డైలీ సీరియల్

ఒయాసిస్ 54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకవేళ కత్తిని తనతో తీసుకుపోయి ఉంటే ఒకటిరెండు చోట్ల రక్తం బొట్లు అయినా ఫ్లోరింగ్ మీద కనిపించేవి. అప్పుడు అక్కడ వాడిన ఆ ఆయుధం ఎలా మాయమైందన్నదానికి ఇప్పుడు సమాధానం దొరికింది.
హంతకుడు కసిగా శే్వతను పొడిచినప్పుడు రక్తం అతనికీ అంటుకుంటుంది. అందుకని ముందుగానే ఈ విషయం ఊహించి నల్లని షెర్వాణీ ధరించి వచ్చాడు. కత్తితో పొడిచి శే్వతను చంపాక కత్తి ఆమె శరీరం మీదనుంచి తీసి విప్పిన షెర్వాణీలో ఉంచి దాన్ని ఉండలా చుట్టి, తనతో తీసుకెళ్ళాడన్నమాట.
హత్యా సమయంలో ధరించిన షెర్వాణీలో కత్తి భద్రంగా దాచి స్టోర్‌రూంలో అటకమీద వుంచాడు. ఆ కానిస్టేబుల్ మునివేళ్ళతో ఎత్తిపట్టుకున్న షెర్వాణీని, కత్తినీ చూపిస్తుండగా మరో కానిస్టేబుల్ వచ్చి, ఫొటోలు తీశాడు. పైకి వెళ్లి స్టోర్‌రూం, అటక, సంచీ దాచిన చోటు అన్నీ ఫొటోలు తీశాడు. చివరకు, అక్కడ కింద పడి వున్న సంచీతోసహా దేన్నీ వదలలేదు.
రాజశేఖర్ కణతలకు పిస్టల్ గురిపెట్టి చూపిస్తూనే, అతన్ని బయటకు తీసుకొచ్చి వెహికల్‌లో కూర్చోబెట్టారు.
‘‘నేను బెడ్‌రూంలోకి వెళ్లి ప్యాంటు, షర్టూ వేసుకుని వస్తాను..’’ అన్నాడు రాజశేఖర్.
‘‘నీ విషయంలో ఏ మాత్రం రిస్క్ తీసుకోలేం.. పోలీసు స్టేషన్‌కి వెళ్ళక, నీకు పాంట్, షర్ట్ తెప్పించి ఇస్తాం..’’ అని రాజశేఖర్‌ని లుంగీ, బనీన్‌తోనే తమతో తీసుకెళ్ళారు.
డి.జి.పి, అడిషనల్ కమీషనర్‌ల ముందు రాజశేఖర్‌ని హాజరుపరచారు. ఆయన ఇంట్లో దొరికిన షెర్వాణీని, కత్తినీ, క్లబ్‌హౌస్‌లో దొరికిన డ్రగ్స్‌నీ, చిట్‌ఫండ్ కంపెనీలోనూ, రియల్ ఎస్టేట్‌లో సీజ్ చేసిన రికార్డ్స్‌నీ కూడా వాళ్ళముందు ఉంచారు.
జరిగినదంతా రణధీర్ పైఆఫీసర్లకి వివరించాడు.
‘‘డాక్టర్ శే్వత హత్య కేసు చాలా సెనే్సషనల్ అయింది. ఈ కేసులో ఇనె్వస్టిగేషన్ ఎన్నో మలుపులు తిరిగింది. వాళ్ళ పర్సనల్ లైఫ్‌లోని అనేక విషయాలను, వివరాలనూ సేకరించిన తర్వాతగానీ, హంతకుడి ఆచూకీ దొరకలేదు..’’ అన్నాడు రణధీర్.
‘‘ఐ కంగ్రాచ్యులేట్ యు.. రణధీర్..’’ అన్నాడు డి.జి.పి.
‘‘్థంక్యూ సర్.. ఐ డిడ్ మై డ్యూటీ..’’
‘‘సాయంత్రం మీడియా మీటింగ్ ఏర్పాటుచేసి, కేసు సాల్వ్ చేసినట్లు చెప్పండి..’’ అన్నాడాయన.
సాయంత్రం అనుకున్నట్టుగానే మీడియా సమావేశం ప్రారంభమైంది. ఆ ప్రోగ్రామ్‌ను అన్ని టివి చానల్స్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. రణధీర్, శంభుప్రసాద్ మీడియాకు బ్రీఫ్ చెయ్యటానికి వచ్చారు. వాళ్ళకు కొంచెం ఎడంగా రాజశేఖర్‌ను నిలబెట్టారు. నలుగురు కానిస్టేబుల్స్ అతన్ని చుట్టుముట్టి ఉన్నారు.
రణధీర్ మాట్లాడటం మొదలుపెట్టాడు.
‘‘కొద్ది రోజుల క్రిందట అశ్వినీ నర్సింగ్ హోంలో డాక్టర్ శే్వత అనేక కత్తిపోట్లకు గురై చనిపోయిన విషయం మీకు తెల్సు.. వెంటనే మా డిపార్ట్‌మెంట్ హత్య కేసును పరిశోధించి, హంతకుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. రాజశేఖర్ అనే వ్యక్తి ఆమెను హత్య చేసినట్లుగా పరిశోధనలో తేలింది...
