వాసిలి వాకిలి

‘నేను’ క్షర ప్రదర్శనాన్ని.. అక్షర దర్శనాన్ని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను’
- నిన్నటిదాకా త్రీడైమెన్షనల్!
- నేడు ఫోర్త్ డైమెన్షనల్!!
రూపం ‘అరూపం’ అవుతూ ‘అపురూపం’ అయ్యే స్థితే ఈ ఫోర్త్ డైమెన్షన్. భౌతికంలో ఉంటూ అభౌతికం అయ్యే స్థితి ఫోర్త్ డైమెన్షన్.
ఈ ఫోర్త్ డైమెన్షన్ సాధ్యమయ్యేది ధ్యాన మార్గంలో.
యోగ, ధ్యాన మార్గంలో ‘నేను’ దేహాన్ని దాటుతుంది.. మనసును దాటుతుంది.. యాస్ట్రల్‌నూ దాటుతుంది. ఇలా ఫిజికల్, మెంటల్, యాస్ట్రల్ ప్లేన్స్‌ను దాటే వరకు ‘నేను’ త్రీడైమెన్షనలే!
దాటుతూ దాటుతూ అభౌతికం కావటం ఫోర్త్ డైమెన్షన్!
అభౌతికం నుండి అధిభౌతికం కావటం ధ్యానం.
ధ్యానం అంటేనే ఫిఫ్త్, సిక్త్స్, సెవెన్త్ డైమెన్షన్ల పరిణామం.
సెవెన్త్ డైమెన్షన్ పరిణామం అంటేనే అద్దాల గదిలోకి ప్రవేశం.
ఆ అద్దాల గది విశ్వగర్భ. అది సప్తశోభితం.
ఆ ‘్భృక్తం’లో ఎటు చూసినా నేను.. ఎక్కడ చూసినా నేను.. అన్నిటా నేను... నేను ఈ విశ్వం ఒక్కటే! అభేదమే! ఈ త్వమేవాహమే సెవెన్త్ డైమెన్షన్.. అదే ధ్యానస్థితి.
* * *
‘నేను’ ధ్యానంలో దేహాతీతం, మానసాతీతం అవుతుంటుంది కదా! అయినా ఆ దేహాతీత, మానసాతీత ధ్యాన ఫలితం దేహంపైన, మనస్సుపైన పడుతూనే ఉంటుంది. అంటే, యాస్ట్రల్‌ను చేరుకున్నా, అతీతం అవుతున్నా దేహంతో, మనస్సుతో ఏదో ఒక రూపంలో ‘లింక్’ అవుతూనే ఉందన్నమాట. అందుకే అనేది ఫిజికల్ బాడీకి యాస్ట్రల్, ఈథరిక్ బాడీలతో సాంగత్యం ఉంటుందని. ఈ సాంగత్య ఫలితంగా ధ్యానం కణవ్యవస్థపై ప్రభావం చూపుతోంది. అంటే, క్షీణ దశకు చేరుకుంటున్న కణాలను ధ్యానం పునర్జీవింప చేస్తోంది.
ధ్యానం వల్ల కణ కాలపరిమితి పెరుగుతుంది. నేనులోని కణాలు మరింత అధిక కాలం అస్తిత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఆయుష్షు పొడిగింపబడుతుంది. ఆసనాలు, శ్వాస మీద ధ్యాస మొదలైన ప్రక్రియల వల్ల కణ వ్యవస్థ మెరుగు అవుతున్నప్పటికీ, రాజయోగ ధ్యాన ప్రక్రియ వల్లనే కణ వ్యవస్థ శక్తివంత మవుతూ మరింత కాలం మనగలుగుతోంది.
ఒక కణం జీవించి ఉండే కాలం కణంలోని ళ్యౄళూళఒ పై ఆధారపడి ఉంటుంది. ఈ ళ్యౄళూళఒ శక్తి తరుగుతుంటే కణం నశించటానికి దగ్గరవుతుంటుంది. అయితే ధ్యాన యోగం వల్ల ఈ ళ్యౄళూళఒ క్షీణదశకు చేరుకోవటం అన్నది స్లోడౌన్ అవుతుంది. క్షీణ దశవైపు వేగం తగ్గటంవల్ల కణాలు మరింత కాలం సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తిస్తూ ‘నేను’కు ఆయుష్షును పెంచుతుంటాయి.
* * *
ధ్యాన ప్రభావం కణ వ్యవస్థపై ఉంటుందనుకుంటున్నాం.. ముఖ్యంగా ‘నేను’లోని ‘ఎపిథీలియల్ సెల్స్’ మన దేహ ఉపరితత్వాన్ని సంరక్షిస్తూ ఉంటాయి. చర్మం, రక్తనాళాలు, అవయవాలు, మూత్రనాళాలు ఈ ఎపిథీలియల్ పరిధిలో ఉంటాయి. ఇక, నేనులోని గ్రంథులన్నీ ఈ ఎపిథీలియల్ సెల్స్ వల్లనే తయారయ్యాయి. మన దేహంలోని ప్రతీ అవయవ బాహ్యమంతా ‘ఎపిథీలియల్ టిష్యూస్’తో నిర్మితమైనదే!
