డైలీ సీరియల్

ఒయాసిస్ 22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీరు ఆమెని పెళ్లి చేసుకోలేనందుకు ఎప్పుడన్నా కించిత్ బాధపడ్డారా?..’’
‘‘నెవర్.. అయామ్ ఆల్సో హ్యాపీ..’’ అని నవ్వాడు.
‘‘ఆమె వివాహం అయ్యాక ఎప్పుడన్నా కల్సుకుంటుండేవాళ్లా?’’
‘‘ఏదన్నా.. సందర్భం వచ్చినపుడు.. మేం ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. ఆ ఫ్రెండ్‌షిప్‌ని దూరం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..’’ అన్నాడు హేమంత్.
‘‘మీరు ఒకసారి అమెరికా వెళ్లారని విన్నాను’’
‘‘ఆ.. మా బ్యాచ్‌లోవాడే ఒకడు అమెరికా వెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్నాడు. వాడు బలవంతం చేస్తే ఓ అరడజను మందిమి వెళ్లాం..’’
‘‘శే్వతగారు కూడా వచ్చారా?’’
‘‘ఆమెను కూడా పిలిచాడు.. అంచేత వచ్చింది..’’
‘‘అక్కడ ఎన్నాళ్ళున్నారు?’’
‘‘రెండు వారాలు..’’
‘‘ఏమేం చూశారు?’’
‘‘బోస్టన్ వెళ్లాం.. అక్కడినుంచి కాలిఫోర్నియా వెళ్లాం..’’
‘‘ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నారా? హోటల్ రూంలోనా?’’
‘‘ఫ్రెండ్స్ ఉన్న చోట వాళ్ళ ఇంట్లో.. లేనిచోట.. హోటల్లో...’’
‘‘సరే.. అహోబలరావుగారితో మీ డీలింగ్స్ ఎలా ఉన్నాయి?’’
‘‘బానే మాట్లాడతారు.. అప్పుడప్పుడు కలుస్తుంటాం. ఆమధ్య ఒకసారి శే్వత చెకప్‌కి పంపించింది. చిన్న ప్రాబ్లెం ఉంటే మందులు కూడా రాసిచ్చాను’’ అన్నాడు హేమంత్.
ఆయన దగ్గర సెలవు తీసుకుని రణధీర్ ఆఫీసుకు వచ్చాడు.
సబ్ ఇన్స్‌పెక్టర్ రాజు వచ్చి కూర్చున్నాడు.
డిప్యూటీ కమీషనర్‌గారు శే్వత కేసులో ఏమన్నా ప్రోగ్రెస్ వుందా అని అడిగారండీ. మీరూ ఆ పనిమీదే ఉన్నానని చెప్పాను. రేపు సాయంత్రం కూచుని డిస్కస్ చేద్దామని చెప్పమన్నారు’’ అన్నాడు రాజు.
రణధీర్ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. కాసేపటికి తేరుకుని అడిగాడు.
‘‘రాజు.. నువ్వెప్పుడన్నా ఎవరన్నన్నా ప్రేమించావా?’’
‘‘ఏదోలేండి సర్.. అప్పుడేదో చిన్న పొరపాటు జరిగిపోయింది..’’ అని సిగ్గుపడ్డాడు. అదేంటో చెప్పమన్నాడు రణధీర్.
‘‘కొనే్నళ్ళ కిందటలెండి.. ఇంకా పెళ్లి కాలేదు.. మా పక్క పోర్షన్లో ఉండే అమ్మాయి నా వంకే చూస్తుండేది. నేనూ నవ్వేవాడిని.. ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ధైర్యం చేసి దగ్గరకెళ్లాను. నవ్వుతూనే వుంది. భుజంమీద చెయ్యేశాను.. నవ్వుతూనే వుంది. ముద్దుపెట్టుకున్నాను.. ఇంతలో వాళ్ళన్నయ్య వచ్చాడు. మమ్మల్ని చూశాడు. ఆ అమ్మాయినేం అనలేదు. నన్ను చెంపమీద కొట్టాడు. తల్చుకుంటే ఇప్పుడే కొట్టినట్లుంది..’’ అన్నాడు చేత్తో చెంప సవరించుకుంటూ..
