Others

యోగాలలోకెల్లా వినూత్నం ‘బీర్ యోగా!’ (వార్త - వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘యోగా’ ఇండియాలో కన్నా ఇతర దేశాలలోనే బాగా ప్రాచుర్యంలో వున్నది. కానీ ఇప్పుడో కొత్తరకం యోగా వచ్చింది. ఆస్ట్రేలియాలో అక్కడినుంచి జర్మనీ మొదలు అమెరికాలాంటి దేశాలలో, ఒక అంటు వ్యాధి లాగా అల్లుకుపోతోంది రుూ విడ్డూరమైన ‘యోగా’్భ్యసం!
‘సిడ్నీ’ పత్రికలలో మొన్న ఇరవైయ్యవతేదీ నాడు ఒక ప్రకటన వెలువడింది. అదిలా వుంది- ‘‘నమస్తే! ఛీర్స్! అన్నిదారులూ ‘షిఫ్’కే (అంటే ‘సకల సుఖాల గుచ్చం’ అనుకోండి) ‘బీర్ యోగా’ క్లాసులకి ఆహ్వానం. ప్రవేశ రుసుం కేవలం పది డాలర్లు. బీరు ఖర్చు అదనం. మీతోపాటు యోగా మ్యాట్ (జంబుఖానా లేదా తివాసీ) గానీ, టర్కిష్ టవల్‌గానీ తెచ్చుకోండి. వీలైతే మీ ‘నేస్తాన్ని’ తీసుకురావడం మర్చిపోకండి. సీట్లు పరిమితం. ఆరు గంటలకే రావడం సముచితం- అంటూ ప్రకటన పడటంతో వెంటనే ‘నిర్వాణ స్థితి’పై మోజున్న వాళ్లంతా కట్టగట్టుకుని చేరిపోయారు. అసలింతకీ రుూ ‘బీరు యోగా’ని కనిపెట్టిన మహానుభావుడు లేదా పునరుద్ధరించిన అధునాతన ‘యోగపుంగవుడూ’ అయిన ‘ఝాలా’గారి ఉవాచ యిలా వుంది-
ఈ యోగా రెండు గొప్ప సంగతులు- ప్రేమ, మరియు బీరు పానీయం- అనే వాటి సంయోగం. బీరాసనాలవల్ల ఆరోగ్యం, ఆనందం రెండూ లభ్యం అంటున్న ప్రచారకులు- దీనివల్ల అలౌకిక చేతనావస్థ గ్యారంటీ అంటున్నారు. బీరు సేవిస్తూ మయూరాసనం నుంచి గరుడాసనం దాకా అన్ని రకాల ఆసనాలూ వేయడం- గురువులు నేర్పిస్తారు. బీరులో సోడా, నిమ్మకాయరసం కలుపుకుంటే చాలు, అది ప్రసాదం అయిపోతుందిట!
వెనుకటి ‘హిప్పీ’ (దమ్‌మ్మారోదమ్) జాడ్యం మాదిరి యిది- గుఱ్ఱపు డెక్కలాగా మన ఆసియా దేశాలకి కూడా దిగుమతి అవడం తథ్యం అంటున్నారు విజ్ఞులు. (ఒకవేళ ‘ఆల్రెడీ డౌన్‌లోడ్’ అయిపోయిందా?)

