డైలీ సీరియల్

ఒయాసిస్ 53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంచేత అతని ఇంటిమీద, కంపెనీ మీద వ్యాపారం చేస్తున్న అన్ని చోట్ల వెంటనే అతను తేరుకునే లోపల రైడింగ్ చేస్తే మరికొంత కాంక్రీట్ ఎవిడెన్స్ దొరుకుతుందేమోనని నా ఆశ...’’ అన్నాడు రణధీర్.
కొద్దిసేపట్లోనే పదిమంది ఆఫీసర్లు, పాతికమంది పోలీసులు నాలుగు వెహికల్స్‌లో బయల్దేరారు.
ఒక వెహికల్ రాజశేఖర్ ఇంటివైపు, ఒక వెహికల్ ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీ వైపు, ఒక వెహికల్ ఆయన చిట్‌ఫండ్ కంపెనీ వైపూ మరొక వెహికల్ ఊరికి దూరంగా ఆయన జోరుగా డ్రగ్స్ వ్యాపారం సాగిస్తున్న క్లబ్ హౌస్ వైపు శరవేగంతో దూసుకుపోయాయి.

16
రాజశేఖర్ ఇంటి ముందు పోలీసు వెహికల్ ఆగింది. నలుగురు ఇన్స్‌పెక్టర్లు, ఎనిమిదిమంది కానిస్టేబుల్స్ ఇంట్లోకి బాణాల్లా దూసుకుపోయారు.
ఆ సమయంలో రాజశేఖర్ ఇంట్లోనే ఉన్నాడు. టీవీలో టక్కరి దొంగ చక్కని చుక్క సినిమా చూస్తున్నాడు. ఇంతమంది పోలీసులు ఒక్కసారి ఇంట్లోకి చొరబడటంతో నివ్వెరపోయాడు. ఇద్దరు ఇన్స్‌పెక్టర్లు రాజశేఖర్‌కి చెరోవైపునా నిలబడి, కణతలకు పిస్టల్ గురి పెట్టారు.
‘‘వాట్.. వాటీజ్ దిస్?..’’ అన్నాడు రాజశేఖర్.
‘‘ఇంతవరకూ ఏ టెర్రరిస్ట్ కూడా పోలీసు ఆఫీసర్‌ను పార్సెల్ బాంబుతో చంపాలని ప్రయత్నించలేదు.. వాళ్ళకు రాని ఆలోచన నీకు వచ్చిందంటే, నవ్వు వాళ్ళకన్నా భయంకరమైన వ్యక్తివి..’’ అన్నాడు రణధీర్.
‘‘నేనేం చేశాను?..’’ అన్నాడు రాజశేఖర్.
‘‘నువ్వేం చేశావో, నేను చెబితేగానీ నీకు తెలియదా? అది కూడా త్వరలోనే నీకే కాదు, దేశమంతా వినేటట్టు చెబుతాను...’’
కానిస్టేబుల్స్ ఇల్లంతా వెతుకుతున్నారు. ఒకతను ఆయన టేబుల్ సొరుగులో ఉన్న ఫొటో చూసి రణధీర్‌కిచ్చాడు. రాజశేఖర్ శే్వతకు పంపించిన మార్ఫింగ్ చేసిన ఫోటో అది.
‘‘ఇదిపెళ్లి ఫొటోలా వుంది.. మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఆ.. అవును.. పెళ్లి చేసుకున్నాం.. రహస్యంగా చేసుకున్నాం..’’ అన్నాడు రాజశేఖర్ గుటకలు మింగుతూ.
‘‘ఎక్కడ చేసుకున్నారు?’’ ఎప్పుడు చేసుకున్నారు?’’
‘‘సీక్రెట్‌గా చేసుకుందామని అన్నది.. అందుకని..’’
‘‘ఆమెకు పెళ్లి అయింది. భర్త ఉన్నాడు. మీకు పెళ్ల అయింది. భార్య ఉంది. విడాకులు తీసుకోకుండా మరొక వివాహం ఎలా చేసుకుంటారు?’’ అని అడిగాడు రణధీర్.
‘‘త్వరలో విడాకులు తీసుకుందామని అనుకుంటుండగా ఆమె మన మధ్య లేకుండా పోయింది..’’ అన్నాడు రాజశేఖర్ పొంతన లేని సమాధానం చెబుతూ.
