Others

ఓ పాపా లాలి.. ( నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆణిముత్యాల వంటి పాటల సమాహారంలో ఆధునిక డిజిటల్ యుగంలో, పాశ్చాత్య నాగరికతా ప్రభావాలని తట్టుకొని నిలబడిన పాట ‘గీతాంజలి’ చిత్రంలో ‘జో పాపా లాలి’. ఈ పాటంటే ఎంత ఇష్టమో మాటల్లో నిర్వచించడం అసాధ్యం. నాగార్జున, గిరిజ నాయకా నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని భాగ్యలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై సియల్ నరసారెడ్డి నిర్మించారు. విలక్షణ, విభిన్న సినిమాల సృష్టికర్త మణిరత్నం దర్శకత్వం వహించారు. 1989లో విడుదలైన ఈ చిత్రం దేశంలో ఒక ట్రెండ్ సెట్టర్. క్లైమాక్స్‌లో ‘జో పాపా లాలి... జన్మకే లాలి... ప్రేమకే లాలి..’ అనే పల్లవితో ఈ పాట బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తుంది. తన ప్రేయసి చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఐసియు బయటి నుంచి నాగార్జున చూస్తూ దుఃఖంతో విచలితుడౌతాడు. ఆమెతో అనుభవించిన మధురక్షణాలను గుర్తుకు తెచ్చుకునే నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. మేఘాన్ని ఉరమకుండా గాలిలో తేలుతూ వెళ్లిపొమ్మని, ప్రేయసి గుండె సవ్వడి లలితంగా ఉండాలని, గాలి కూడా జొరబడని ఆ గదిలో తన పాటను అందించమని కోయిలను హీరో అభ్యర్థిస్తాడు. ఈ పాటలో ప్రతీ పదం భావోద్వేగంతోనేకాక ఎంతో లాలిత్యంతో నిండివుంటుంది. అద్భుతమైన వేటూరి సాహిత్యానికి స్వర మాంత్రికుడు ఇళయరాజా మధుర స్వరాలు తోడవగా గాన గంధర్వుడు ఎస్పీబి తన గొంతులో ఆ బాధను అద్భుతంగా ఆవిష్కరించాడు. ఈ ముగ్గురు సృష్టించిన ఈ పాటకు పిసి శ్రీరామ్ ఫొటోగ్రఫీ ప్రతిభ తోడవగా మణిరత్నం తెరకెక్కించిన వైనం అపూర్వం, అసామాన్యం. తొలి మంచు తళుకులలో పార్కులో ప్రేయసిని హత్తుకొని లాలించి, సేదతీర్చే ఆ దృశ్యం ఇప్పటికీ కనులముందు కదలాడుతుంటుంది. ఆణిముత్యం వంటి పాటను తెలుగుజాతికి కానుకగా అందించిన కళాతపస్వులు, మేధావులు, అభినవ గంధర్వులు, సంగీత కళామతల్లి ముద్దుబిడ్డలకు చేతులెత్తి నమస్కరించటం తప్ప ఇంకేం చెయ్యగలం.

-సి సాయిమనస్విత, విజయవాడ