Others

రష్మి మంత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేసింది రెండు మూడు సినిమాలే అయినా -చిన్న సినిమాల స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చేసుకుంది యాంకర్ రష్మి. ఇప్పుడు తన కెరీర్‌ను మరోమెట్టు పైకి ఎక్కించేందుకు నిర్ణయించుకుందట. పెద్ద ప్రాజెక్టుల్లో స్టార్ హీరోల సరసన చాన్స్‌లు పట్టే అవకాశం తక్కువే కనుక -కనీసం ఐటెమ్స్‌తోనైనా టాప్ హీరోల పక్కన కనిపించాలని నిర్ణయించుకుందట. సో.. రష్మి ఐటెమ్ సాంగ్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న మాట. స్టార్ హీరోయినే్ల ‘ఐటెమ్స్’కు తలూపగా లేనిది, నేనెంత అనుకుందో ఏమో -ఐటెమ్ ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నది ఇండస్ట్రీ టాక్. రాశిఖన్నాలాంటి హీరోయిన్లు సైతం ఆర్థికంగా, కెరీర్‌పరంగా లాభదాయకమైన ‘ఐటెమ్’కు సిద్ధపడినపుడు -రష్మి సై అనడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. కాకపోతే, రష్మికి అప్పుడే మారుతి నుంచి ప్రామిస్ దొరికిందని అంటున్నారు. తన తదుపరి ప్రాజెక్టులో చాన్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. ఆ చాన్స్ ఐటెమ్‌కా, హీరోయిన్‌గానా అన్నది దర్శకుడు మారుతే చెప్పాలి.