డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిత మాట్లాడలేదు.
‘‘నువ్విలాంటి తప్పుడు దారిలో నడుస్తున్నావని తెలిస్తే అందరూ నిన్ను కాదే.. నన్ను అంటారు, పిల్లల్ని పెంచడం రాని తల్లినని. అయినా నీకిలాంటి ఆలోచనలెందుకొస్తున్నాయే?’’ ఆవేదనగా అంది సుమతి.
‘‘ఏమిటమ్మా నేను చేస్తున్న తప్పు? అతను నా స్నేహితుడు. అతన్ని నేను ఇష్టపడ్డాను, ప్రేమించాను. ఒక మనిషిని ఇష్టపడడం, ప్రేమించడం తప్పెలా అవుతుంది?’’ అమాయకంగా అడిగింది హరిత. సుమతికెలా సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కూతురు చేస్తున్నది నిశ్చయంగా తప్పేనని తెలుసు. కానీ అది ఏ రకంగా తప్పో.. ఆమెకి తెలియదు. ఆ విషయం గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు. అంత తార్కింగా ఆలోచించడం చాలామంది తల్లుల్లానే ఆమెకీ అలవాటు లేదు. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా అంది. ‘‘ఏది తప్పో.. ఏది ఒప్పో.. పెద్దవాళ్ళం మాకు తెలుసు. అతిగా ఆలోచించకుండా నాన్నగారు చూసిన సంబంధం చేసుకో. జీవితంలో సుఖపడతావు. అలా కాకుండా ప్రేమా గీమా అంటూ వెధవ్వేషాలేస్తే కాలేజ్ మానిపించి ఇంట్లో కూర్చోపెడతాను జాగ్రత్త!’’
హరిత కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తన గదిలో మంచంమీద పడుకుని దిండులో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఆమె హృదయం వరుణ్.. వరుణ్.. అని కొట్టుకుంటోంది.
****
జరిగినంతా అతనికి చెబుతూ మధ్య మధ్య ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటోంది హరిత. వరుణ్ ఆమెని ఓదార్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళిద్దరూ యూనివర్సిటీలో పెద్దగా జనం తిరగని చోటులో చెట్టుకింద రోడ్‌కి వెనుకవైపుకి తిరిగి కూర్చున్నారు. అక్కడినుంచి వాళ్ళు ఎవరికీ కనబడరు. కనిపించినా ఎవరూ పట్టించుకోరు.. అక్కడ అలాంటి దృశ్యాలు సర్వసాధారణమైనవి.
‘‘ఇపుడు మా ఇంట్లో ఏదో ఒక సంబంధం చూసి నాకు తొందరగా పెళ్లి చేసేద్దామనుకుంటున్నారు’’ ఏడుస్తూనే చెప్పింది హరిత. వరుణ్ ఏమీ మాట్లాడలేదు.
కొంతసేపయ్యాక అతడు ఆవేశంగా అన్నాడు. ‘‘ఎందుకు హరితా.. ఎందుకిలా పిల్లలు పెద్దవాళ్ళ అభిప్రాయాలకీ నిర్ణయాలకీ బలిపశువుల్లా మారతారు?’’
హరిత ఆశ్చర్యంగా చూసింది. ఆమెకేమని సమాధానం చెప్పాలో ఆమెకి తెలియదు.. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేంత శక్తి, ఆలోచన ఆమెలో ఇంకా లేవు. ఆవే వుండి వుంటే ఆమె బహుశా అతని ప్రేమలో పడివుండేది కాదేమో?’’
‘‘నాకు భయంగా వుంది వరుణ్’’ అతని చేతిని పట్టుకుని అంది.
****
‘‘ఎక్కడినుంచి వస్తున్నావు?’’ హరితని నిలదీసింది సుమతి.
‘‘ఎక్కడినుంచి వస్తాను? కాలేజ్‌కేగా వెళ్లింది? అక్కడినుంచే వస్తున్నాను’’ కోపంగా సమాధానం చెప్పింది హరిత.
‘‘కాలేజ్ నాలుగ్గంటలకే అయిపోతే ఇప్పటిదాకా ఏం చేస్తున్నట్టు?’’
‘‘లైబ్రరీకి వెళ్లి నోట్స్ రాసుకుని వస్తున్నాను’’ నోటికొచ్చిన అబద్ధం చెప్పేసింది.
‘‘కాలేజ్‌కి వెళ్లి చదివింది చాలు. ఇంకా లైబ్రరీకి వెళ్లి నువ్విక్కడ ఎవర్నీ ఉద్ధరించక్కర్లేదు. రేపట్నుంచీ కాలేజ్ అవగానే తిన్నగా ఇంటికిరా.. అర్థమైందా?’’’
