Others

మనం దేనికీ తీసిపోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈవారం వెనె్నల అనుబంధంలో జాతీయ స్థాయి కష్టమా? అంటూ వచ్చిన వ్యాసంలో గత 62 ఏళ్లలో తెలుగు సినిమా ఒకే ఒక్క జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం సాధించుకోగలిగింది అంటూ వ్రాసారు. జాతీయ అవార్డులు ఇచ్చే విషయంలో పైరవీలు, కుళ్లు రాజకీయాలు, ప్రాంతీయ వైషమ్యాలు, పక్షపాత ధోరణి విశృంఖలంగా వున్నాయన్నది జగమెరిగిన సత్యం. రాజకీయంగా ఉపయోగం వుంటేనే అవార్డులు ఇచ్చే సత్సంప్రదాయం పెద్దలలో నెలకొని వుంది. అవార్డులు ప్రారంభించిన 62 ఏళ్లలో ఇటీవలి 20 సంవత్సరాలు తప్పితే మిగతా కాలంలో అవార్డులు గెలుచుకున్న ఇతర భాషా చిత్రాలకంటే అద్భుతమైన చిత్రాలు తెలుగులో వచ్చినా అవార్డులు దక్కలేదు. ప్రపంచ ఖ్యాతిపొందిన కెవి రెడ్డి, ఆదుర్తి, కె విశ్వనాథ్, క్రాంతికుమార్, దాసరి లాంటివారు రూపొందించిన అసంఖ్యాక చిత్రాలను గుర్తించి గౌరవించడంలో అవార్డుల కమిటీ విఫలమైందంటే అది వారి భావదారిద్య్రానికి, చేవచచ్చిన తనానికి, పక్షపాత ధోరణికి నిదర్శనం. విశ్వనాథ్ రూపొందించిన సినిమాల స్థాయికి తీసే సత్తా భారతదేశంలో ఎవరికి వుంది? అవార్డులు ఇచ్చినా ఇవ్వకున్నా, దక్కినా దక్కకున్నా స్వర్ణయుగపు కాలంలోని తెలుగు సినిమాలు అధికశాతం అంతకుమించిన స్థాయ ఉన్నవే. అంతమాత్రం చేత తెలుగు సినిమాను కించపర్చుకోవాల్సిన పని లేదు.

- సి.ప్రతాప్, శ్రీకాకుళం