రాష్ట్రీయం

రజాకర్లది ఇదే ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ మాతాకి జై నినాదంపై అభ్యంతరమెందుకు?
మాతృభూమిని గౌరవించడం అందరి విధి
స్పష్టం చేసిన వెంకయ్య

హైదరాబాద్, మార్చి 17: భారత్‌లో హైదరాబాద్ విలీనాన్ని వ్యతిరేకించిన రజాకర్లు కూడా ‘్భరత్ మాతాకి జై’ అన్న నినాదాన్ని వ్యతిరేకించారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మాతృభూమికి గౌరవ సంకేతంగా ఉన్న ఈ నినాదం విషయంలో అభ్యంతరాలెందుకో అర్ధం కావడం లేదన్నారు. ఈ ప్రకటన ద్వారా ఎమ్‌ఐఎమ్ నేతలకు వ్యతిరేకంగా బిజెపి దాడిని ఆయన మరింత ఉధృతం చేశారు. కన్నతల్లికి సమానం మాతృభూమి అని, దేశాన్ని కీర్తించడం ప్రతి పౌరుడి విధి అని అన్నారు. ఖాసిం రజ్వీ వారసులు గొంతుమీద కత్తిపెట్టినా ‘్భరత్ మాతాకీ జై’ అనేది లేదంటున్నారు. వారికి మద్దతునిచ్చే పార్టీ నేతలు దీనికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గురువారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో బంగారు లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్టు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ విదేశాలకు ఊడిగం చేస్తూ మాతృభూమిని కించపరుస్తూ భారత్‌మాతాకీ జై అననని ఒక నేత ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. మాతృభూమి కన్నతల్లి లాంటిదని, కన్నతల్లికి దండం పెట్టనివాడు మరి ఎవరికి పెడతారని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాషను మరిచినవాడు తన దృష్టిలో మనిషేకాదని, కన్నతల్లిని గౌరవించడంలో మతాన్ని జోడిస్తారా అని ప్రశ్నించారు. ప్రతి పౌరుడు దేశాన్ని కీర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశద్రోహానికి పాల్పడిన అఫ్జల్‌గురు వంటి నేరస్థులకు అత్యున్నత న్యాయస్థానం శిక్ష వేస్తే అలాంటి వారికి సంస్మరణ దినోత్సవాలు చేసే కొంత మంది విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్న పెద్దమనుషులు ఏమి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కులవివక్షను, వర్ణవివక్షను తీసుకువస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు చేపట్టే వ్యతిరేక చర్యలకు మీడియా హైలైట్ చేయడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల పట్ల వివక్షను ఎవరూ సహించబోరని అన్నారు. యూనివర్సిటీలో విద్యార్థి చనిపోతే ఎందుకు చనిపోయాడనే విషయాలను తెలుసుకోకుండా సంఘీభావాల పేరిట రెచ్చగొట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం సరికాదని చెప్పారు. ధర్మ పరిరక్షణ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విస్మరించ వద్దని పేర్కొన్నారు. భారత్‌మాతాకీ జై అనని నేతకు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. పార్లమెంట్ సమర్థవంతంగా పనిచేస్తోందని, బిల్లులు పాస్ అవుతున్నాయని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రధాన మంత్రి చేపట్టిన పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలకు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లక్ష కోట్ల రూపాయల వరకు ముద్ర రుణాలను పంపిణీ చేశామని వివరించారు. సంఘంలోని బలహీనతలను రూపమాపడానికి ఎంతోమంది మహనీయులు కృషిచేశారని, వారి ఆశయాలను ఆచరించాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు గుర్తుచేశారు.