అంతర్జాతీయం

భారత్ వెళ్లేందుకు ఇది సమయం కాదు : మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: భారత్‌నుంచి తాను పారిపోయి రాలేదని, అక్కడకు వెళ్లడానికి ఇది సరైన సమయం కాదని ప్రపంచ మద్యం వ్యాపార దిగ్గజం విజయ్‌మాల్యా చెప్పారు. ‘సండే గార్డియన్’ పత్రికకు ఈమెయిల్ ఇంటర్వ్యూలో తాజా వివాదంపై ఆయన అభిప్రాయాలు వెల్లడించారు. వ్యాపారాల్లో రిస్క్ తప్పదని, రుణాలు ఇచ్చే బ్యాంకులకు ఆ విషయం తెలుసునని అన్న మాల్యా తాను భారత్‌నుంచి విదేశాలకు వెళ్లడం ఇప్పుడు కొత్తకాదని, తరచూ విదేశాల్లో పర్యటిస్తూంటానని అన్నారు. ఇప్పుడు మాత్రం వ్యాపారం పనులపై రాలేదని, తాను ఎక్కడ ఉన్నదీ బయటకు చెప్పలేనని అన్నారు. తనను నేరగాడిగా ముద్రవేశారని, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దిల్లీనుంచి బయలుదేరినప్పుడు 7 సూట్‌కేసులతో వెళ్లానని పత్రికల్లో రాశారని, నేను, నా స్నేహితునితో కలసి లండన్ వచ్చానని, ఇద్దరికి ఈ మాత్రం లగేజి ఉండటంలో వింతేమీ లేదని అన్నారు.