డైలీ సీరియల్

ఒయాసిస్ 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా మంచి పనిచేస్తున్నారు.. అంత అన్యోన్యమైన భార్య.. ఏ రోగమూ, నొప్పి లేకుండా పోవడం.. ఆ దృశ్యం తల్చుకుంటేనే గుండె బద్ధలైపోతుంది.. ఇప్పుడూ నాతోనూ అదే అంటున్నారు.. రోజూ వస్తుండవయ్యా.. కాస్త కాలక్షేపం అవుతుందని...’’ అని వంత పాడారు రణధీర్.
ఇంకో విశేషం ఏమిటంటే.. ఛాయ బాగా చదువుకున్నది. నేను మనుషుల్ని చదివితే, ఆమె పుస్తకాలు చదువుతుంది.. ఒక పుస్తకం చదివితే పదిమంది మనుషుల్ని చదివినట్లు లెక్క.. అందులో ఎప్పటెప్పటివో ప్రాచీన గ్రంథాలన్నీ ఔపోసన పట్టేసింది. పురాణ భారత భాగవతాల్లోని ఎన్ని కథలు చెబుతుందో.. లెక్కలేదు..’’ అన్నాడు అహోబలరావు.
‘‘ఆమె కంపెనీ దొరకటం మీ అదృష్టం..’’ అన్నాడు రణధీర్.
‘‘యూ ఆర్ రైట్’’ అని ఒప్పుకున్నాడాయన.
‘‘తొందరగా ముగిస్తే భోజనాలకు లేవొచ్చు’’ అన్నది ఛాయ.
‘‘నేను వెళ్తానండీ.. చాలా టైమైంది..’’ అంటూ లేచి నిలబడ్డాడు రణధీర్.
‘‘్భలేవాళ్లే.. భోం చేయకుండా ఎలా వెళ్తారు? పొద్దున మీరు ఫోన్ చేసినప్పటినుంచీ, ఆమె మీ కోసం ఏవో వంటలు చేయిస్తోంది..’’ అన్నాడు అహోబలరావు.
‘‘ఇంకోసారి ఎప్పుడన్నా వస్తాను..’’ అన్నాడు రణధీర్.
‘‘ఎన్నిసార్లయినా, ఎప్పుడైనా రావచ్చు.. కానీ ఇప్పుడు మాత్రం భోంచేసి వెళ్లాల్సిందే.. శాస్త్రం ఏం చెబుతుందో తెల్సునాండీ.. ఏ గృహస్థుని ఇంటినుంచి అతిథియైనవాడు, ఆకలితో వెళ్లిపోతాడో, అట్టివాడా గృహస్థు చేసిన మంచి కర్మల ఫలితములను తనతో తీసుకుపోయి, అతను చేసిన చెడ్డ పనుల ఫలితాన్ని గృహస్థుకిచ్చి పోతాడట.. అంచేత మీరు భోం చేసి వెళ్లాల్సిందే..’’ అంటూ రణధీర్ నోరు నొక్కేసింది.
కిందకు వెళ్లాక, అహోబలరావు బాత్‌రూంలోకి వెళ్లొచ్చేలోపల ఛాయ రణధీర్‌కు ఇల్లంతా చూపించిది, బెడ్‌రూంతో సహా.
‘‘చాలా బావుంది..’’ అన్నాడు రణధీర్.
‘‘ఆగర్భ శ్రీమంతులు.. అటు పాలిటిక్స్, ఇటు కాలేజీ, నర్సింగ్ హోం.. వద్దంటే డబ్బు.. ఇంత బిల్డింగ్ కట్టారు గానీ, పూజ రూం ఎక్కడా లేదని ఎవరో అంటే నేనన్నాను.. లక్ష్మీదేవి ఇదే ఇంట్లో ఖడేరావుగా తిష్టవేసుకుని కూర్చుంటే.. వేరే పూజా రూం ఎందుకండీ.. అన్నాను. శే్వత నవ్వేది ఆ మాట అంటే...’’ అన్నది ఛాయ, రణధీర్‌తో నవ్వుతూ..
భోజనాల దగ్గర కూడా ఛాయ రణధీర్ పక్కనే నిలబడి కొసరి కొసరి వడ్డించింది.. స్వీట్ వద్దంటున్నా మరికొంచెం వేసింది.
‘‘మీ కోసం స్పెషల్‌గా ఈ అయిటమ్స్ చేయించాను. మీరు తినకపోతే ఫీలవుతాను..’’ అంటూ బలవంతంగా తినిపించింది.
