Others

శివాలెత్తిన గజరాజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి, కర్నాటకలోని బెంగళూరు లాంటి నగరాల సమీపంలోని ఓ మాదిరి కీకారణ్యాలు గొప్ప టూరిస్టు ఆకర్షణలైతే, ఆ నగరాలు చిరుతలకి, ఏనుగులకీ అడపాదడపా ‘వాహ్యాళి’ ప్రదేశాలవుతున్నాయ్. ఈమధ్య బెంగళూరుకు చేరువలోని అరణ్యంలోనుంచి ఒక చిరుతపులి వేకువజామునే ‘విగ్బియార్ ఇంటర్‌నేషనల్ స్కూల్’కి చెకింగ్‌కి వచ్చింది! అలాగే, సిలిగురి టౌన్‌లోకి ‘వైకుంఠపురం’ ఫారెస్టు నుంచి ఓ మదగజం ‘జింబో నగర ప్రవేశం’ అన్నట్లుగా ప్రవేశించింది. ఈ రెండింటినీ ఆయా చోట్ల బంధించేసరికి ఫారెస్టు అధికారులకు నిజంగా చుక్కలు కనిపించేయి. అంతటితో కథ ఆగలేదు. ఆ చిరుతకి ఒక కన్ను సరిగా కనిపించదు. నోట్లో ఒక పన్ను (కోర) లేదు. దాని బరువు కేవలం నలభై ఐదు కేజీలే అయినా, అది తనని పట్టుకోడానికి సాహసించిన ఐదుగుర్ని క్షతగాత్రుల్ని చేసింది. ఈ చిరుత భయంతో అధికారులు 134 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
పారిపోయిందనుకున్న దాని కోసం బయట గాలిస్తున్నారు గానీ, ఆ చిరుత ఓ స్కూలు గదిలో నక్కి కనపడ్డది. చివరికి అటవీ సిబ్బంది మత్తు బాణాలు సంధించి చిరుతని పట్టి ఓ బోనులోకి ఎక్కించారు. గాయపడ్డ అయిదుగురూ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ వున్నారు. ఈలోగా చిరుతపులి- ఆ ఇనుప బోనులోనుంచి ‘హుష్‌కాకి’ అయిపోయింది. మర్నాడు దాన్ని వెతుక్కుంటూ యాభై మంది నిపుణులు అటవీ ప్రాంతంలో గాలింపుచర్యలు చేపట్టారు.
ఇక, సిలిగురిలో ప్రవేశించిన ఏనుగు- దానికి అడ్డం వచ్చిన ఇళ్లను ధ్వంసం చేస్తూ, కార్లు, మోటారు సైకిళ్లు వగైరా వందలాది శకటాలను పచ్చడిపచ్చడి చేసేసింది. సిలిగురిలో జననష్టం లేదు గానీ, ఆ మదగజం అడవి దాటుతూనే ‘హరిచరణ్’ అనే గ్రామం సమీపంలో టీ గార్డెన్స్‌ని ధ్వంసం చేసేసి, ఓ రైతుని కాళ్లతో తొక్కేసి చంపేసింది. మొత్తంమీద మన దేశంలో ఏనుగులకీ, మనుషులకీ అంటే పట్టణ వాసులకీ పడటం లేదు. సదరు ఏనుగులను మత్తుబాణాలతో కొట్టి బంధించేసరికి తలప్రాణం తోక్కి వస్తోంది! గజం మిథ్య కాదు పలాయనం మిథ్యగా.
ప్రేమలో ఓడిపోయి...
చైనాలో మరీ చిత్రం- ఓ మత్తశుండాలం తన ప్రేయసి కోసం మరో గజరాజుతో తొండం తొండం కలిపి హోరాహోరీ పోరాడి వోడిపోయింది. ఆ మంటతో హైరోడ్డుమీదకెక్కి, అటు వెళ్తున్న మోటారు కార్లని ధ్వంసం చేస్తూ నానా బీభత్సం చేసింది. దాని ప్రియురాలు యించక్కా ఆ మరో గజరాజుతో ‘వాలంటైన్స్ డే’కి వెళ్లిపోయింది. ఈ తాజా సంఘటన చైనాలో సంచలనం సృష్టించింది. యున్నన్ రాష్ట్రంలోని ‘ఝావాంగ్‌చిన్’ అనే లోయ వద్ద ఆ ఏనుగు మోటారు కార్లతో బంతాట ఆడుకుంది. అంతలో వాలెంటైన్స్ డే రోజున ఆ ఏనుగు వచ్చి ప్రేమికుల కార్లను- ‘జై బజరంగ్ భళీ’ అన్నట్లు ఘీంకరిస్తూ ధ్వంసం చేసింది. ఎవర్నీ గాయపరచలేదుట. అదీ సంగతి!
వారేవా.. జైల్ ఇన్ ఇండియా!
