డైలీ సీరియల్

ఒయాసిస్ 44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీరు చెప్పింది నిజమేనండి.. కానీ ప్రొప్రయిటర్‌గారు చెప్పిన పని చెయ్యకపోతే, ఆయనకు కోపం వస్తుందండి.. అనుకున్న పని కాదని తెల్సినా, పైవాళ్ళు చెప్పినట్లు చేస్తే వాళ్ళు సాటిస్‌ఫై అవుతారండి.. మేం ఉన్నది వాళ్ళు చెప్పినట్లు చెయ్యటానికేనండి.. అన్నాడు మేనేజర్.
సిటీ దాటి అరగంట ప్రయాణం చేశాక, హైవే మీద నాలుగు మైళ్లు లోపలికి వెళ్ళాక ఒక పల్లెటూరు వచ్చింది. ఆ పల్లె దాటాక ఒక చిన్న మట్టిరోడ్డులోకి తీసుకెళ్ళాడు.
మేనేజర్ చెప్పాడు.. ‘‘చూడండి సార్.. ఈ రాయి దగ్గర నుంచి, ఆ గుట్ట దగ్గర తాటి చెట్టు కనిపిస్తోంది గదా.. అక్కడిదాకా మన వెంచర్ అండి.. మనం నిలబడింది ఇది సిక్స్‌టీ ఫీట్ రోడ్డు.. క్రాస్‌రోడ్స్ అన్నీ పార్టీ ఫీట్...’’
రణధీర్ అడిగాడు.. ‘‘బాగుంది గానీ మీ ప్రొప్రయిటర్‌గారి దగ్గర అందరూ నీలాంటి నమ్మకస్తులే ఉన్నారా?’’
‘‘నాదేముంది సార్.. చిన్న ఉద్యోగిని.. ఆయన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళున్నారండీ..’’ అన్నాడు మేనేజర్.
రణధీర్ ఆ మాటలు వింటూ ఆలోచనలో పడ్డాడు. కనుచూపు మేర అంతా ఆరుబయట ప్రదేశం కావటంవల్ల చల్లగాలి రివ్వున వీస్తోంది. ఆ గాలికి దీప్తి పైట చెంగు పైకెగురుతోంది.
‘‘ఈ గాలి చూస్తుంటే కదలబుద్ధి కావటంలేదు..’’ అన్నది దీప్తి.
‘‘అవును, ఈ పిల్లగాలి చూస్తుంటే కదలబుద్ధి కావటంలేదు..’’ అన్నాడు రణదీర్. మేనేజర్ చూడకుండా, ఆయన చేతిమీద చిన్నగా గిల్లింది నవ్వుకుంటూ, అప్పటికే లేటయిందనీ, క్లబ్‌హౌస్‌కెళ్ళే ప్రోగ్రాం వాయిదా పడింది.
13
సాయంత్రం ఆరు గంటలు అయింది.
పార్క్‌లో పచ్చిక బయలులో చిన్నపిల్లలు బుల్లి బుల్లి అడుగులు వేస్తూ పడుతూ లేస్తూ నడుస్తున్నారు. నడక నేర్చిన పిల్లలు బంతితో ఆడుకుంటున్నారు. కొంచెం పెద్ద పిల్లలు ఉయ్యాలలూగుతున్నారు. కొందరు పెళ్లికాని వయసొచ్చిన పిల్లలు జంటలు జంటలుగా వాళ్ళమధ్య గాలిని కూడా చొరబడనీయనంత దగ్గరగా ఆనుకుని కూర్చున్నారు. పెళ్లి అయిన వాళ్ళుమాత్రం ఎదురెదురుగా కూర్చున్నారు. వయసు మళ్లిన వాళ్లు వీళ్ళందర్నీ చూస్తూ, గతాన్ని నెమరువేసుకుంటున్నారు.
ఛాయ, రణధీర్ ఒక బెంచిమీద కూర్చుని చుట్టూ వున్న ఆహ్లాదకర వాతావరణాన్ని చూస్తున్నారు. సాయంకాలపు నీరెండ కిరణాలు చెరువులోని నీళ్ళమీద పడుతున్నందువల్ల నీళ్ళు తళతళా మెరుస్తున్నాయి. చెట్లమీద నుంచి వీస్తున్న చల్లగాలి ఆప్యాయంగా పలకరించి పోతోంది.
‘‘చాలా ఏళ్ళ తర్వాత ఇలా పార్క్‌కు వచ్చాను, నీ పుణ్యమా అని..’’ అన్నాడు రణధీర్.
‘‘మీరు పార్క్‌కు రావటానికి నా పుణ్యం ఏముంది?’’ అని నవ్వింది ఛాయ.
