం చంద్రివైపు తిరిగి, ‘‘మీరిద్దరూ స్నేహితులని ఇతడంటున్నాడు. ఎప్పట్నించి మీ స్నేహం?’’ అన్నాడు.
‘‘మేము స్నేహితులం కాదు. ఇతడు నాకు కాసేపటి క్రితం పార్కులో పరిచయమయ్యాడు. తన రూంకి రమ్మని బలవంత పెడుతున్నాడు. రానంటే చెయ్యి పట్టుకున్నాడు’’ అంది చంద్రి.
‘‘ఈవ్ టీజింగ్’’ అన్నాడు సందరం వెంటనే.
చుట్టు జనంలో ఒకడు, ‘‘ఇది ఈవ్ టీజింగ్ ఏమిటి? కిడ్నాపింగ్ ఫర్ రేప్’’ అన్నాడు. దీనికి నీ సంజాయిషీ ఏమిటన్నట్లు అప్పూని చూశాడు సుందరం.
‘‘నో నో నో. మీరు అపార్థం చేసుకుంటున్నారు. చెప్పు చంద్రీ! వీళ్లన్నది అబద్ధమని!’’ అన్నాడు అప్పూ.
‘‘వాళ్ళేమన్నారో నాకర్థం కాలేదు’’ అంది చంద్రి అమాయకంగా.
‘‘అమాయకురాలిలా ఉన్నావ్. నాతో స్టేషనుకొచ్చి వీడిమీద కంప్లయింట్ రాసివ్వు. ఆ తర్వాత వీడి సంగతి మేం చూసుకుంటాం’’ అన్నాడు సుందరం.
‘‘నేను రానండి. పోలీస్ స్టేషనంటే నాకు భయం’’ అంది చంద్రి.
‘‘తప్పు చేసింది వీడైతే- ఆడకూతుర్నెందుకయ్యా- స్టేషన్‌కి తీసుకెళ్లడం! నా మాట విని వీణ్ణి స్టేషనుకి తీసుకెళ్లి బాగా దేహశుద్ధి చేసి గట్టిగా వార్నింగిచ్చి పంపించెయ్యండి. ఆ అమ్మాయిని తన మామాన వెళ్లిపోనివ్వడం మంచిది’’ అని ఓ ఉచిత సలహా పారేశాడు ఒకాయన.
సుందరం చంద్రిని వదిలేశాడు. అప్పూని తీసుకుని స్టేషన్‌కి వెళ్లాడు.
****
‘‘అప్పూని స్టేషన్‌కి తేవాలి. అది కాజువల్‌గా ఉండాలి తప్ప, తనమీద పోలీసు నిఘా ఉందని అప్పూకి తెలియకూడదు. నువ్వు భలే ప్లాన్ చేసి వాణ్ణిక్కడికి లాక్కొచ్చావ్. కంగ్రాట్యులేషన్స్!’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఐడియా మీది సార్! ఎగ్జిక్యూషన్ శశిది. నాదేముంది నిమిత్తమాత్రుణ్ణి!’’ అన్నాడు సుందరం.
‘‘అల్ట్రామోడర్న్ కాల్‌గర్ల్ శశి, ఫక్తు పల్లెటూరి పిల్ల చంద్రి పాత్రలో అప్పూని నమ్మించేంతలా జీవించిందన్నమాట! షి ఈజ్ గ్రేట్ అండ్ యు మోడెస్ట్! అది సరే, ఏమంటున్నాడు అప్పూ?’’ అన్నాడు శ్రీకర్.
‘‘దారి పొడుగునా గోలెడుతున్నాడు. తనని వదిలెయ్యమని! లేకపోతే ఉద్యోగం పోతుందిట. నేరం చేసినా, చెయ్యకపోయినా పోలీసు రికార్డుల్లోకి వెళ్లినవాణ్ణి ఉద్యోగంలో ఉంచుకోడట వాడి యజమాని’’.
‘‘గుడ్ పాయింట్! ఇదుపయోగించుకుని మనం వాణ్ణించి కొంత సమాచారం రాబట్టొచ్చు’’ అన్నాడు శ్రీకర్.
