Others

నాకు నచ్చిన పాట ---- కళ్ళు తెరచి కనరా....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జానపద కవి సార్వభౌమునిగా, కవిరత్నగా విశేషంగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన సినీ పాటల రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి. ఆయన కలం నుంచి జాలువారిన -కళ్ళుతెరచి కనరా/ సత్యం ఒళ్ళు మరచి వినరా గీతాన్ని ‘రాజు-పేద’ చిత్రంలో వాడుకున్నారు. ఈ పాటలో కొసరాజు రచనా వైదుష్యాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, కథలో రిలీఫ్‌గా ఓ వీధి గాయకురాలి మీద చిత్రించిన ఈ గీతంలో రచయిత కలం చిలకించిన మానవత్వ భావాలు చాలా గొప్పగా అనిపిస్తాయి. -కళ్ళుతెరచి కనరా/ సత్యం ఒళ్ళుమరచి వినరా’ పల్లవిలో ప్రబోధం వికసిస్తే, ‘మేడల మిద్దెల మెలగేవారిలో/ పూరి గుడిసెలో తిరిగెవారిలో/ రక్తమాంసములు ఒకటేకదరా హెచ్చు తక్కువలు హుళక్కిగదరా...’ అంటూ చిన్ని చిన్ని మాటలతో మొదటి చరణంలో సర్వసమత్వభావాన్ని వినిపిస్తారు. పరమాన్నం తిని మురిసె వారిలో/ పట్టెమంచముల పండెవారిలో/ అంబలి తాగీ ఆనందించే పేదలకున్నా హాయిలేదురా! అనే రెండో చరణంలోని నిష్ఠురమైన నిజం వెల్లడింపూ శ్రోతల్ని అంతర్ముఖుల్ని చేస్తాయి. సినిమా పాటకూ, మాటకూ ఆ మాటకొస్తే అసలు సినిమాకే లక్ష్యం, లక్షణం, వినోదం మాత్రమేనని గట్టిగా విశ్వసించే కొందరిని ఈ పాటలోని సాహిత్యం నిలదీసి ప్రశ్నిస్తుంది. ఇక చివరిదీ మూడవదీ అయిన చరణంలో కాలచక్రమూ మారిందంటే/ కథ అడ్డంగా తిరిగిందంటే/ రాజే పేదై బాధలు పడునో, పేదె రాజై సుఖమునొందునో అంటూ కాలజ్ఞాన బోధచేస్తాడు రచయిత. ‘ది ప్రిన్స్ అండ్ ది పాపర్’ అన్న ప్రఖ్యాత ఆంగ్ల నవలను విఖ్యాత దర్శక నిర్మాత బిఎ సుబ్బారావు 1954లో ‘రాజు-పేద’ చలనచిత్రంగా తెలుగు తెరకు అనువదించారు. ఈ పాటకు నాట్యం చేసింది కుచలకుమారి. ఆ రోజులలో పేరెన్నికగన్న నర్తకి ఆమె. చూడముచ్చటైన ముఖంతో ఒద్దికైన పలచని దేహంతో సున్నిత నృత్య భంగిమలతో ఇట్టే ఆకట్టుకుంటుందీమె సోయగం. ఈ పాట ఎన్నిసార్లు విన్నా, చూసినా తనివి తీరదు.

..........................

వెనె్నల రచయితలకు
సూచన

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

* ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
* రచనల్లో కొత్తదనం ముఖ్యం
* అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
* కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
* తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
* కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
* ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
* రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో vennela@deccanmail.comకు మెయల్ చేయగలరు.
* ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-ఎసి పుల్లారెడ్డి, అనంతపురం