‘‘రాజశేఖర్‌ను అరెస్టు చేసి తీసుకొచ్చాం.. త్వరలోనే కోర్టులో కేసు దాఖలు చేస్తాం..’’ అని ముగించాడు రణధీర్.
అయితే మీడియా వాళ్ళు ఊరుకోలేదు. ‘‘రాజశేఖర్ హత్య చేసినట్లు నిరూపించటానికి తగిన ఆధారాలున్నాయా?’’ అని అడిగారు.
‘‘ఉన్నాయండీ.. అవన్నీ కేసు విచారణ సమయంలో కోర్టువారి ముందుంచుతాం..’’ అన్నాడు రణధీర్.
‘‘అసలు హత్య ఎందుకు జరిగింది? మోటివ్ ఏమిటి?’’’
‘‘తనతో వివాహేతర సంబంధం పెట్టుకోమని రాజశేఖర్ శే్వతని కోరాడు. ఆమెను లొంగదీసుకోవడానికి ప్రలోభపెట్టాడు. ఆమె లొంగలేదు. ఆమెను బెదిరించాడు.. ఆమె లెక్క చేయలేదు. ఇద్దరిమధ్యా ఘర్షణ జరిగింది. ఆ క్రమంలో రాజశేఖర్ పక్కా ప్లాన్‌తో ఆమెను చంపి, ఎలాంటి ఆధారాలు దొరకకుండా చాలా ప్రీప్లాన్డ్‌గా హత్య చేశాడు..’’ అన్నాడు రణధీర్.
‘‘అసలు వీళ్ళ పరిచయం ఎలా జరిగింది? ఆ పరిచయం ఎలా పెరిగింది? ఎలాంటి ప్రలోభాలు పెట్టాడు? ఎలాంటి బెదిరింపులు చేశాడు.. వివరాలు కావాలి..’’ మీడియా ప్రశ్న.
‘‘మర్డర్ కేసు విచారణ ప్రారంభించాం.. అనుకోకుండా మరికొన్ని నేరాల వివరాలూ బయటపడినయి.. అనుమతి లేకుండా నగరానికి కొన్ని మైళ్ళ దూరంలో క్లబ్ హౌస్ పేరుతో అక్రమ కార్యకలాపాల అడ్డాను నడపడం, డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ చేయటం, ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇస్తున్నట్లు కొంతమంది అమ్మాయిలకు ఆశపెట్టి, వాళ్ళను విదేశాల నుంచి డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ చేసే ఏజెంట్లుగా వాడుకోవటం- ఇవి ఈయన చేస్తున్న కొన్ని అక్రమాలు.. వీటిని బయటపెడతానని చెప్పటంవల్ల, ఆమె వల్ల తను జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో- ఆమెను హత్య చేశాడు. ఇది ప్రధానమైన కారణం అని చెప్పాలి..’’ అన్నాడు రణధీర్.
‘‘ఆయన ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమని.. చిట్‌ఫండ్ కంపెనీ యజమాని.. ఈయనను అరెస్టు చేసినందువల్ల కంపెనీలు మూతపడతాయి. వేలాదిమంది కస్టమర్లు నష్టపోతారు.. అంచేత వాళ్ళకు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీమీద ఉంది. ఆయన డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు మీరు రుజువు చేయగలరా..’’- ప్రశ్న.
అన్ని ఆధారాలూ ఉన్నాయి.. ఆయన నడుపుతున్న క్లబ్ హౌస్‌లో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయో.. అవన్నీ ఫొటోలు తీశాం.. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం..’’ అన్నాడు రణధీర్.
‘‘నష్టపోయే కస్టమర్ల సంగతేంటి?’’
‘‘వాళ్ళు కూడా కోర్టులో కేసు వేసుకోవచ్చు.. ఆయనకు విలువైన ఆస్తులున్నాయి.. వాటిని అమ్మి తమకు రావాల్సిన డబ్బు ఇప్పించమని కోర్టును ఆశ్రయించవచ్చు.

- ఇంకాఉంది

శ్రీధర