Others

నాకు నచ్చిన పాట--తెలుగువీర లేవరా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనస్సును ఉద్వేగపర్చే ‘తెలుగువీర లేవరా..’ అన్న అల్లూరి సీతారామరాజు చిత్రంలోని పాట నాకు ఇష్టం. శ్రీశ్రీ కలం నుండి జాలువారిన ఈ గీతం ఘంటసాల, వి రామకృష్ణ గానం చేశారు. ప్రతి తెలుగువాడు ఉప్పొంగిపోయే మధుర గీతమిది. ఆదినారాయణరావు సంగీతం ఈ పాటను హైలెట్ చేసింది. తెలుగువాళ్లకు జరుగుతున్న అవమానానికి, బ్రిటిష్‌వారు సాగిస్తున్న దమనకాండకు నిరసనగా అల్లూరి సీతరామరాజు విప్లవాన్ని లేవదీస్తాడు. తెలుగువారిని ఉద్రేకపర్చి ఉత్తేజితులను చేసి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సమరశంఖం పూరించాల్సిందిగా ఉద్భోధించిన పాట ఇది. తెలుగువీర లేవరా/ దీక్షబూని సాగరా/ దేశమాత స్వేచ్ఛకోరి/ తిరుగుబాటు చేయరా’ అన్న పల్లవితో సాగే ఈ పాట వింటే ప్రతి తెలుగువాడి గుండె పులకరించిపోతుంది.
ఎవడువాడు/ ఎచటివాడు/ ఇటువచ్చిన దుండగీడు/ కండబలం/ గుండెబలం/ దోచుకున్న దొంగవీడు అంటూ గిరిజనంలో ధైర్యం నూరిపోస్తూ.. సింహాలై గర్జించాలి/ సంహారం సాగించాలి/ వందేమాతరం అన్న పిలుపు ఇచ్చే సమయంలో ప్రతి పౌరుడి మనసులో దేశభక్తి పొంగుతుంది. దారుణ మారణ కాండకు తల్లడిల్ల వద్దురా/ నీతిలేని శాసనాలు నేటి నుంచి రద్దురా/ నిదుర వద్దు/ బెదర వద్దు/నింగినీకు హద్దురా.. అన్న ధైర్యం పదాలు ఫిరంగుల్లా ఘంటశాల, రామకృష్ణ మాటల్లో వింటుంటే నరనరాల్లో రక్తం పొంగినట్టు అనిపిస్తుంది. అందుకే ఈ పాటకు జాతీయస్థాయిలో కవి శ్రీశ్రీకి అవార్డు వచ్చింది. ఈనాటికీ ప్రతి తెలుగువాడు దేశభక్తితో ఉద్వేగంగా ఈ పాటను పాడుకుంటున్నాడు. అందుకే ఈ పాటంటే చాలా ఇష్టం.
**

వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో పళశశళ్ఘబజూళషష్ఘశ్ఘౄజ.ష్యౄకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-మల్లారెడ్డి రామకృష్ణ, బుడితి