‘‘మీ నాన్నగారు నిన్ను సాయంత్రం ఆరు దాటితే బయటికి వెళ్లనివ్వద్దన్నారు. రేపట్నుంచీ నువ్వు కావేరితో కూడా ఎక్కువ తిరగడానికి వీల్లేదు’’
ఆమె ఆలోచనా ధోరణికి హరితకి నవ్వొచ్చింది. ఆడపిల్ల తప్పు చేయాలనుకుంటే ఆరు దాటాకే చేయాలా? ఆ రోజుతో ఆమె స్వేచ్ఛ పూర్తిగా హరించుకుపోయింది. ఒక్క అరగంట ఏ కారణంతోనైనా లేటుగా ఇంటికి వస్తే లక్ష ప్రశ్నలు..
ఎక్కువ సంతోషంగా కనిపించినా అనుమానం.. ఎక్కువ విచారంగా కనిపించినా అనుమానం.. కూతురు తన చెయ్యి దాటిపోకుండా వుండడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది సుమతి.
పిల్లల్ని పాడుచేసేవి అవకాశాలే అని ఆమె అభిప్రాయం. తెలిసో తెలియకో ఒకసారి ఆ అవకాశాన్ని కూతురుకి ఇచ్చింది. మరోసారి ఆ తప్పు చేయదల్చుకోలేదు. అందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నానుకుంది ఆమె.
ఆమె ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా హరిత వరుణ్‌ని కలవడం మానలేదు. రహస్యంగా కలుసుకుంటూనే వుంది. ఆమెకి అతని పట్ల ఆకర్షణ తగ్గకపోగా మరింతగా అతనికి దగ్గిరైంది. కావేరి ఈ విషయంలో రహస్యంగా వాళ్ళకి సహాయం చేసేది.
ఒక్కొక్కసారి వారాల తరబడి అతన్ని కలవడానికి కుదిరేదికాదు. అలాంటప్పుడు హరితకి ఎంతో బెంగగా అనిపించేది. అతను తనకి మొదటిసారి బహుమతిగా ఇచ్చిన బొమ్మని రాత్రిళ్ళు పక్కనే వుంచుకుని చూస్తూ మానసికంగా ఓదార్పు పొందేది.
ఆ బొమ్మ తన చుట్టూ తాను తిరుగుతూ నాట్యం చేస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపించేది హరితకి ఎన్నిసార్లు చూసినా.
***
ఆ రోజు హరిత ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో వాతావరణం అంతా కొత్తగా వుంది. ఇల్లంతా నీట్‌గా సర్ది వుంది. హాలు అద్దంలా వుంది. సోఫాలకి ఇస్ర్తి కవర్లు తొడిగి వున్నాయి. ఫ్లవర్‌వాజ్‌లో తాజా పూలుపెట్టి వున్నాయి.
చూడగానే ఆహ్లాదకరంగా అనిపించేలా వుందా అమరిక. తల్లికి ఇల్లింతా అందంగా సర్దడం కూడా వచ్చా అనిపించిందొక క్షణం ఆమెకి. ఆశ్చర్యంగా ఇంట్లోకి అడుగుపెట్టింది.
గబగబా వంటింట్లోకి వెళ్లి తల్లినేదో అడగబోయింది.
ఎపుడూ లేనిది.. తండ్రి ఆ సమయంలో ఇంట్లో వున్నాడు!
‘‘హమ్మయ్యా.. వచ్చేసావా? నువ్వింకా రాలేదని మీ నాన్నగారు కంగారు పడిపోతున్నారు’’ హరితని చూడగానే అంది సుమతి.
హరితకేదో అర్థమరుూ కానట్లుగా వుంది. ‘‘ఏమిటి సంగతి? ఎవరేనా గెస్టులు వస్తున్నారా?’’ అడిగింది.
‘‘అవును. మీ నాన్నగారి స్నేహితుల చుట్టాలబ్బాయెవరో వస్తానని ఫోన్ చేసి చెప్పాడట’’ చెప్పింది సుమతి.
‘‘నాన్నగారి స్నేహితుడి చుట్టాలబ్బాయా?’’ ఆశ్చర్యంగా అంది హరిత.
‘‘అవును. మొన్న మూర్తిగారమ్మాయి పెళ్లికి వెళ్ళేం కదా? అక్కడ అతను నిన్ను చూసాడట. నువ్వు తనకి చాలా నచ్చావుట. మనవాళ్ళే.. వాళ్ళకిష్టమైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను కనుక్కోండి అని మూర్తిగారితో కబురు చేసాడుట.. నాన్నగారు అతన్ని రమ్మన్నారు’’ చెప్పింది సుమతి.
‘‘పెళ్లిచూపులా?’’ కోపంగా అంది హరిత.
‘‘అతనికిలాంటివంటే ఇష్టముండవంట.. సరదాగా మనింటికి వస్తానన్నాడు. కాసేపు నీతో మాట్లాడి వెళ్తాడుట’’
హరితకీ తతంగంనుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడంలేదు. సుమతి మాత్రం అదేం పట్టించుకోకుండా చెప్పుకుని పోతోంది.
‘‘మూర్తిగారమ్మాయి పెళ్లిలో నేనూ చూశాను అబ్బాయి చాలా బావుంటాడు. ఏదో మంచి బిజినెస్సే చేస్తున్నాడు.

ఇంకా ఉంది