Others

తెలుగుదనం ఉట్టిపడేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతికేళ్ల తరువాత -మళ్లీ తెలుగుదనం రుచి చూపించేలాంటి సినిమా వస్తోందన్న కథనాలు బాలయ్య అభిమానుల కళ్లలో ఆనందజలం ఊరిస్తున్నాయి. దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు తీర్చిదిద్దిన ‘ఆదిత్య 369’ విజయం సాధించిన దగ్గర్నుంచీ.. మళ్లీ అలాంటి సినిమా ఒకటి ఎప్పటికైనా చేస్తానని సందర్భానుసారం బాలకృష్ణ చెబుతూనే వచ్చాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక -వందో సినిమాగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి శ్రీకారం చుట్టామని ప్రకటించడంతోనే అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. దర్శకుడు క్రిష్ సారథ్యంలో ‘శాతకర్ణి’ షూటింగ్ శరవేగంగా సాగుతుండటంతో -స్క్రీన్ మీదకు ఎప్పుడొస్తాడా? అని నందమూరి అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణిపై అభిమానుల్లో ఆసక్తి పెరగడానికి -‘ఆదిత్య 369’లో బాలయ్య పోషించిన కృష్ణదేవరాయల పాత్రేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా సక్సెస్‌కు దర్శకుడు సింగీతం కృషి ఒక ఎత్తయితే, కృష్ణదేవరాయల ఔన్నత్యాన్ని, తెలుగు భాష మహోన్నతాన్ని ఆచకంలో వాచకంలో అద్భుతంగా చూపించిన బాలకృష్ణ మరో ఎత్తు. తెలుగును సరిగ్గా ఉచ్చరించలేని హీరోలను చూస్తున్న కాలంలో... మరోసారి తేట తెనుగు సంభాషణలు, వాటికి తన స్టయిల్ ఆపాదించి బాలకృష్ణ పలికే తీరుకోసం అభిమానులు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.
కీ.శే. జంధ్యాల రాసిన తేటతెలుగు సంభాషణలతో కృష్ణదేవరాయలుగా మెప్పించిన బాలకృష్ణ, ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణిగా ఏవిధమైన సంభాషణా చాతుర్యాన్ని, గంభీరతను ప్రదర్శిస్తారో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. హతవిధీ.. అప్పాజీ.. మా కాలంలోనే తస్కరణ యోగమున్నది. ఈ రంగు కాగితాలు ఇక్కడ నాలుక గీచుకోవడానికి కూడా పనికిరావు. ఏ దేశవాసులు.. నీటి ఆవిరితో నడిచే యంత్రములట.. లాంటి మాటలు బాలకృష్ణ తనదైన శైలిలో పలికిన తీరు అప్పట్లో ప్రతి ఒక్కరినీ అలరించింది. ఇప్పటికీ ఆదిత్య 369 ఏదైనా చానెల్లో ప్రసారమైతే -అందులోని స్వచ్ఛమైన తేనెలూరు తెలుగుపదాల సంభాషణలు, ఆకట్టుకునే డ్రామాతో చానెల్ తిప్పబుద్ధి కాదు. అలాంటి ఆదిత్య 369కు -వందో చిత్రాన్ని సీక్వెల్ చేసి అదే టైం మెషీన్‌లో ‘విక్రమార్కుడి’ కాలానికి వెళ్లే అవకాశం ఉందని అంచనాలు వేశారు. అక్కడ భట్టి విక్రమార్కుల పరిపాలనా విశేషాలు, ఉజ్జయిని దృశ్యాలను చూసే అవకాశం ఉంటుదనుకున్నారు. కానీ బాలయ్య మాత్రం శాతకర్ణుల కథను ఎత్తుకోవడం సాహసోపేత నిర్ణయమే.
ఆదిత్య 369 తీసినప్పుడు అప్పట్లో సినిమా సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా లేకున్నా -అద్భుత విజయాన్ని సాధించారు. ఇప్పుడు అత్యాధునిక సినిమా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది కనుక -‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో సరికొత్త అధ్యాయం బాలకృష్ణ సృష్టిస్తాడని అభిమానులు సంబరపడుతున్నారు.

-బి గిరివాసు