Others

ఖాదీ షోరూమ్‌కి రు.17 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘యు.పిలో, బిహార్‌లోనే దేశం మొత్తంమీద యువజనుల జనాభా ఎక్కువమంది’’ అని యిటీవలి లెక్కలు చెబుతున్నాయి. కాగా, బిహార్‌లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌గారు మద్యపాన నిషేధం అమలు చేస్తున్నాడు. పైగా, యువతీ యువకులను ఖాదీ ప్యాష న్ దుస్తుల వేపు మళ్లించాలన్న నిర్ణయంతో రాష్ట్రంలో ఖాదీ డ్రెస్సుల షోరూమ్స్‌కి 17 కోట్ల రూపాయలు కేటాయించాడాయన. ‘రాష్ట్రీయ చరఖా దివస్’ (రాష్ట్రీయ రాట్న దినోత్సవం) నాడు కొత్త కొత్త డిజైన్లలో ఖద్దరు దుస్తులు తయారుచేస్తే, వాటికి ‘బ్రాండు’ విలువ, డిమాండు వస్తాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘నిఫ్ట్’ సంస్థలో కొత్తరకం మాడ్రన్ ఖాదీ దుస్తుల తయారీకి ఒప్పందం కూడా బిహార్ గవర్నమెంట్ చేసుకుంది.
చంపారన్ సత్యాగ్రహ శత వార్షికోత్సవం వస్తోంది. అంచేత అక్టోబర్ 2 నుంచీ ఖాదీ సూట్స్- ఖాదీ సిల్కు చీరెలు, డ్రెస్సులు వగైరా మీద భారీ ముదరాలు (డిస్కవుంట్సు) ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ‘ప్రభుత్వ అధికారులకి కూడా ఖాదీ సూట్లు ధరించాలి’ అన్న రూలు పెడితే సరి.
మహాత్మాగాంధీగారు బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా సంధించిన మొదటి సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహమే కనుక రుూ ఖాదీ ఉద్యమం గురించి అందరూ ఆలోచించాల్సిందే!

-వీరాజీ