డైలీ సీరియల్

కొత్త స్నేహితులు 42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నిన్ను చూస్తే జాలేస్తోంది నాకు. నీ పేరేమో సామ్రాట్. నువ్వు చూస్తే అరేబియా బానిసలా నాకు సేవలు చేస్తున్నావు’’ అంది సాహిత్య.
‘‘ఇష్టమైన వాళ్లు ఇష్టమైన పని ఏం చేసినా, ఎలా చేసినా కష్టంగా ఉందనే విషయం నీకు తెలియంది కాదుగా! అయినా ఒక భార్యకు భర్త అయినవాడు చేసే పనులేగా నేను చేస్తున్నదీ!’’
‘‘ఏవిటీ.. మళ్లీ రాత్రి మన మధ్య కూర్చున్నావిడ గుర్తొచ్చిందా..? మాటలు తేడాగా వస్తున్నారుూ!’’ అంది సాహిత్య.
‘‘నువ్వేమనుకున్నా సరే.. నేను నీ భర్తను కాకపోయినా.. ఒక భర్త తన భార్యకు ప్రయాణంలో ఏమేం పనులు చేస్తాడో అన్నీ చేయాలనేది ఎప్పటినుంచో ఉన్న కోరిక నాకు’’ అన్నాడు సామ్రాట్.
‘‘నువ్వేం మాట్లాడుతున్నావో నీకర్థవౌతోందా?’’ అంది సాహిత్య కోపంగా.
‘‘నేను పూర్తి స్పృహతోనే, ఆరోగ్యకరమైన మనసుతోనే ఈ మాటలంటున్నాను. మనం తిరిగి వెళ్ళే లోపులోనే నా మాటల్లోని అంతరార్థం నీకూ అర్థవౌతుందని నా విశ్వాసం. ఇహ ట్రైన్ దిగుదామా?’’ అంటూ బ్యాగ్‌లు పట్టుకుని ముందుకు నడిచాడు సామ్రాట్.
స్టేషన్ నుంచి బయటికొచ్చాక ముందుగా ఎదురొచ్చిన ట్యాక్సీ అతనితో బేరసారాలేవీ చేయకుండా అతనికి బ్యాగ్‌లు అందించి అతడి వెనుకే నడిచి అతడు చూపించిన ట్యాక్సీలో కూర్చున్నాడు సామ్రాట్, సాహిత్యతో కలిసి.
ట్యాక్సీ బయల్దేరాకా, ‘‘ఈ ట్యాక్సీ అతను నీకు చుట్టమా? లేక నువ్వతనికి రెగ్యులర్ కస్టమర్‌వా?’’ అంది సాహిత్య మెల్లగా సామ్రాట్ చెవిలో.
ఆమె వైపు ఓసారి చూసి నవ్వి ‘‘అవును ఏటా.. ఒక్కో అందగత్తెతో కలిసి ఇలా ఇక్కడికొస్తూంటాను. ప్రతిసారీ ఇతడే మా అద్దె రథానికి సారథి. అందుకే కనీసం ఎక్కడికెళ్లాలో కూడా ట్యాక్సీ అతనితో నేను చెప్పలేదు. గమనించావా?’’ అన్నాడు సామ్రాట్.
సాహిత్య ఈసారతణ్ణి అనుమానంగా చూస్తూ అంది, ‘‘నిజమే సుమా! ఈ విషయం ఇప్పటివరకూ గమనించలేదు. ఇదిగో ట్యాక్సీ అబ్బాయ్! ఎక్కడికెళ్లాలో చెప్పకుండానే ఎక్కడికి తీసుకుపోతున్నావ్ మమ్మల్ని?’’
అతడు తల తిప్పకుండా, ‘‘ఇప్పుడు కాకపోతే కాస్సేపయ్యాక అయినా మీరే చెప్తారు కదా! అయినా ట్యాక్సీ ఎక్కింది ఎక్కడికో ఒక చోటికి వెళ్లడానికేగానీ అందులో కూర్చుని కాలక్షేపం చేయడానిక్కాదు కదా!’’ అన్నాడు.
అతడి తర్కానికి సాహిత్య ఆశ్చర్యపోతోండగా, సామ్రాట్ నవ్వి ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు. అప్పటివరకూ నెమ్మదిగా ట్యాక్సీని పొనిస్తోన్న అతను వేగం పెంచాడు.
పది నిమిషాల్లో హోటల్ ముందాగింది ట్యాక్సీ. హోటల్ గదిలోకి వెళ్లి, స్నానాది కార్యక్రమాలు ముగించుకున్నాక అంది సాహిత్య, ‘‘ఏవిటి తర్వాత కార్యక్రమం?’’
