Others

ఆల్‌రౌండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యం పిక్చర్స్ సంస్థ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించిన ‘నర్తనశాల’ (1963) గుర్తుండే ఉంటుంది. అఖండ విజయం సాధించిన ఆ చిత్రంలో పాత్రలన్నీ ఒక ఎత్తు, ఎన్టీఆర్ ధరించిన బృహన్నల పాత్ర మరో ఎత్తు. పాత్ర పోషణలో ఎన్టీఆర్ తీసుకొన్న శ్రద్ధ, ఏకాగ్రత గురించి ఆ రోజుల్లో పరిశ్రమ వర్గాలు ప్రత్యేకంగా చెప్పుకునేవి. ముఖ్యంగా యల్ విజయలక్ష్మికి నృత్య శిక్షణలో బృహన్నల ఆలపించిన (బాలమురళీకృష్ణ) గీతం ‘సలలిత రాగ సుధారస సారం’ పాట చిత్రీకరణను పరిశీలిస్తే ఎన్టీఆర్ మేకప్ దగ్గర నుంచి ఆహార్యం వరకూ ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతుంది. ఆ చిత్రం తర్వాత తెలుగులో మరే నటుడు అలాంటి సాహసానికి ముందుకురాలేక పోయారన్నది అక్షరాలా నిజం. దశాబ్దాల తర్వాత హీరో రాజేంద్రప్రసాద్ మాత్రం అలాంటి చిన్న సాహసం చేశారు. ‘ఆల్‌రౌండర్’ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ను బృహన్నల గెటప్‌లో చూసి తెలుగు ప్రేక్షకులు తన్మయులయ్యారు. పాత్ర గెటప్ నుంచి ఆహార్యం వరకూ రాజేంద్రప్రసాద్ సైతం ఎన్నో జాగ్రత్తలు
తీసుకుంటారనడానికి ‘ఆల్‌రౌండర్’ గెటప్‌ను ఉదహరించొచ్చు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717