రాష్ట్రీయం

విశ్వవిద్యాలయాలలో విచ్ఛిన్నకర శక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి ధ్వజం
హైదరాబాద్/ కాచిగూడ, మార్చి 13: దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో విచ్ఛిన్నకర శక్తులు పాగావేసి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని ఆంధ్రభూమి సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి అన్నారు. తెలంగాణ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలోని జాగృతి భవన్‌లో ‘క్యాంపస్ రాజకీయాలు- అవగాహన’ అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులు మొదటినుంచీ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. రష్యాలో పుట్టి, చైనాలో మెరుగుపడిన కమ్యూనిస్టులు నేటికీ మన దేశ ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. 1943 క్విట్ ఇండియా ఉద్యమం నుంచి నేటి వరకు వారు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కమ్యూనిస్టులు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. కమ్యూనిస్టులకు చారిత్రక తప్పిదాలు చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. 1991లో ఇవే రాజకీయ పార్టీలు పార్లమెంట్‌లో కాశ్మీర్ మనదేనని బిల్లుపెట్టి ఆమోదించాయని, కానీ నేడు అవే రాజకీయ పార్టీలు కాశ్మీర్‌ను భారత్ నుండి వేరుచేస్తామనే వేర్పాటువాదులకు మద్దతు ఇవ్వడం తగదన్నారు.
ఎబివిపి మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ రావు మాట్లాడుతూ నిజమైన అంబేద్కర్ వారసులు ఎబివిపి కార్యకర్తలేనని పేర్కొన్నారు. రిజర్వేషన్లకు మద్దతుగా అన్ని వర్గాల విద్యార్థులతో కలిసి ఉద్యమించిన చరిత్ర ఎబివిపికి ఉందని తెలిపారు. 1980లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దళిత వైస్ చాన్సలర్‌ను నియమించాలని డిమాండ్ చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎంతోమంది దళిత నాయకత్వాన్ని దేశానికి అందించిన ఘనత ఎబివిపికే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు అయ్యప్ప, నిరంజన్, దిలీప్, రాఖేశ్, నిబిత, మానస, సదా పాల్గొన్నారు.