ఆంధ్రప్రదేశ్‌

1972లో ఏపీని విభజించి ఉంటే బాగుండేది : వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ‘ 1972లో ఏపీని విభజించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖచిత్రమే మారేది... 2004 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పింది... 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. 2004లో కాంగ్రెస్‌ తీర్మానం చేశాక అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పడాలని ఉత్తరాలు ఇచ్చాయి...’ అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలోని శనివారం ఏర్పాటు చేసిన సభలో- ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ అంశాలపై ఆయన వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో పార్లమెంట్‌లో అడిగానని.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం చేర్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్‌కి కలిగే లాభాలను వెంకయ్య వివరించారు.