పేవ్‌మెంట్లమీద
సైకిల్ స్వారీ! ఓ.కె.!
మన దేశంలో అందరికీ తెల్సు- నగరాలలో పేవ్‌మెంట్లు అరుదుగా వుంటాయి. వున్నా వాటిమీద పాదచారుల ప్రస్థానం తప్ప అన్ని రకాల ‘లైఫూ’ సాధ్యమే- సామాన్యమేనని కూడా తెలుసు. కానీ పేవ్‌మెంట్లమీద సైకిల్ త్రొక్కితే చట్టరీత్యా నేరం అనుకుని, ఆ పనిని సాధారణంగా చెయ్యంగానీ, ఉత్తర లండన్‌లోని ‘కేమేడన్’లో సార్జంట్ ‘నిక్‌క్లార్క్’ అనే పోలీసాఫీసర్‌కి రెండు చక్రాల సైకిళ్లంటే మహామోజు. ఆ వూరి పేవ్‌మెంట్లమీద సైకిల్సెక్కి హాయిగా త్రొక్కుకుంటూ (ఈల కూడా వేయవచ్చా?) ఎవరి దారిన వాళ్లు పోవచ్చు. కాకపోతే రోడ్లమీద సైకిల్ తోలితో కారు క్రిందో, బస్సు క్రిందో పడి పచ్చడయిపోతామన్న భయం వున్నపుడే కాలిబాటని ద్విచక్రవాహన చోదక ప్రదర్శనకి వీలు కల్పిస్తున్నాం అంటున్నారు పోలీసులు.
న్యాయంగా అయితే డెబ్భైపౌండ్ల జుల్మానా వేసెయ్యాలి. కానీ రుూ వూళ్ళో సైకిళ్లదే పైచెయ్యి. ‘‘ఏం బాబూ? ఫుట్‌పాత్‌మీద రైడింగ్ బాగుందా? పాదచారులకు అడ్డం రాకుండా, వాళ్లని బాగా ఎడంగా ‘ఓవర్‌టేక్’ చేస్తూ పోండి’’- అని సలహాలిస్తారు పోలీసులు. కాకపోతే సార్జంట్ నిక్‌గారు ఒక సూత్రం చెప్పాడు.
‘‘మీరు హైవేలో, సైకిల్ మీద పోతూంటే మీ వెనకాతల వచ్చే మోటారు శకటం ఏదైనా మిమ్మల్ని త్రొక్కేయకుండా ఏయే జాగ్రత్తలు తీసుకుంటుందో అటువంటి జాగ్రత్తలే మీరు కూడా పాదచారుల విషయంలో తీసుకోవాలి’’.
అదండీ సంగతి. ఎవరినైనా దేన్నయినా గ్రుద్దేసి పారిపోవడంలో (శకటంమీద) వున్న మజా దానికదే సాటి అనుకుంటే మీ యిష్టం!

లంచమిస్తేనే ‘స్వచ్ఛ్భారత్’ కితాబు!

‘అచ్ఛేదిన్’ రావాలంటే స్వచ్ఛ్భారత్‌గా ఇండియా మారిపోవాలంటూ 2014 నుంచీ ప్రధాన మంత్రి శ్రీమాన్ మోదీగారు మ్యునిసిపాలిటీకి నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాడు. కానీ చాలా పురపాలక సంస్థలవారికి ‘స్వచ్ఛ్భారత్’ ‘రేటింగ్స్’ సర్ట్ఫికెట్లు కావాలంటే- పరిశీలక సంఘాల చెయ్యి తడిపితే స్వచ్ఛన్నర ప్రశంసా పత్రాలు లభిస్తాయిట! ఇలా అని ఔరంగాబాద్ వార్త నొక్కి వక్కాణిస్తున్నది.
కేంద్రం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ ఒకటి ఔరంగాబాద్ కార్పొరేషన్ మీద వాలింది. ఔరంగాబాద్‌లో ఔరా! అన్నట్లుగా స్వచ్ఛ్భారత్ ఉద్యమం వెలిగిపోతోందని మంచి మార్కులు వేసి ‘కితాబు’ యివ్వటానికి మ్యునిసిపల్ అధికారి నుంచి కేవలం రెండున్నర లక్షల రూపాయలు బహుమతిగా మాత్రమే అడిగారు వాళ్లు. రెండు వేల మార్కులకు పరిశీలన సాగాలి మరి!- అందుకనీ..
ఔరంగాబాద్ కార్పొరేషన్ గడుసుగా ఒక లక్షా డెభ్భై వేల రూపాయలకి బేరం సెటిల్ చేసుకుంది. కాని రహస్యంగా అవినీతి నిరోధక శాఖకి ఉప్పందించేశారు వాళ్లు. స్వచ్ఛంగా సంపన్నంగా వున్న ఒక హోటల్ గదిలో రుూ మూడు ‘తిమింగలాల’కోసం వలపన్నారు పోలీసులు. ‘పింకు హ్యాండెడ్’గా అంటే రెండు వేల నోట్ల సాక్షిగా రుూ ముగ్గురు పెద్ద మనుష్యులూ దొరికిపోయారు.
కార్పొరేషన్ అధికారి కులకర్ణిగారు- శ్రీయుతులు శైలేష్ పురుషోత్తమ బజానియా, విజయ జోషీ, గోవింద ఘిమారేలు అడ్డంగా దొరికిపోయారని అక్కడ పోలీసు బాస్ శ్రీకాంత్ పరోపకారి విలేఖరులకు గత శుక్రవారం నాడు వెల్లడి చేశాడు. పరోపకారిగారు వాళ్లకి సాయం చేస్తాడనుకుని- రుూ స్వచ్ఛ్భారత న్యాయ నిర్ణేతలు పప్పులో కాలేశారు. దీన్ని బట్టి దేశంలో కొన్ని నగరాలు స్వచ్ఛ్భారత సర్ట్ఫికెట్లతో నిజంగా వెలిగిపోతున్నాయో లేక ‘స్వచ్ఛత’ని కొనుక్కున్నాయోనన్న అనుమానం రాక తప్పదు కదా?

-వీరాజీ