రణధీర్ నవ్వాడు ‘‘ఇప్పుడు ఆ సంఘటన తల్చుకుంటే ఎలా ఉంటుంది? నీకు ముద్దు పెట్టుకున్నందుకు గర్వంగా ఉందా? దెబ్బతిన్నందుకు బాధగా ఉందా?..’’
‘‘దెబ్బదేముంది.. వెధవ దెబ్బ.. కానీ ఆ వయసులో ఆ పిల్లని ముద్దుపెట్టుకున్న విషయాన్ని ఎన్నిసార్లు గుర్తుచేసుకున్నానో లెక్కలేదు’’.
‘‘సపోజ్.. ఆ అమ్మాయి ఇనే్నళ్ళ తర్వాత నీకు కనిపించిందనుకో.. ఆ అమ్మాయికి పెళ్లయ్యింది. పిల్లలు, భర్త ఉన్నారు. ఒక సందర్భంలో మీరిద్దరూ ఆ రోజులాగేనే ఒంటరిగా తారసపడ్డారు. నిన్ను చూసి అప్పటిలాగే నవ్వుతూనే ఉంది. మళ్లీ ఛాన్స్ దొరికిందని ముద్దెట్టుకుంటావా? పెళ్లయిందని, పరాయివాడి భార్య కదాని వదిలేస్తావా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘సర్, ఒక స్ర్తి ఒక పురుషుడు దొంగతనంగా శారీరకంగా దగ్గరయితే గొప్ప దేవేంద్ర పదవిని పొందినంత తృప్తిగా ఫీలవుతారని నా అభిప్రాయం. మళ్లీ మళ్లీ ఆ పదవి ఎప్పుడు దొరుకుతుందా అన్న ఆలోచన మనసుకు కుమ్మరి పురుగులా తొలుస్తూనే ఉంటుంది సార్...’’ అన్నాడు రాజు.
రణధీర్ నవ్వుతూ రాజుకు షేక్‌హ్యాండిచ్చాడు. రాజు నవ్వుతూ అన్నాడు.
‘‘ఏం సార్.. ఏదన్నా దేవేంద్ర పదవి దొరికిందా మీకు?’’
రణధీర్ సమాధానం చెప్పేలోపల అతని సెల్‌ఫోన్ మోగింది.
‘‘హలో..’’ అన్నాడు రణధీర్.
‘‘ఏం చేస్తున్నారు?’’ అనడిగింది ఛాయ.
‘‘ఎవరు ఛాయగారా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘గుర్తుపట్టేశారే? కొత్త నెంబరు గదా.. గుర్తుపడతారో లేదోననుకున్నా..’’
‘‘నెంబరు కొత్తదైనా మెంబర్ మనవాళ్లే అయినప్పుడు గుర్తుపట్టలేమా?’’ ప్రొద్దున ప్రిన్సిపాల్ ఆమె గురించి చెప్పిన మాటలతో రణధీర్‌కి ధైర్యం వచ్చింది.
‘‘అబ్బా.. చుట్టరికం కలిపేస్తున్నారే?’’
‘‘మనం చుట్టాలమన్న విషయం నిన్ననే తెలిసింది..’’ అన్నాడు రణధీర్.
‘‘అబ్బా..’’ కిల కిల నవ్వింది. ‘‘ఏ రకం చుట్టరికమో?’’ అన్నది.
‘‘వావివరుసలు లేని చుట్టరికం..’’
మళ్లీ కిలకిలా.. ‘‘వావివరసులు లేనివాళ్లెవరో తెలుసు కదా.. కినె్నరలు..’’
‘‘వానరులకీ వావివరుసలుండవు..’’ అన్నాడు రణధీర్.
మళ్లీ అదే కిల కిల.. ‘‘ఒక్కదానే్న ఉన్నాను. రాత్రికి రాకూడదు.. చూడాలని వుంది..’’ అన్నది ఛాయ.
‘‘అంతకన్నానా.. మీ పిలుపే పదివేలు.. పది లక్షలు...’’
‘‘ఆహా.. ఆశ..’’
‘‘వలపార నను జూసి కిల కిల నవ్విన, మేలైన ముత్యాల పేరులిత్తు అన్నాడో కవి..’’ అన్నాడు రణధీర్.

- ఇంకాఉంది

శ్రీధర