‘‘పెళ్లి అయిన తర్వాత పెళ్ళికొడుకూ, పెళ్లికూతురూ కల్సి తీయించుకున్న బస్ట్ సైజు ఫొటో ఇది.. కానీ పెళ్లి సమయంలో మరికొన్ని ఫొటోలు కూడా తీస్తారు గదా.. అవి ఏవన్నా ఉన్నాయా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘అవేమీ లేవు..’’ అన్నాడు రాజశేఖర్.
ఇదివరలో దీప్తితో రణధీర్ ఆయన దగ్గరకొచ్చినప్పుడు, రాజశేఖర్ పులిలా కనిపించాడు. ఈ చరాచర జగత్తునంతా శాసించగలను- అన్నంత ధీమాతోకనిపించాడు.
అదే రాజశేఖర్ ఇప్పుడు పిల్లిలా భయపడుతూ కనిపిస్తున్నాడు.
ఆయన భవనంలో పనిచేస్తున్న పనివాళ్ళంతా హాల్లోకివచ్చి తప్పు చేసి దొరికిపోయిన వాళ్ళలాగా ఒక పక్క గోడను ఆనుకుని నిలబడి బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు.
కిచెన్‌కి ఆనుకుని వున్న స్టోర్ రూంకి తాళం వేసి ఉంది. కానిస్టేబుల్స్ ఏ ఒక్క రూమూ వదలటంలేదు. ఇల్లంతా అణువణువూ చివరకు గోడలకు తగిలించే ఫొటోలూ, కలెంటర్ల చాటున వెతుకుతున్నారు.
స్టోర్ రూం తాళం పగులగొట్టారు. అందులోనూ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అటకమీద చీకటిగా ఒక మూలనుంచి నల్ల పిల్లి వాళ్ళమీదకు దూకి మెరుపులా పారిపోయింది.
అనుకోని సంఘటనకు కానిస్టేబుల్ కొంచెం వెనకడుకు వేశాడు. వెంటనే లాఠీతో తడిమాడు. లాఠీకి ఏదో తగిలింది. ఇంకో పిల్లి ఉందేమోనని పక్కకు జరిగి లాఠీతో కొట్టి శబ్దం చేశాడు. కానీ పిల్లిగానీ, పిల్లి పిల్లలుగానీ బయటపడలేదు.
చీకట్లో కనిపించటంలేదని, కనిపించిన స్విచ్‌లన్నీ వేశాడు. ఒక లైటు వెలిగింది. అటక అంచు పట్టుకుని పైకి లేచి చూశాడు. ఒక మూల చిన్న సంచీ కనిపించింది. లాఠీతో ముందుకు లాగి, కింద పడేశాడు.
ఆ సంచీ నుంచి దుర్వాసన వస్తోంది. ముక్కుకు చేతి గుడ్డ అడ్డం పెట్టుకుని ఆ సంచీని విదిలించాడు. అందులోనుంచి కోటులాంటిది బయటపడింది. ఎడమ చేత్తో దాన్ని ఎత్తాడు. అది కోటు కాదు. నల్లని రంగులో ఉన్న షేర్వాణీ.. దాని మీద ఎండిపోయి అట్టగట్టినట్లున్న రక్తం మరకలున్నాయి. ఉండలా మడిచిన షెర్వాణీని గట్టిగా విదిలించేటప్పటికి అందులో నుంచి కత్తి బయటపడింది. దాని నిండా గడ్డ కట్టి ఎండిపోయిన రక్తం తాలూకు చిహ్నాలు కనిపించాయి.
కానిస్టేబుల్ వాటిని అలాగే ఒక చేత్తో షెర్వాణీని, మో చేత్తో కతితని మునివేళ్ళతో పట్టుకుని, లాఠీని చంకలో పెట్టుకుని కిందకి దిగి రణధీర్ దగ్గరకొచ్చాడు.
ఆ షెర్వాణీ, కత్తిని చూడగానే రణధీర్‌కి అర్థమైపోయింది.
అశ్వినీ నర్సింగ్ హోంలో డాక్టర్ శే్వతను హత్య చేసిన తర్వాత, అక్కడ ఆయుధం ఏమీ కనిపించలేదు. అన్ని కత్తిపోట్లు పొడిచాక కత్తి రక్తంలో తడిసిపోకుండా ఉండదు. ఆ కత్తిని బాత్‌రూంలో వాష్‌బేసిన్ దగ్గర కడిగిన ఆనవాళ్ళూ కనిపించలేదు.

- ఇంకాఉంది

శ్రీధర