Others

కళాత్మక సేవ (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్టిస్టులు సినిమాల్లో నటించి ధనార్జన చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతుంటారన్న భావన జనావళిలో సహజం. కాని ఆ మహద్భాగ్యం అందరికీ సాధ్యమయ్యేది కాదు. కళాకారుల టాలెంట్, కృషి, వీటన్నింటికీ మించి ఒకింత అదృష్టం కలసిరావాలి. అంతకుమించి ప్రేక్షకాదరణ చాలా చాలా అవసరం. అందుకే ‘ప్రేక్షకులే మా ఆరాధ్యదైవాల’ని కళాకారులు పదేపదే చెప్పుకుంటుంటారు. అప్పుడప్పడూ వాళ్ల కోసం సినిమా ఆర్టిస్టులు జోలె పట్టిన సందర్భాలూ ఉంటాయి. రాష్ట్రంలో కరవు కాటకాల సమయంలోనో, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడో.. సినిమా కళాకారులు తమవంతు ధర్మంగా ముందుకొచ్చి నిధి సేకరణకు కృషి చేస్తుండేవారు. దీనికి ముఖ్య కారకుడు ఎన్టీ రామారావు. 1952లో రాయలసీమ కరువు నివారణ నిధి కొరకు ఎన్టీఆర్, జి వరలక్ష్మి మొదటిసారి జోలె పట్టారు. ప్రజల మధ్యకెళ్లి నిధి సేకరించారు. తరువాతి కాలంలో భారత్‌మీద చైనా దాడికి దిగినప్పుడూ, సైనిక సంరక్షణ, ఇతర సహాయ నిధి కోసం ఎన్టీఆర్ బృందం రాష్ట్రంలో పర్యటించి, నిధి సేకరణకు నడుంకట్టింది. అలా వైపరీత్యాలు సంభవించిన సమయంలో తమవంతు సహాయంగా నిధి సేకరణకు నాంది పలికిన వాళ్లలో ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా ఆరిస్టుల నుంచి అలా మొదలైన సంస్కతిలో భాగంగా భయంకరమైన దివిసీమ తుపాను సమయంలో ఖమ్మం కళాపరిషత్‌కు చెందిన వివి అప్పారావు సారథ్యంలో నిధి సమీకరణకు భారీఎత్తున రాష్టస్థ్రాయి నాటక పోటీలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి జమున, మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ సందర్భంలో దివిసీమ ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు నిధి సేకరణ కోసం ప్రేక్షకుల మధ్య నిలబడి జోలెపట్టి నిధి సేకరిస్తున్న జమున, మురళీమోహన్‌లను చూడొచ్చు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717