Others

పాముల్ని పట్టేదెందుకురా?... అంటే...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యప్రదేశ్‌లో భోపాల్‌కి దగ్గరగా వున్న హోషింగాబాద్‌లో ‘‘పాములవాడు’’ అంటే చాలు సలేమ్‌ఖాన్ భాయి దగ్గరకి దిగబెడతారు. అతను 30 సంవత్సరాలుగా జనవాసరాల నుంచి- ముఖ్యమంత్రి మొదలు సాధారణ వ్యక్తిదాకా అందరి యిళ్లల్లోనూ పాములను పట్టి సంచీలో వేసుకున్న రికార్డు వుంది. ఈపాటికే అతను రెండు లక్షల యిరవై వేలకి పైగా పాములను- ఎలుక పాముల నుంచీ కాలత్రాచుల దాకా పట్టి సంచీలో వేసుకున్నాడు.
సలేంభాయ్ ఖాతాలో అలవాటుగా రోజుకో పాతిక ముప్ఫై పాములను సంచీలో పడేసుకుంటాడు. అయితే వీటిని అతడేం చేస్తాడు?
చేస్తే దొంగ వ్యాపారం చెయ్యెచ్చు. త్రాచు పాము విషం కోట్ల రూపాయలు పలుకుతుంది. పాముల చర్మాలు అంటే విదేశాలలో జనాలకి పిచ్చి వ్యామోహముంది. కానీ సలేంఖాన్ భూతదయాపరుడు. అసలు అతను రుూ పాముల్ని కుప్పలు కుప్పలుగా పట్టుకోవడమే- వాటిని యితరులు కొట్టి చంపకుండా వుండడంకోసం అంటే మనకి ఆశ్చర్యంగా వుంటుంది. పాములు మనకి మిత్రులు. ‘రైతుబాంధవి పాము’ అంటాడు.
ఇటీవల 285 పాముల్ని పెద్ద బాన సంచీలో వేసి అడవికి తీసుకుపోయి నర సంచారం లేనిచోట సంచీలోనుంచి వాటిని వొలగబోసి- అటూ యిటూ చెదిరిపోకుండా చేరదీసి వీడ్కోలు చెబుతూ సంధ్యా సమయంలో అడవిలోకి సాగనంపాడు. వేరే సంచీలో కాలకూట విషం గ్రక్కే అరవై కోడె త్రాచుల్ని కూడా తెచ్చి వదిలిపెట్టాడు. పాముల్ని వదిలేయడం కూడా ఓ వ్రతంలాగా ఆచరిస్తాడు రుూ ‘‘పాములవాడు’’.
సాయంకాలం చల్లగా వున్నవేళ వదిలిపెడతాడు పాముల్ని. నిశ్శబ్దంగానూ చల్లగానూ వుండాలి అంటాడు. తర్వాత వాటి క్షేమాన్ని కోరుతూ చేతులెత్తి దేముణ్ని ప్రార్ధిస్తాడు. చిత్రం ఏమిటంటే గంపలోనుంచి పండ్లు వొలకబోసినట్లు క్రిందికి పడేసినా- అవి అతణ్ని ఏమీ అనవు. కొన్ని అతని కాళ్లకు చుట్టుకుంటాయి- విశ్వాస పాత్రమైన కుక్క పిల్లల్లాగా- ‘విషం’తో వ్యాపారం చేస్తే కోటీశ్వరుడు అయిపోయేవాడే గానీ- అలా చేయడు.’’ నేను నాగరాజుని. నాగులనేస్తాన్ని’’ అంటాడు- సలేమ్‌భాయ్!

veeraji.pkm@gmail.com