Others

మళ్లీ.. రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడుదలకు ముందు విపరీతమైన సంచలనం సృష్టించిన ‘జాగ్వార్’ -బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. భారీ బడ్జెట్, భారీ బలగాలతో -నిఖిల్ కుమార్‌ను హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. అయితే, మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి కొడుకు అయన నిఖిల్‌కు బడ్జెట్ ఇబ్బందులు లేవుకనుక -మరో భారీ బడ్జెట్ సినిమా తీసేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. జాగ్వార్ ఆడియో వేడుకలోనే -మలి చిత్రం టాలీవుడ్ డైరెక్టర్‌తో ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో ఆ చాన్స్ ఎవరికి వస్తుందోనని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆ చాన్స్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి వచ్చిందని వినికిడి. సురేందర్ రెడ్డికి పెద్ద మొత్తం ఆఫర్ చేయడంతో -నిఖిల్‌కుమార్‌తో సినిమా చేసేందుకు అంగీకరించాడని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం చరణ్‌తో ‘ధ్రువ’ ప్రాజెక్టులో బిజీగావున్న సురేందర్ రెడ్డి, తరువాతి ప్రాజెక్టుగా నిఖిల్ కుమార్‌తో సినిమా చేస్తాడని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.