డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్భరణికి చాలా పెద్ద మిత్ర బృందమే ఉంది. ఎక్కువగా అతడితోపాటూ తిరిగేది మాత్రం రాజు, శ్రీను. వాళ్ళిద్దరూ భరణి క్లాస్‌మేట్లు. ముగ్గురూ కాలేజీలో ఒకరోజే జాయినయ్యారని చెప్పుకుంటుంటే విన్నాను. భరణి ఏం చేస్తున్నా, ఎక్కడికెళ్లినా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పక్కనే ఉంటారు’’.
‘‘ప్రస్తుతం వాళ్ళెక్కడ ఉన్నారో తెలుసా?’’
‘‘్భరణీ శవానికి పోస్టుమార్టమ్ చేసి ఈపాటికి ఇంటికి తీసుకొచ్చి ఉంటారు. బహుశా వాళ్ళు అక్కడే ఉండి ఉంటారు’’ అన్నాడు శివ.
‘‘నేను వాళ్ళతో కూడా మాట్లాడాలి. వాళ్ళ ఫోన్ నెంబర్లు నీ దగ్గర ఉన్నాయా?’’
శివ ఒక్క క్షణం తటపటాయిస్తున్నట్టుగా చూసాడు. ‘‘సార్, భరణికి వచ్చిన ఉత్తరాలని నేను చదివినట్టు మాత్రం వాళ్ళకి చెప్పొద్దు’’ అన్నాడు భయంగా.
‘‘నువ్వు నాకు చెప్పిన విషయాలేమీ వాళ్ళకి నేను చెప్పనులే’’ అన్నాడు శివ భుజమీద చెయ్యివేస్తూ.
***
మర్నాడు పాణి వెళ్లి ఎస్సై రవీంద్రని కలిసాడు. ‘‘్భరణి తాలూకు పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చిందా?’’ అని అడిగాడు.
‘‘వచ్చింది’’
‘‘ఏమని వచ్చింది?’’ ఆసక్తిగా అడిగాడు పాణి.
‘‘పోస్టుమార్టమ్ రిపోర్టులో ఏమీ లేదు. ‘సహజ మరణం’ అని వుంది అంతే.. హఠాత్తుగా గుండె ఆగడంవల్ల, మిగిలిన శరీర భాగాలకి ఆక్సిజన్ అందక చచ్చుబడిపోవడంవల్ల మరణం సంభవించింది అని ఉంది అంతే. ఇవన్నీ సహజ మరణం తాలూకు లక్షణాలని పోస్టుమార్టమ్ చేసిన డాక్టర్లు స్వయంగా చెప్పారు. పోస్టుమార్టమ్ రిపోర్టువల్ల మనకి కొత్తగా తెలిసినది ఏమీ లేదు. కనీసం ఫుడ్ పాయిజనింగ్ కూడా కాదు’’.
ఆశ్చర్యంనిండిన కళ్ళతో చూశాడు పాణి రవీంద్ర వంక. ‘‘నిన్న మీ మేనల్లుడు శివతో మాట్లాడాను’’ అన్నాడు నెమ్మదిగా.
రవీంద్ర ఒక్క క్షణం తత్తరపడ్డట్టుగా చుట్టూ చూశాడు. తరువాత గొంతు తగ్గించి నెమ్మదిగా అన్నాడు పాణితో ‘‘వాడు నాతో ఆ విషయం చెప్పగానే నేను బయట ఎవరితోనూ అనవద్దని చెప్పాను. మీ పరిశోధనకి ఆ సమాచారం ఉపయోగపడుతుందని మీకు మాత్రం చెప్పమన్నాను. వాడి పేరు బయటికి రావడం, అనవసరంగా ఈ గొడవల్లోకి లాగడం నాకు ఇష్టం లేదు’’.
రవీంద్ర వంక ఆశ్చర్యంగా చూశాడు పాణి. అతడితో తనకి పెద్దగా పరిచయం లేదు. ముంబయికి చెందిన ఒక ఫైనాన్షియల్ కంపెనీలో జరిగిన ఒక మోసానికి సంబంధించిన కేసు పరిశోధన నిమిత్తం హైదరాబాద్‌కి ఇనె్వస్టిగేషన్‌కి వచ్చినపుడు ఒకటి రెండు రోజులు అతడితో కలిసి పనిచేశాడు. అంతే.
‘‘మిమ్మల్ని అర్థం చేసుకోగలను. కొద్దిపాటి పరిచయంలోనే నా మీద మీరు ఉంచిన నమ్మకానికి థాంక్స్’’ అన్నాడు.
‘‘మీతో పరిచయంకన్నా మీ గురించి నేను విన్నది ఎక్కువ. అందుకే ధైర్యంగా మా మేనల్లుడికి మీ నెంబరు ఇచ్చి మాట్లాడమని చెప్పగలిగాను’’ పాణి వంక ఆరాధనగా చూస్తూ అన్నాడు రవీంద్ర.