భోజనాలు అయ్యాక ఒక అయిదు నిముషాలు కూర్చుని ఇంక వెళ్తానంటూ లేచాడు రణధీర్.
‘‘అలాగే’’ అంటూ అహోబలరావు బెడ్‌రూంలోకి వెళ్ళాడు.
రణధీర్‌ని సాగనంపటానికి బయటిదాకా వచ్చిన ఛాయ అతనికొక ప్యాకెట్ అందించింది.
‘‘చిన్న కానుక.. మీరు కాదనకూడదు..’’ అన్నది నవ్వుతూ.
‘‘ఏమిటిది?’’ అన్నాడు రణధీర్.
‘‘ఏదో, నా తృప్తికోసం..’’ అన్నది ఛాయ.
‘‘మృష్టాన్న భోజనం పెట్టారు, చాలు.. ఇంకా ఇదేమిటి?’’ అన్నాడు రణధీర్
‘‘చెప్పాను కదా.. నా తృప్తికోసం.. మీరు తీసుకోకపోతే నేను బాధపడతాను...’’ అన్నది ఛాయ ఆ ప్యాకెట్ అతని చేతుల్లో పెడుతూ.
‘‘అసలు ఏమిటిది?’’
‘‘ఇంటికెళ్లి చూడండి..’’ అన్నది ఛాయ నవ్వుతూ.
తీసుకోక తప్పలేదు రణధీర్‌కి.
కారులో కూర్చున్నాక ప్యాకెటు విప్పి చూశాడు. వెయ్యి రూపాల నోట్ల కట్టలు.. అయిదు లక్షలు.. ఒక క్షణం ఆలోచించి, ల్యాండ్ నెంబర్‌కి ఫోన్ చేశాడు.
‘‘ఎందుకింత డబ్బు నాకిచ్చారు?’’ అడిగాడు రణధీర్.
‘‘నేనేదో తప్పు చేశాననీ, మీ నుంచి తప్పించుకోవడానికి ఈ డబ్బు ఇచ్చాననీ మీరు అనుకోవచ్చు. కానీ నేను ఏ తప్పూ చేయలేదు. మీరు ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు. మరయితే ఈ డబ్బు ఎందుకిచ్చానన్న ప్రశ్న ఎదురుకావచ్చు. శే్వత ఇంట్లో నేను ఉన్నాను కాబట్టి నా మీద మీకు అనుమానం వస్తుంది. కానీ అది మీ అపోహ మాత్రమే.. నిజం కాదు.
అయితే మీరు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తారు. అది మీ డ్యూటీ.. కానీ, నేరం చేసి తప్పించుకునేందుకు మీకు నేను లంచం ఇవ్వటంలేదు. అపోహలతో అనవసరంగా నన్ను ఈ కేసులో ఇరికించవద్దని రిక్వెస్ట్‌తోనే మీకా డబ్బు ఇచ్చాను. అది మొదటి పాయింట్..
ఇక రెండో పాయింట్, అది నా డబ్బు కాదు. శే్వత చనిపోయాక, దాని ఐరన్ సేఫ్ తెరచి చూస్తే అందులో కనిపించిన డబ్బు అది.. దాన్ని నేను తీసుకోదల్చుకోలేదు. ఎవరికైనా దానం చెయ్యాలనుకున్నాను. మీరు హంతకుడి వేటలో ఎంతో శ్రమ పడుతున్నారు. అంచేత ఆ డబ్బు మీకిస్తే దాని ఆత్మ శాంతిస్తుంది..’’ చివరి మాటలు అంటున్నప్పుడు ఆయన గొంతు దుఃఖంలో పూడుకుపోయింది. రణధీర్ నిట్టూర్చాడు. ఈ ప్రపంచంలో నేరస్తులూ ఉన్నారు. వాళ్లతో కల్సి మెల్సి తిరుగుతూ నీతివంతులూ, నిజాయితీపరులూ ఉన్నారు, ఎవరు నేరస్థులు, ఎవరు నిజాయితీపరులూ- అని అంచనా వేయటంలో చాలాసార్లు పొరపాటుపడుతుంటాం.. అనుకుంటూ రణధీర్ కారు స్టార్ట్ చేశాడు.

- ఇంకాఉంది

శ్రీధర