ఇక, రక్తనాళాలు కూడా ఎపిథీలియల్ టిష్యూస్ సంకలితమే! ముఖ్యంగా డజిఖ్ఘ్యౄఖఒ ఉఔజఆ్దళషజ్ఘ ళళఒ అనేవి రక్తనాళాలలో రక్త ప్రసరణ నిరాటంకంగా సాగటానికి మూలమవుతుంటాయి.
శ్వాసకోశాలలో గాలి రాకపోకలకు సైతం ఎపిథీలియల్ కణాలు ఎంతో దోహదం చేస్తుంటాయి. ఈ ఎపిథీలియల్ సెల్స్ లెక్కకు మించి అధికంగా ఉంటే కనక యూరిన్ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు లెక్క. ఆ అధిక సంఖ్యాక ఎపిథీలియల్ సెల్స్ వల్ల కిడ్నీస్, లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక, ఎపిథీలియల్ సెల్స్ అబ్నార్మాలిటీ వల్ల కేన్సర్ బారిన పడే అవకాశమూ ఉంది.
ఎపిథీలియల్ వ్యవస్థ గురించి శాస్ర్తియంగా తెలుస్తుంటే మెడిటేషన్, యోగం వల్ల ఆరోగ్య వ్యవస్థ చక్కబడుతుందనటం విశ్వసనీయం అవుతోంది. మాస్టర్ సి.వి.వి. ఆవిష్కరించిన ‘్భృక్త రహిత తారక రాజయోగం’లో భాగమైన అనేక కోర్సుల సాధనా సందర్భాలలో ఎపిథీలియల్ ఉలాన్స్, ఎపిథీలియల్ సెల్స్, ఎపిథీలియల్ టిష్యూస్ అనే పదాలు చాల మార్మికంగా ఉచ్ఛరింపబడుతుంటాయి.
అసలు, ‘నేను’ దేహపరంగా కొన్ని కోట్ల ఎపిథీలియల్ కణ వ్యవస్థనే. పైకి ఎంతో అందంగా, ఆరోగ్యంగా కనిపించే చర్మం అంతా ఎపిథీలియల్ కణాల అల్లికనే. విడగొట్టి చూడటానికి వీలు లేనంతగా ఈ ఎపిథీలియల్ సెల్స్ చర్మాన్ని ఆవరించి సంరక్షిస్తూ ఉంటాయి. చర్మానికి లోపలా బయటా ఉన్న వ్యవస్థలకు ఎపిథీలియల్ కణ వ్యవస్థ రక్షణా కవచమవుతుంటుంది. బాహ్య వాతావరణంలోని ‘వైరస్’లను లోనికి చేరకుండా కట్టడి చేయగలిగేది ఈ ఎపిథీలియల్ కణ వ్యవస్థనే. కణాల మధ్య ఏ మాత్రం గాప్ వచ్చినా వైరస్‌లు లోనికి చేరి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి.
మన దేహానికి చెమట పట్టి, చల్లబడటం జరిగేది కూడా ఈ ఎపిథీలియల్ సెల్స్ వల్లనే. మన అవయవాలన్నీ సక్రమంగా పని చేయటానికి కావలసిన సిగ్నల్స్‌ను మెదడు నుండి అందుకునేది, మెదడుకు చేరవేసేది కూడా ఈ ఎపిథీలియల్ సెల్స్‌నే!
దేహంలోకి ప్రవేశించే, దేహం నుండి నిష్క్రమించే పదార్థాలన్నీ, వ్యర్థాలన్నీ ఎపిథీలియల్ టిష్యూల లేయర్‌ని ఏదో ఒక రూపంలో దాటవలసిందే! ఎపిథీలియల్ సెల్స్‌లోని రిసెప్టర్స్ వల్లనే మన నాలుకకు రుచులు, ముక్కుకు వాసనలు తెలుస్తుంటాయి. ఇలా, ఎపిథీలియల్ సెల్స్ లేని ఇంద్రియ నిర్మితి, మానవ దేహ నిర్మితి అసాధ్యం.
అందుకే, ఆరోగ్యపరంగా, ఆయుర్దాయపరంగా కావలసిన థర్టీన్ ప్లానెటరీ ఫోర్సెస్‌లో ప్రథమ స్థానాన్ని ఎపిథీలియల్‌కు ఇవ్వటం జరిగింది భృక్తరహిత తారక రాజయోగమైన మాస్టర్ యోగంలో.
* * *
మెడిటేషన్‌ను ‘ది బెస్ట్ యాంటీ ఆక్సిడెన్ట్’ అంటోంది నేటి మెడికేషన్ వ్యవస్థ. ధ్యాన యోగ జీవనానికి ఇటూ అటూ అంటే ప్రీ అండ్ పోస్ట్ యోగిక్ లైఫ్ గురించి కాస్త ఆలోచిద్దాం. యోగ మార్గంలోకి అడుగు పెట్టటానికి ముందరి జీవితమంతా మోర్టల్ లైఫ్.. యోగంలో జీవితమంతా ఇమ్మోర్టల్ లైఫ్. కనీసం పది సంవత్సరాలు యోగ సాధనలో డిసిప్లినరీ లైఫ్‌కి అలవాటుపడ్డ వారికి ఆయుర్దాయం కచ్చితంగా పెరుగుతుంది.

-విశ్వర్షి 9393933946