రాష్ట్రీయం

ఉమ్మడి రాజధానిలో తగ్గిన నేరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గత సంవత్సరం కంటే 14శాతం నేరాలు తగ్గాయి. పోలీసు శాఖలోని వివిధ విభాగాల అధికారులు, ప్రజల పరస్పర సహకారంతోనే నేరాలు తగ్గాయని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. గత సంవత్సరం 117 హత్యలు జరుగగా ఈ యేడాది 96 హత్యలు జరిగాయి. 2014లో 54 దోపిడీ కేసులు నమోదు కాగా ఈ యేడు 92 కేసులు నమోదై 42 కేసులు పెరిగాయి. 4260 చోరీలు కాగా ఈ సంవత్సరం 3447 కేసులు మోదయ్యాయి. అత్యాచారాలు, చీటింగ్, 304, 337, 338 సెక్షన్ల కింద నమోదైన కేసులతోపాటు ఘర్షణలు, సాధారణ దొంగతనాలు కలిపి గతేడాది 18,883 కేసులు నమోదు కాగా 2015లో 16,270 కేసులు నమోదయ్యాయి. ప్రీవెంటివ్ కేసులు, ఆస్తుల నష్టం కేసులు మొత్తం కలిపి 2014లో రూ.45,06,60,672 విలువైన కేసులు నమోదు కాగా, ఈ యేడాది రూ.26,93,71,507ల విలువైన కేసులు నమోదయ్యాయ. గత సంవత్సరం కంటే 50శాతం రికవరి జరిగింది. వరకట్న హత్యలు గత సంవత్సరం తొమ్మిది జరుగగా 2015లో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. వరకట్న చావులు 21, వేధింపులు 1523, ఆత్మహత్య యత్నాలు 29, అత్యాచారాలు 108 కేసులు నమోదైనట్టు పోలీసు అధికారులు తెలిపారు. అదేవిధంగా దోపిడీ కేసుల్లో 43శాతం రికవరి జరిగింది. హౌస్ బ్రోకెన్ కేసుల్లో అపహరణకు గురైన సొత్తు రూ.15,34,0100లలో రూ.34,7800లు రికవరితో 23శాతంకు చేరింది. హౌస్ బ్రోకెన్ 489 కేసులు నమోదు కాగా 135 కేసులు ఛేదించబడి 32శాతం రికవరి జరిగింది. చైన్ స్నాచింగ్‌లు గత ఏడాది 523 జరుగగా ఈ సంవత్సరం 263 కేసులు నమోదై 199 కేసులను పోలీసులు ఛేదించారు. రూ. 94,80,000 రికవరీ చేశారు. వాహనాల చోరీలు గత ఏడాది ద్విచక్ర వాహనాలు 1354, త్రీ వీలర్ 76, ఫోర్ వీలర్ 45 కేసులు నమోదు కాగా ఈ యేడాది టూవీలర్ 1098, త్రీ వీలర్ 60, ఫోర్ వీలర్ 44 కేసులు నమోదై 41శాతం మాత్రమే రికవరి అయ్యాయి. మాదకద్రవ్యాలు గంజాయి, చరస్, కొకైన్, బ్రౌన్ షుగర్, ఓపియం, భంగ్, ఖాట్‌లీవ్స్, గ్రీన్ పిల్స్, ఎల్‌ఎస్‌డి ఆసిడ్ బ్లాట్స్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 8శాతం పెరిగాయి. 2014లో సైబర్ నేరాలు 392 కేసులు నమోదు కాగా 2015లో 352 నమోదయ్యాయి. ట్రాఫిక్ విభాగంలో గత సంవత్సరం 30,47169 కేసులు నమోదు కాగా, 2015లో 27,87,730 కేసులు నమోదు చేసి రూ.36,97,51,578లు చలాన్లు విధించారు. 2014లో 14,246 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, 2015లో 14,913 కేసులు నమోదై సుమారు 2,802 మందికి ఒక నెల నుంచి మూడు నెలల పాటు సాధారణ జైలు శిక్ష విధించడం జరిగింది. రౌడీ షీటర్లు, చైన్ స్నాచర్లు, మాదకద్రవ్యాల స్మగ్లర్లు, చీటర్లపై ఈ సంవత్సరం 263మందిపై పిడి యాక్టు నమోదు చేశారు. షీ టీమ్స్ ప్రవేశంతో మహిళలకు భద్రత పెరిగింది. మొత్తం మీద ఈ ఏడాది ప్రశాంతంగా ముగిసినట్లు చెప్పుకోవచ్చు.

-సయ్యద్ గౌస్