రాష్ట్రీయం

బర్దన్ మృతి దేశానికి తీరని లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కేంద్ర మంత్రి వెంకయ్య విచారం
నెల్లూరు , జనవరి 2: భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) జాతీయ నాయకులు అర్ధేందు భూషణ్ బర్థన్ (ఎబి బర్ధన్) మృతి దేశానికి తీరని లోటని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి వెంకయ్యనాయుడు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ సిద్ధాంత నిబద్ధతతో పనిచేసే ఒక గొప్ప నాయకుడిని దేశం కోల్పొయిందన్నారు. ఆజన్మాంతం కమ్యూనిస్ట్ భావాలతో కార్మిక నాయకునిగా, సిపిఐ పార్టీ కేంద్ర కార్యదర్శిగా సుధీర్ఘకాలం పనిచేస్తూ దేశానికి ఎనలేని సేవలు చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఆ ప్రకటనలో కేంద్రమంత్రి తెలిపారు.