వాసిలి వాకిలి
నేను.. ‘అ’మృతత్త్వాన్ని..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
-1-
నేను
పుట్టాను
చరమాంకాన కబళించే మృత్యువు
నా పుట్టుకకు సాక్షి సంతకమైంది
కడదాకా నీతో ఉంటానన్న ఒడంబడికతో
నా దేహాన్ని పలకరించి పరవశింపచేసింది
ప్రాణంగా, జీవంగా, ఆత్మ తోడుగా.
*
నేను
జీవిస్తున్నాను
మనసు మార్గాన.. మృత్యు నీడన
గెలుస్తున్నాను
ఆత్మ పథాన.. మృత్యు నేత్రాన..
జ్వలిస్తున్నాను
జీవన వలయాన.. మృత్యు క్షేత్రాన.
-2-
నేను
జీవన ప్రస్థానాన్ని
స్నేహించిన మృత్యు సంతకాన్ని
సజీవ కిరణ మృత్యురేఖని
నవజీవ కణ మనోజ్ఞ రచనని
ఇహ పర చెరగని సంతకాన్ని
దిగంతాల మృత్యుగరిమని.
*
నేను
పాంచభౌతిక విదేహాన్ని
పర విశ్రాంతికి ఇహ చిరునామాని
అశాశ్వత అస్తిత్వాల వ్యామోహ వైభవాన్ని
ఐహికం మెరుపున చీకటి ఉరుముని
కారుమబ్బున కరగని అంధకారాన్ని
శ్వాసక్రియన దాగిన మృత్యుచేతనని.
-3-
నేను
ఇరు శ్వాసల విలాసాన్ని
మార్మిక నేత్ర శాసన పర్వాన్ని
కాలాతీత విలయ ప్రాభవాన్ని
భూగోళ మృణ్మయ పాత్రని
ఖగోళ కాంతి వాహికని
సృష్టిని పొదువుకున్న పరత్వాన్ని
సరిరాని సరిలేని మృత్యుకుహరాన్ని
అనంతతత్వ పరమానంద క్షేత్రాన్ని.
*
నేను
జీవన కలశాన
ఒదిగిన మృత్యు కౌశలాన్ని
మానవ కుండలినిన
నిద్రాణమైన నిర్మోహ శక్తిని
దైనందిన మధురిమన
కరగని అవిభక్త చేతనని
తిరస్కార పదకోశంలో తొలిపదాన్ని
తొందరపడి అడుగేయని పథాన్ని.
-4-
నేను
ఆత్మకు సహచరిని
అతీంద్రియ శక్త్ధిమాన్ని
జీవస్పందన ఆగిన అంకాన్ని
భౌతిక బరువు తాకని ఉనికిని
వైరుధ్య జీవన అంతస్తత్వాన్ని
ప్రతికూల భావాల అస్తిత్వాన్ని
భౌతిక లాలసల మాయాజాలాన్ని.
*
నేను
అంతర్లోక కాంతిగోళాన్ని
ఖగోళ అమృతగళాన్ని
పరాప్రకృతి ధర్మాసనాన్ని
మహత్తరానుభవానికి తొలి ఊతాన్ని
లౌకికాన దొరలిన పారలౌకిక సత్యాన్ని
ఆత్మజ్ఞానానికి ప్రిదిలిన దైహిక అజ్ఞానాన్ని
ధ్యాననేత్రం దర్శించగలిగిన ప్రజ్ఞానాన్ని
మూలతత్వాన నిలపగల శూన్యవిభూతిని.
-5-
నేను.. ఆదితత్వం నుండి వెడలిన
తేజోమండల ధర్మాధికారిని
భూమండల ఆత్మసహచరిని
కాలపురుషుని అడుగుల సవ్వడిని
మానవ హృదయ మరణ మృదంగాన్ని
దేహాన్ని వీడిన ఆత్మ పథగామిని
*
నేను
జనన మరణ సూత్రాంశను
జీవామృత అంతశే్చతనను
మూలతత్వ మృత్యువంశను
ఇహానికి అంతాన్ని పరానికి ప్రారంభాన్ని
మనిషి జయించని తత్వాన్ని
మనీషి సాధించిన మృత్యుతత్వాన్ని.
-6-
నేను.. వసుధకు అందని తత్వాన్ని
మనసున నిలవని స్వభావాన్ని
మానవతనం ధరించని విషాద హేతువును
అయినా
అంధకారం దరిచేరని తేజస్సును
అదృశ్య లోకాలకు చేర్చగల ప్రజ్ఞను
మానవ జాతి పసిగట్టని
ప్రవిమలానందాన్ని
మృతక్షేత్రాన పరిణమించిన అమృతత్వాన్ని
స్వస్వరూప దర్శనానికి
గిక ఆలంబనన.