వాసిలి వాకిలి

నేను.. భూమధ్యరేఖను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-1-
నేను
కాంతి వేగానికి వారసుణ్ని
కాల యానానికి అంతర్విధిని
కణ విస్ఫోటనానికి అంతర్లయని
ధూళి దూసరిత భూవలయాన్ని
లోచన సాంద్రత నెరిగిన నేత్రాన్ని.
-2-
నేను
ఆత్మజీవిని
అంతరంగ మధనాన్ని
తొలిగా ఆవేదనల పరిశోధనను
మలిగా మానసాతీత శోధనను
మలుపులో పరసీమల పార్శ్వాన్ని
-3-
నేను
స్పందనకు నేపథ్యాన్ని
సంస్పందనకు సూత్రధారిని
భౌతిక వేదికన శక్తి వినియోగాన్ని
నటించటం తెలీని మానవ ఆంతర్యాన్ని
గతాన్ని తోడని సార్వకాలిక శాంతి రసాన్ని
-4-
నేను
కాను వాంఛల యాంత్రికతను
కాను మోహజనిత మానసికతను
కాను కాను, ఊపిరి సలపని భౌతికతను
అవును నిర్వ్యామోహ అంతర్వీక్షణను
అవునవును, గమనికకు భ్రూమధ్యరేఖను
-5-
నేను
ధ్యాన క్షేత్ర ఫాలభాగాన్ని
అర్ధనిమీలిత లోనారసిని
అంతర్గమన స్వప్రేరణను
అందివచ్చిన విభూతిని
అభిమతానికి మార్గదర్శిని.
-6-
నేను
కాను ప్రేమ సరాగాన్ని
అవును, ప్రేమహిత ధ్యానాన్ని
కాను కలవరపాటును
అవును, చైతన్య విస్ఫోటనాన్ని
నిశ్చలతలోని నిశ్శబ్ద గగన గమనాన్ని
-7-
నేను
మితానికి హితాన్ని
అవగాహన కలిగించిన స్థిమితాన్ని
అశక్తతను విడనాడిన దృక్పథాన్ని
జీవశక్తిగా ఆవలితీర విలసనాన్ని
అహం అందించిన మానవీయాన్ని
-8-
నేను
యంత్ర సదృశ మనసును
అయినా, సునిశిత ప్రజ్ఞను
కాలాతీత జీవన సౌందర్యాన్ని
భ్రమలను విడనాడినన స్వఇచ్ఛను
మనశ్చర్యను కరిగించిన ప్రాభవాన్ని
-9-
నేను
అలోకాన్ని
నిజ స్వభావాన్ని
ఆలోచన కందని జీవితాన్ని
బహుముఖీనం కాని చైతన్యాన్ని
యధార్థ దర్శన స్థితిని, ధ్యానసిద్ధిని
-10
నేను
క్రియాత్మక జీవితాన్ని
నవజీవన సంసిద్ధతను
శారీరక మానసిక సమతుల్యతను4

ఆంతర్యం వచించిన అప్రమత్తతను
సంపూర్ణతను నిర్వచించిన వర్తమానాన్ని
-11-
నేను
పూర్ణ ప్రాణాన్ని
త్రిశక్తుల వర్ఛస్సును
లోలోతుల శూన్యాన్ని
అనంత చైతన్య విభావరిని
అగోచరానికి కాలరహిత సాధనను
-12-
నేను
ధ్యానస్థితిని
కర్తృత్వ భావనలేని దిదృక్షను
వివేక పరిమితులు లేనివాడను
ఆలోచనకు అవకాశమివ్వని వాడను
అంతరంగ లోతుల తడచినవాడను
-13-
నేను
అర్ధించని సిద్ధుడ్ని
గమ్యంలేని గమనాన్ని
వ్యాపకంలేని ధారణను
అనుక్షణ అంతర్వీక్షణను
అరమోడ్పు అనుశీలనము
-14-
నేను
గిక సృష్టిని
శాన్య వినోదాన్ని
నిశ్శబ్ద విన్యాసాన్ని
ఇంద్రియ సన్యాసాన్ని
వికారరహిత సాధికారాన్ని

-విశ్వర్షి 93939 33946