ఇద్దరూ ఆ రూంలోంచి లాకప్ రూంలోకి వెళ్లారు.
****
లాకప్ రూంలో మూడు కుర్చీలు. ఒకదాంట్లో సుందరం, ఒకదాంట్లో శ్రీకర్. ఒకదాంట్లో అప్పూ.
‘‘ఇక్కడ మనకి హోదాలతో నిమిత్తం లేదు. అంతా ఫ్రెండ్స్. అందుకే ఇలా కూర్చున్నాం’’ అన్నాడు శ్రీకర్. అప్పూ భయం భయంగా శ్రీకర్‌ని చూశాడు. ఓ అమ్మాయి స్నేహపూర్వకంగా నటించి, రూంకొస్తానని ఊరించి, దారిలో సాచి లెంపకాయ కొట్టింది. ఆ దెబ్బకి తనిక్కడకొచ్చి పడ్డాడు.
ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో తెలియడంలేదు.
‘‘మనం మనసు విప్పి మాట్లాడుకుందాం’’ అన్నాడు శ్రీకర్ మళ్లీ.
‘‘ఇక్కడ బట్టలిప్పి కొడతారనుకున్నాను. ఈయన మనసు విప్పి మాటలంటున్నాడు’’ అనుకున్నాడు అప్పూ.
‘‘ముందు నేను మాట్లడనా? నువ్వు మాట్లాడతావా?’’ అని, ‘‘ఆలోచించుకో. ముందు నేను మాట్లాడితే- నీ పని వినడమే ఔతుంది. మరి మాట్లాడే ఛాన్సుండదు. నువ్వు ముందు మాట్లాడితే చెప్పాల్సింది ఐయిందని నువ్వనేదాకా నేను వింటూనే ఉంటాను’’ అన్నాడు శ్రీకర్. అప్పూ వెంటనే నోరు విప్పి ఆ రోజు జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పాడు.
సుందరం శ్రీకర్ వంక అభినందనపూర్వకంగా చూశాడు. ‘‘్భలే నోరు విప్పించారే’’ అన్నట్లు.
శ్రీకర్ సాలోచనగా, ‘‘దీన్ని బట్టి నీకు నడిరోడ్లో పోర్న్ చూసే అలవాటుందని తెలుస్తోంది’’ అన్నాడు.
‘‘ఈ రోజుల్లో ఇది కామన్ సార్!’’ అన్నాడు అప్పూ.
‘‘ఆడది అంటే అమ్మ, అక్క, చెల్లి, కూతురు. ఇలా అనుకోవడం ఒకప్పుడు కామన్. అందువల్ల వయసులో ఉన్న ఆడది ఒంటరిగా అర్థరాత్రి పూట కనిపించినా- వివరమడిగి సాయపడేవారు మగాళ్లు. ఇప్పుడు నడిబజార్లో మొబైల్స్‌లో పోర్న్ చూడ్డం కామన్ అంటున్నావు నువ్వు. అందుకనేనా పట్టపగలు నడివీధిలో ఆడదానిపై అత్యాచారాలు జరుగుతున్నాయి’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఆ సంగతి నాకు తెలియదు సార్! ఆ అమ్మాయే పోర్న్ చూపించమని నన్నడిగింది సార్!’’
శ్రీకర్ తల పంకించి, ‘‘ఓకె, నువ్వు నిజమే చెబుతున్నావనుకుందాం. అడిగిందని బుద్ధిగా చూపించావ్. మరి వద్దన్నప్పుడు బుద్ధిగా వదిలెయ్యలేదేం?’’ అన్నాడు. అప్పూ తల వంచుకున్నాడు.
‘‘పొరపాట్లు అందరివల్లా జరుగుతాయి. నీది కూడా పొరపాటే అనుకుందామంటే- అందుకు ఋజువేమన్నా చూపించగలవా?’’ అన్నాడు శ్రీకర్.

ఇంకా ఉంది

వసుంధర