వీరప్పన్‌పై రీసెర్చ్ చేసి సినిమా తీశా: వర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో శివరాజ్‌కుమార్, పరుల్‌యాదవ్, సందీప్ భరద్వాజ్ ముఖ్యపాత్రల్లో శ్రీ కృష్ణ క్రియేషన్స్, జి.ఆర్.పిక్చర్స్, జడ్ 3 పిక్చర్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. బి.వి.మంజునాథ్, ఇ.శివప్రకాశ్, బి.ఎస్.సుదీంద్ర నిర్మాతలు. ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదలవుతున్న సందర్భంగా ఆదివారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ..‘వీరప్పన్ జీవితంలో చాలా చాప్టర్లు ఉన్నాయి. నా కెరీర్‌లో ఈ చిత్రం చేయడం ఓ కొత్త అనుభవం అని చెప్పాలి. వీరప్పన్‌పై చాలా సినిమాలు వచ్చాయి. వీరప్పన్‌ను చంపడానికి 20 సంవత్సరాలు పట్టింది. వీరప్పన్‌ను చంపడం అనే పాయింట్‌పై రీసెర్చ్ చేశాను. చాలా రోజులుగా ఆయన గురించి స్టడీ చేస్తూనే ఉన్నాను. వీరప్పన్‌కు ఏ సంస్థ సపోర్టు, ఏ ఐడియాలజీ లేదు. అతని ఆలోచన అంతా జంతువు తరహాలో వుంటుంది. అతనికి ఎదురొచ్చేవారు శత్రువులు, సపోర్ట్ చేస్తే మిత్రులు అనే పంథాలోనే సాగాడు. ఈ సినిమా వీరప్పన్‌కు సంబంధించిన బయోపిక్ కాదు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి మనిషిని చూడలేదు. అతన్ని పట్టుకోడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు 700 కోట్ల రూపాయలను వెచ్చించింది. చివరకు ఓ మనిషికి వచ్చిన ఆలోచనే అతని అంతానికి మూలమైంది. వీరప్పన్ మరణానికి ప్రధానపాత్ర పోషించిన పోలీస్ అధికారి చేసిన పనులన్నీ చూసి, విని ఇలాంటి పనులు కూడా చేయచ్చా అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని వీరప్పన్ తిరిగిన ప్రాంతంలోనే చిత్రీకరించాం. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, రామ్‌గోపాల్‌వర్మతో ఈ సినిమా చేయడం ఆనందంగా వుందని, ఆయన చేసిన గత సినిమాలు ‘సర్కారు’,‘రక్తచరిత్ర’ తరహాలో ఈ సినిమా కూడా సంచలనం సృష్టిస్తుందన్న నమ్మకం వుందని అన్నారు.