సెట్స్‌పైకి వెంకటేష్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది ‘గోపాల గోపాల’ సినిమా తర్వాత ఇంతవరకూ మరే చిత్రంలో నటించలేదు వెంకటేష్. ప్రస్తుతం చాలా కథలు వింటున్న ఆయన ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో మంచి హిట్‌ను అందుకున్న మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పటికే కథా చర్చలు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుందట. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రముఖ నటి నయనతారను సంప్రదించారని, ఆమె కూడా నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. వెంకటేష్‌తో ఇదివరకే రెండు చిత్రాల్లో నటించింది నయనతార. ఇందులో వెంకటేష్ పోలీస్ అధికారిగా కనిపిస్తాడని, సినిమా మొత్తం కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని టాక్. ఈ చిత్రానికి ఇదివరకే రాధాకృష్ణ అనే టైటిల్ వినిపించింది. ఫైనల్‌గా ఈ చిత్రానికి ‘రాజారత్నం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ‘24క్యారెట్ గోల్డ్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ సినిమాతోపాటు వెంకటేష్ ‘ఓనమాలు’ ఫేమ్ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించేందుకు రెడీ అయ్యాడని తెలిసింది.