‘‘మనిద్దరం కలిసి ఇక్కడికిరావడంవరకే ఆలోచించాను. ఆ మాత్రపుటాలోచనకే నా మెదడు శూన్యంగా అయిపోయింది. ఇప్పుడేం చేయాలో ఇద్దరం కలిసి ఆలోచించాలి’’ అన్నాడు సామ్రాట్.
‘‘నా వైపు నుంచి నీకు పనికివచ్చే సలహాలేమీ ఉంటాయనుకోను. ఎందుకంటే ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అన్నీ నీవే. నేను నిమ్తిమాత్రురాల్ని మాత్రమే!’’
‘‘అంటే నాతో ఇలా రావడంలో నీకెటువంటి ఆనందమూ లేదా? నేను రమ్మన్నానని ఇష్టం లేకపోయినా కేవలం నాకోసం నాతో వచ్చావా? నీ మనసులో ఎటువంటి కోరికా లేదా?’’
‘‘కోరికంటే..?’’’
‘‘కోరికంటే.. నాతో కలిసి రకరకాల ప్రదేశాలూ చూడాలని, నాలుగు దుకాణాలూ తిరిగి నచ్చిన వస్తువులు కొనాలని, పూటకో హోటల్‌లో వివిధ రకాల తినుబండారాల్ని రుచి చూడాలనీ.. ఇలా ప్రతి అనుభూతినీ, అనుభవాన్నీ నాతో పంచుకోవాలనే కోరికలేమీ లేవా నీకు?’’
‘‘నీతో కలిసి ఇలా రావడం నాకూ ఇష్టమే సామ్రాట్. నువ్వు చెప్పినవన్నీ నీతో కలిసి చేయాలని నా మనసులోనూ ఉండబట్టేగా ఇంత దూరం వచ్చాం ఇద్దరమూ?!’’ అంది సాహిత్య.
‘‘అలా అయితే.. తర్వాతి కార్యక్రమం గురించి నన్నడగడమెందుకూ? నువ్వే నిర్ణయించొచ్చుగా!’’
‘‘మా ఇంట్లో ప్రతిరోజూ, ప్రతిసారీ చిన్నా, పెద్దా నిర్ణయాలు తీసుకోవడమూ, వాటినమలు పరచడమూ కూడా నాదే బాధ్యత.
మావారితో బజారుకెళితే ఏ దుకాణానికి వెళ్లాలో నేనే నిర్ణయించాలి. ఏం కావాలో నేనే తేల్చుకోవాలి.
ఇంట్లో ఫోన్ చెడిపోయినా, బాత్‌రూమ్‌లో కొళాయి రాకపోయినా, గ్యాస్ అయిపోయినా, సెల్‌ఫోన్ అవకపోయినా, చుట్టాలూ స్నేహితులూ వస్తే వారి బాగోగులు చూడాల్సి వచ్చినా, మా ఇద్దరిలో ఎవరికి బట్టలు కొనాలన్నా ఈ పనులన్నిటినీ నేనే చేయాలి.
కనీసం కొన్నిసార్లైనా, కొన్ని నిర్ణయాలైనా ఎవరైనా తీసుకుని నన్ను ఆబాధ్యత నుంచి తప్పిస్తే బావుణ్ణనేది ఎప్పటినుంచో నా మనసులో వున్న కోరిక.
నీతో పరిచమయ్యాక నువ్వు మావారిలా కాకుండా ఇంటికి సంబంధించిన ప్రతి పనినీ నాలానే బాధ్యతాయుతంగా చేస్తావని తెలుసుకుని ఆనందించాను. నేను నీతో కలిసి రావడానికి వెనుక వున్న ముఖ్యమైన కారణం కూడా అదే!
అందుకే నిర్ణయాలు తీసుకునే బాధ్యతను నామీద ఉంచకుండా, తర్వాతేం చేయబోతున్నావో కూడా నాకు చెప్పకుండా నువ్వేం చెపితే అది చేయడంలోని ఆనందాన్నీ, అనుకోకుండా లభించే అనుభవాల్నీ ఆస్వాదించే అదృష్టం నాకు ప్రాప్తించే మేరకు మొత్తం బాధ్యతనంతా నీ భుజాలమీద వేసుకో!’’ అంది సాహిత్య.
‘‘అరే.. సరిగా నీ మనసులో కోరికే నాకూ ఉంది. నేనూ నీలాగే ఏమీ ఆలోచించకుండా ఆవు వెనుక నడిచే దూడలా.. నువ్వేం చెప్తే అలా చేయడానికీ, ఎలా చెప్తే అలా నడుచుకోవడానికీ మానసికంగా సిద్ధపడి ఎంతో ఆశతో వచ్చాను’’ అన్నాడు సామ్రాట్.

-ఇంకాఉంది

సీతాసత్య