‘‘శివ చెప్పినదాన్ని బట్టి చూస్తే గత కొద్దికాలంగా భరణిని ఎవరో చంపుతానని బెదిరిస్తున్నారు. సడెన్‌గా అతడు చనిపోయాడు. ఆ బెదిరింపులకీ అతడి మరణానికి సంబంధం లేదనుకుందామా అంటే సరిగ్గా అతడు మరణించిన రోజే ఆ బెదిరింపు లేఖలు రావడం ఆగిపోయింది’’.
‘‘కానీ ఆ చంపుతానన్న వాళ్ళు భరణిని చంపలేదు. భరణిది సహజ మరణమని పోస్టుమార్టమ్ రిపోర్టులు చెబుతున్నాయి’’.
‘‘పోస్టుమార్టమ్ చేసిన డాక్టర్లు ఎవరు? వాళ్ళనెవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా? ఆ రిపోర్టులని మనం ఎంతవరకు నమ్మొచ్చు?’’
‘‘హంతకుల సంగతి మనకు తెలియదు కానీ, భుజంగరావుగారికున్న ఇన్ఫ్లూయెన్స్ మాత్రం సామాన్యమైనది కాదు. మా ఏరియా సి.ఐ విశ్వనాధ్‌గారు దగ్గరుండి మరీ అనుభవజ్ఞులైన డాక్టర్లతో డీటెయిల్డ్ పోస్టుమార్టమ్ చేయించారు. అందులో పొరపాటు ఉండే ఆస్కారమే లేదు’’.
‘‘ఆ రోజు భరణితోపాటూ గెస్ట్‌హౌస్‌కి ఎవరు వెళ్ళారు?’’
‘‘తెలియదు. అసలు భరణి స్నేహితులెవరికీ భరణి ఆ రోజు గెస్టుహౌస్‌కి వెళ్లినట్లుగా తెలియదు’’.
ఒక్క క్షణం వౌనంగా ఉండి, తరువాత అన్నాడు పాణి. ‘‘్భరణి కారులోనూ, గెస్ట్‌హౌస్ వాష్‌రూమ్‌లోనూ పరిశీలిస్తే ఎవరో స్ర్తి ఆరోజు భరణితోపాటూ గెస్టుహౌస్‌కి వెళ్లినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి.
‘‘అవును. మా ఫోరెన్సిక్ రిపోర్టులు కూడా ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. కాకపోతే ఆ ఆనవాళ్ళు ఆ రోజువే అయి ఉండాలని రూలేముంది? అంతకుముందువి ఎప్పటివో కూడా కావచ్చు’’.
‘‘కానీ గెస్టుహౌస్ వాచ్‌మెన్ తిరుపతయ్య ప్రతిరోజూ ఉదయానే్న వెళ్లి గెస్టు హౌస్ శుభ్రం చేస్తాడు. ఆ రోజు కూడా ఉదయానే్న అతడు వాష్‌రూమ్స్‌తో సహా అన్ని గదులూ శుభ్రం చేసి తాళం వేసి వెళ్ళాడు. ఆ విషయం అతడు చెప్పాడు.
రవీంద్ర ఏదో ఆలోచిస్తున్నట్టు వౌనంగా ఉండిపోయాడు కాస్సేపు. తరువాత చిన్నగా నవ్వుతూ అన్నాడు తేలికగా ‘‘్భరణి ఈజీ లైఫ్ స్టైల్‌కి అలవాటుపడిపోయిన వ్యక్తి. తరచుగా అమ్మాయిలని తీసుకుని ఎంజాయ్ చెయ్యడానికి గెస్టుహౌస్‌కి వస్తూ ఉండడం అతడి అలవాటు. ఆ రోజు కూడా అలాగే ఎవరో అమ్మాయిని తీసుకుని వచ్చి ఉంటాడు. ‘రసపట్టులో రసాభాస’లా అనుకోకుండా భరణికి ఆయువు మూడి సెడన్‌గా హర్ట్‌ఎటాక్ వచ్చి చనిపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎవరికైనా సమాచారం అందిస్తే విన్న వాళ్ళు ముందర ‘మీ ఇద్దరూ గెస్టుహౌస్‌కి ఎందుకు వచ్చారు?’ అని అడుగుతారు కదా? ఆ ప్రశ్నకి ఏమని సమాధానం చెబుతుంది? అందుకే భరణి మరణించగానే ఆ అమ్మాయి అతడి శవాన్ని అలాగే వదిలేసి గుట్టు చప్పుడు కాకుండా గెస్టుహౌస్‌నుంచి జారుకుని ఉంటుంది.
భరణి జీవన విధానానికి అతడికి రకరకాల శతృవులు ఉండడానికి ఆస్కారం ఉంది. ఆ బెదిరింపు ఉత్తరాలు ఉత్తి బెదిరింపులే. అవి వచ్చినపుడే భరణి మరణం సంభవించడం కేవలం యాదృచ్చికమై ఉంటుంది అంతే!’’

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