రాష్ట్రీయం

విసిల నియామకానికి కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాబితా తయారీకి కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ * ఎంజి వర్శిటీ ఇన్‌చార్జి విసి మార్పు
హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకాలు మరింత జాప్యం కానున్నాయి. వాస్తవానికి ఏ యూనివర్శిటీకి ఎవరిని నియమించాలనే కసరత్తు ప్రాథమికంగా దాదాపు పూర్తయినా, హైదరాబాద్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ సైతం జాప్యం కానుంది. యూనివర్శిటీల్లో చాలా కాలంగా విసిల నియామకాలు జరగకపోవడం వల్ల పాలన గాడితప్పుతోందని భావించిన ప్రభుత్వం ఈ అంశంపై ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని యోచిస్తోంది. తెలంగాణలో సంప్రదాయ వర్శిటీలు ఆరు, స్పెషాలిటీ వర్శిటీలు ఐదు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, తెలంగాణ యూనివర్శిటీ, మహాత్మాగాంధీ యూనివర్శిటీ, పాలమూరు యూనివర్శిటీ, శాతవాహన యూనివర్శిటీ, జెఎన్‌టియుఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీ, ఓపెన్ యూనివర్శిటీ, తెలుగు యూనివర్శిటీలకు విసిల నియామకాలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నత విద్య సమీక్ష నిర్వహించినపుడు విసిల నియామకాల అంశం ప్రస్తావనకు వచ్చింది. విసిల నియమకానికి ముందే యూనివర్శిటీల చట్టం మార్చాలనుకున్న ప్రభుత్వం తదనుగుణంగా సవరణలను చేసింది.
విద్యాచట్టానికి చేసిన సవరణల కారణంగా నేడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేరుగా ఒకరి పేరును సిఫార్సు చేసే వీలుకలిగింది. సంప్రదాయ పద్ధతిలో సెర్చ్ కమిటీలను వేసినా, తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రిదే కానుంది. రాష్ట్రంలో వైస్ చాన్సలర్ పోస్టు ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వివరాలను తెలియజేస్తూ ప్రభుత్వం త్వరలో ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. దానికి అనుగుణంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జాబితాను సిఎంకు పంపిస్తారు. మరో పక్క ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు, సిఎం ఆఫీసుకు వచ్చిన జాబితాలను నేరుగా సిఎంకు పంపించారు. వీటన్నింటినీ మరోమారు పరిశీలించి చేర్పులు మార్పులు ఏమైనా ఉంటే జరగవచ్చని సమాచారం. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత త్వరగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని తెలిసింది. కాగా తాజాగా మహాత్మాగాంధీ యూనివర్శిటీ ఇన్‌చార్జి విసిగా పాఠశాల విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ టి విజయకుమార్‌ను ప్రభుత్వం నియమించింది.