Others

ఒకే మాట ఒకే బాట ( శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో తీయనిది స్నేహం. ఒకే రంగంలో కొనసాగుతున్న వారిలోనే ఒకరిపై మరొకరికి అసూయ రగులుతున్న ఈరోజుల్లో ఒక్కసారి స్వర్ణయుగం కాలంనుంచి నేటివరకు పరస్పరం ఆత్మీయ జీవితం గడుపుతున్న వాణిశ్రీ, గీతాంజలిలను చూస్తే ముచ్చటేస్తుంది. ఒక చిత్రంలో రెండు ప్రధాన పాత్రల్లో నటించిన ఇరువురు కళాకారుల మధ్య పాపులారిటీ విషయంలో మనస్పర్ధలు ఉదయించిన సందర్భాలు తెలుగు సినిమా రంగంలో చాలానే ఉన్నాయి. 1968లో విడుదలైన ‘పంతాలు పట్టింపులు’ చిత్రంలో నువ్వా నేనా అని పోటీపడి నటించిన వాణిశ్రీ, గీతాంజలి పోటీ అన్నది నటనలో మాత్రమే, నిజ జీవితంలో కాదని అంటారు. ఎంత బిజీగావున్నా తరచూ ఒకరినొకరు కలుసుకోకుండా ఉండలేరు. గీతాంజలి, రామకృష్ణల వివాహ సందర్భంలో పర్యవేక్షణ అంతా వాణిశ్రీదే. అలాగే ఆగస్టు 3 వాణిశ్రీ పుట్టినరోజున హడావుడి అంతా గీతాంజలిదే. సినిమాలకు/ ఇతర కార్యక్రమాలకు ఇద్దరూ కలసి వెళ్లటం అలవాటు. ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ఇద్దరూ ఏకాగ్రతతో శ్రద్ధగా చూస్తున్న ఈ ఫొటో చూస్తే మీకే అర్థమవుతుంది.. వీళ్ల స్నేహ బాంధవ్యం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717