రాష్ట్రీయం

విసి నియామకాల్లో మీ అధికారాలు ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ నియమాకానికి సంబంధించి ఎపి ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటో చెప్పాలని హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ భోసలే, జస్టిస్ నవీన్‌రావులతో కూడిన బెంచ్ ఆదేశించింది. యూనివర్శిటీకి చెందిన జనరల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ పిఆర్ సుభాష్ చంద్రన్ దాఖలు చేసిన ప్రజావ్యాజ్య పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు ఈ ఆదేశాలిచ్చారు. విసి నియామకం లేదా విసిని తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని డాక్టర్ సుభాష్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ అధికారం కేవలం చాన్సలర్‌కు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. 2015 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం అప్పటి విసి ప్రొఫెసర్ ఆర్‌జిబి భగవంత్‌కుమార్‌ను తొలగించిందని, అనంతరం ఎయు విసిని ఇన్‌చార్జిగా నియమించిందని, ఆయన తర్వాత రెక్టార్‌ను విసి ఇన్‌చార్జిగా నియమించిందని, ఇది న్యాయబద్దం కాదని వాదించారు. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 29కి వాయిదా వేసింది.