‘‘నువ్వు పిలవకపోతే వచ్చేవాడ్ని కాదు గదా.. ఈ జంటలు కంటికి ఇంపుగా కనపడేవాళ్ళు కాదు.. ఏమన్నా చెప్పు.. నీ వయసులోని సంగతులు..’’’ అన్నాడు రణధీర్.
‘‘వయసులో ఉన్నప్పుడు గొప్ప విశేషాలేం లేవు.. కాకపోతే యవ్వనంలో ఉన్నప్పుడు అందరూ అందంగా ఉన్నామని అనుకుంటారు గదా.. అలాంటి ఫీలింగ్ నాకూ ఉండేది..’’’
‘‘ఊ.. ఊ.. కవిత్వం ఒలకబోస్తూ రాసేవాళ్ళు.. నడుస్తున్న పూలరథంలా ఉన్నాననీ, సంధించబోతున్న మన్మథ బాణంలా ఉన్నాననీ.. పురివిప్పిన నెమలిలా ఉన్నాననీ.. ఇలాంటివెన్నో...’’ అని నవ్వింది ఛాయ.
‘‘అవన్నీ ఇప్పుడు వరిస్తాయి నీకు.. మరి పెళ్లిచూపులు లాంటివి..’’ అని ఆగిపొయ్యాడు రణధీర్. ‘‘రెండు మూడు సంబంధాలొచ్చాయి.. వాళ్ళేవో ఆంక్షలు పెట్టేవాళ్ళు. చదువు ఆపెయ్యాలనీ, ఉద్యోగం చెయ్యరాదనీ, మడి గట్టుకుని వంటలు చెయ్యాలనీ.. వాళ్ళ కుటుంబ చట్రంలో ఇమిడిపోవాలన్నది వాళ్ళ కోరిక.
వాళ్లు ఓ.కె. చేసినా, ఆ షరతులు నచ్చక నేనే వద్దన్నాను.. పొగరు అన్నారు. నాకింక పెళ్లి కాదని శపించారు. నా ధ్యాసంతా చదువుమీద ఉండేది.. పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదు..’’ అన్నది ఛాయ.
‘‘ఇప్పటికైనా గాలి మళ్లినందుకు సంతోషమే.’’
‘‘ఎదురుచూడని వసంతం తొంగి చూస్తున్నట్లు.. నా ముంగిట్లో ఎక్కడివీ కోకిల గానాలు.. పక్షుల కిల కిలరావాలు. గోరింక వచ్చి నా ముంజేటిమీద వాలినట్లు, నా భ్రమరం నా మోము చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు..’’
‘‘అన్నీ సమ్మోహనాలే.. మరింక ఏమిటీ సంకోచం?..’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఒక్కసారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, అదో పెద్ద పీడకలలా ఉంది. భయం వేస్తోంది.. అందుకే సంకోచం.. మనసు డోలాయమానంగా ఉంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను.. సలహా చెప్పి ఎటు పోవాలో గైడ్ చేసేవాళ్ళు లేరు.. ఈ సమయంలో మీరొక్కరే నాకు కనిపిస్తున్నారు మార్గదర్శిలాగా..’’ అన్నది ఛాయ.
‘‘అసలింతకీ నీ సమస్య ఏమిటి? నీకు భయం దేనికి?..’’
‘‘మీకు తెల్సినదే.. కొత్త విషయం ఏమీ లేదు. నేను కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్‌గా ఉన్నందువల్ల అహోబలరావు గారి కుటుంబంతో పరిచయం కలిగింది. సాయంత్రం పూట ఆమె ఇంట్లో ఉండేది కాదు. ఆమెకు నర్సింగ్ హోమే సర్వస్వం.. డాక్టర్‌గా ఆ డెడికేషన్ అవసరం.. ఆయన ఎక్కువగా ఒంటరిగా ఉండేవాడు. కంపెనీ కోసం రోజూ నన్ను రమ్మనేవాడు. ఆయన పెద్దగా చదువుకోనందువల్ల నా సలహాలు ఆయనకు నచ్చేవి. ఆ విధంగా భార్య తర్వాత ఆయన చిన్న చిన్న విషయాల్లోనూ నాతో సంప్రదించేవాడు. విధి వక్రించింది. శే్వత ఆయన జీవతంలో తీరని లోటు మిగిల్చి వెళ్లిపోయింది. ఆ ఖాళీ పూడ్చగల మనిషిని నేనే అని ఆయన చెప్పకనే చెబుతున్నాడు..’’ అని ఆగిపోయింది ఛాయ.

- ఇంకాఉంది