స్వతంత్ర భారతమంటే నిజంగా స్వేచ్ఛాగానమే. ఇక్కడ ఖైదీలకు జైలు జీవితం నిజంగా ఆనందకరమే అన్న సందర్భాలున్నాయి. దేశమంతటా రిపబ్లిక్ డే సంబరాలు చేసుకుంటూ వుంటే- తమిళనాడులోని సేలం జైలు డిప్యూటీ జైలర్ శంకరన్ గణతంత్ర పరేడ్‌కి చెన్నై చేరుకున్నాడు. హోటల్‌లో ఫుల్‌గా మందు బాటిల్స్ పట్టించేశాడు. ఓహ్! బెల్లీ డాన్స్ మొదలెట్టి అదరగొట్టేశాడు. తాను పనిచేసే జైలులోనే అతడు మందు కొట్టేసి చిందులు వేసేవాడు, ఇక హోటల్ గది ఒక లెక్కా? జైలులోనే అతను ఆడ ఖైదీల చేత ఒళ్లు మర్దనా చేయించుకునేవాడు. మగ ఖైదీల చేత తలంటు పోయించుకునేవాడు. మరో ఆర్నెల్లలో ఈయన రిటైరయిపోవాలి. ఈలోగా తన మగతనం, నాట్యకళ, సురపాన పటిమ వగైరా తెగ ప్రదర్శిస్తున్నాడని ఆరోపణలున్నాయి.
అది సరే- కర్నాటకలోని బిజియాపూర్ జైలులో ఖైదీలను ఆనందాబ్దిలో వోలలాడించడానికి జైలు అధికారులు ఈ మధ్య ‘ప్రత్యేక అతిథుల’ను పిలిచి బాలీవుడ్ ఐటెమ్ డ్యాన్స్ పెట్టారు. సినిమా డాన్సులు వీటిముందు బలాదూర్ అనిపించారు. నర్తకి మీద ‘కరెన్సీ’వాన కురిపించారు. ఇంత జల్సాగా రిపబ్లిక్ డే సంబరాలు ఎవరు చేసుకోగలరు? ఐతే, ‘దయలేని’ సర్కారువారు మాత్రం ఇది నచ్చక బిజయాపూర్ జైలు ఇన్‌ఛార్జి పి.ఎస్.అంబేద్కర్, వార్డెన్ సంపత్, కానిస్టేబుల్ గుండల్లీని సస్పెండ్ చేశారు. అలాగే, సేలం డిప్యూటీ జైలర్‌ని రెండు వారాల దర్యాప్తు అనంతరం తీరుబడిగా సస్పెండ్ చేశారు. ఖైదీలు బిజయాపూర్ అయిటమ్ డాన్స్‌ని మొబైల్స్‌లో షూట్ చేసుకున్నారట. ఈ దృశ్యాలు సర్వత్రా వ్యాపించడంతో ఇకమీదట మొబైల్స్‌ని జైల్లోకి అనుమతించేది లేదని అన్నారు గవర్నమెంటువారు. సినిమాల్లో జైళ్ళు, అందులో ఐటెమ్ డాన్సులు చూసిన చాలామంది- యూట్యూబ్‌లోకి ఎక్కిన అయిటమ్ డ్యానే్స బెటర్‌గా వుంది అన్నారుట. శభాష్! నటన కన్నా వాస్తవం చాలా గొప్పది!
పరిశుభ్ర నగరం.. విశాఖ
తెలుగు రాష్ట్రాలకి ‘కోస్తామణి’ - వైజాగ్ కీ జై! ప్రధానమంత్రి మోదీ 2014 అక్టోబర్‌లో మొదలెట్టిన స్వచ్ఛ్భారత్ ఉద్యమం కొంత ఫలించింది. 73 పట్టణాలలో సర్వే చేశారు. అవార్డులు ఇచ్చారు. అందులో మన వైజాగ్‌కి ఐదో ర్యాంకు రావడంతో తెలుగు రాష్ట్రాలలో అది ‘టాప్’ ‘క్లీన్’ అయింది. హైదరాబాద్ అభివృద్ధి తన ఘనతే అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు- తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానికి ఇరవయ్యవ స్థానం లభించిందనీ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశికి 65 స్థానం దక్కిందనీ ప్రధాని మోదీ గమనించాలి. అయినా హైదారాబాద్‌కి జై కొట్టాలి. ఎందుకంటే 2014లో 275వ స్థానంలో ‘అపరిశుభ్ర సిటీ’గా ముద్రపడ్డ హైదరాబాద్ రుూసారి సర్వేలో టాప్ ఇరవైలో 19వ దిగా నిలిచింది. ‘ముబారక్ హో!’ అందాం. కాకపోతే క్రెడిట్ మాత్రం మనందరం తీసుకుందాం.

-వీరాజీ