Others

పొరుగింటి పుల్లకూరేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారుచి కదా! అయితే అంత రుచి ఎందుకూ? అన్నది ప్రశ్న. మనింటి కూర బాగా లేకుండానన్నా వుండాలి. లేదా ‘చూద్దాం ఆ పొరుగింటి కూర రుచెంతో’ అన్న ఆసక్తన్నా వుండాలి. ఈ రెండూకాక.. ఎప్పుడూ పరాయి పంచకు వెంపర్లాడే బుద్ధయినా వుండాలి. ఇప్పుడీ ప్రసక్తి ఎందుకంటారా? ఈ అందోత్తర శతకం చూడండి కాస్త! -జెనీలియా, ఇలియానా, నయనతార, తాప్సి, సిమ్రాన్, చార్మి, భూమిక, ఆర్తి, కాజల్, నిషా, తమన్నా, సమంత, అనుష్క, పూజాహెగ్డే, రాయ్‌లక్ష్మి, స్నేహాఉల్లాల్, హన్సిక, రాశీఖన్నా, రెజీనా, రకుల్‌ప్రీత్‌సింగ్, జ్యోతిక, హెబ్బాపటేల్, శ్రుతిహాసన్, సాయేషా, నందితా, మనీషా, బిందుబార్బీ, శే్వతవర్మ, ప్రణీత, రీమా, రిమ్మి, రిచాశర్మ, రిచాపనయ్, హంసానందిని, లావణ్యత్రిపాఠి, నిషాకొఠారి, ఇషాఅగర్వాల్, త్రిష, శ్రీయ, కేథరీన్... ఏమిటీ నామస్మరణం? అంటారా! మన తెలుగు చలనచిత్ర నిర్మాతల, దర్శకుల, హీరోల ‘‘అభిరుచికి’’ ఆలాపించే ‘నామదండకం! మన తెలుగు హీరోలప్రక్కన ‘ఈ పొరుగింటి-పరభాషా- పుల్లగూర భామలే’ నాయికలుగా మనకు నిత్యమూ గోచరిస్తూ, అప్పుడప్పుడూ కొందరు అదృశ్యమైపోతూ, తెలుగు ప్రేక్షకుల జీవనాడుల్ని తీగలుగా మోయిస్తున్నారంటే... ఏమనుకోవాలి? మన బంగారం బాగలేదనా? అసలు బంగారమే మనదగ్గర లేదనా? మన ‘తెలుగమ్మాయిలకు సిగ్గెక్కువైపోయి సినిమాల్లో ప్రేక్షకులముందు ‘పొరుగూరి భామల్లా’ చిందులేయడం మానుకోవటం వల్లనా! అసలు ఆ రకం టేస్టే లేదనా? ఎవరో ఒకరిద్దరు అప్పుడప్పుడప్పుడూ అలా ‘అంజలి’లానో ‘సలోని’లానో ‘తళుక్కు’మంటున్నా... ఛాందసమూ, సంప్రదాయ విలువలూ ఎక్కువగావున్న దినాలలో తెరపై యెక్కువగానే తళుకులు మెరిపించిన, నటనతో మైమరపించిన అనేకం ‘తెలుగు తారామణుల్లా’ ఈనాడెందుకనీ కనబడకుండా వున్నారు? ‘టాలెంట్’ లేకపోవడమో, చూపలేకపోవడమో కారణమా? లేక ‘చిత్రసీమపట్ల ‘అపోహ’లెక్కువగా వున్నందుననా? ఏదియేమయినా.. తెలుగు చలనచిత్ర నిర్మాణ రంగ దౌర్భాగ్యవశాత్తూ, ‘తెలుగు తారామణుల నామస్మరణం’ లభించకపోవటం తెలుగు ప్రేక్షకుల దురదృష్టమనే చెప్పక తప్పదు. అలనాటి -మాలతి, శాంతకుమారి, కన్నాంబ, కమల, కాంచనమాల, కృష్ణవేణి, అంజలి, భానుమతి, సావిత్రి, జమున, కృష్ణకుమారి, జానకి, రాజశ్రీ, వాణిశ్రీ, కాంచన, శారద, కుసుమకుమారి, జి.వరలక్ష్మి, ఎస్.వరలక్ష్మి, సంధ్యారాణి, సుకన్య, సుజాత, అనూరాధ, లీలారాణి, జయలక్ష్మి, జయప్రద, జయసుధ, జయచిత్ర, సరళ, పద్మ, శుభ, జయంతి, విజయనిర్మల, విజయశాంతి, విజయలక్ష్మి, విజయలలిత, సరిత, పూర్ణిమ, మహాలక్ష్మి, జ్యోతి, సంగీత..’ ఇలా ‘తెలుగుతారల- నాయికల’ నామస్మరణం చేసుకునే రోజులు మళ్లీ వస్తాయో? రావో? ఏమో! కాలమే చెప్పాలి! ఎవరికి? మన ‘తెలుగు నిర్మాతలకు, దర్శకులకి, నాయకులకి! ఏమంటారు?

-దినకర్