ఆంధ్రప్రదేశ్‌

ప్రతి చేనుకూ సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదే మోదీ ప్రభుత్వ లక్ష్యం కిసాన్ మోర్చా అధ్యక్షుడు విజయ్‌పాల్‌సింగ్

రాజమహేంద్రవరం, మార్చి 11: దేశంలోని ప్రతి చేనుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోది సర్కార్ వ్యవసాయ రంగం అభివృద్ధికి కార్యక్రమాలను చేపడుతోందని బిజెపి కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు విజయ్‌పాల్‌సింగ్ తోమర్ చెప్పారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సదస్సుకు రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షుడు పూడి తిరుపతిరావు అధ్యక్షతవహించారు. ఈ సందర్భంగా కిసాన్‌మోర్చా వెబ్‌సైట్‌ను విజయ్‌పాల్‌సింగ్ ప్రారంభించారు. మార్చి 9 నుండి 15వరకు దేశ వ్యాప్తంగా రైతు సదస్సులు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సదస్సును రాజమహేంద్రవరంలో రాష్ట్ర కిసాన్‌మోర్చా ఏర్పాటుచేసినట్టు విజయ్‌పాల్‌సింగ్ చెప్పారు. రైతులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని జాతీయ అధ్యక్షుడు విజయ్‌పాల్‌సింగ్ చెప్పారు. దేశంలో 65శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారని, ఇందులో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువని చెప్పారు. సాగునీటి వసతి లేకపోవటంతో పంట వేసిన తరువాత పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి, భగవంతుడిపైనే భారం వేయాల్సిన పరిస్థితుల్లో రైతులు ఉన్నారన్నారు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవటం, నష్టాలను మిగులుస్తుండటంతో దేశంలో ఇప్పటికే రెండున్నర లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. చెరకు రైతుల సమస్యలను ప్రధాని మోదీకి వివరించామని, వారిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. గత ప్రభుత్వాలు చక్కెర కార్మాగారాల యాజమాన్యాలకే ప్రయోజనం కల్పించేవని, ఇపుడు రైతులకు కూడా ప్రయోజనం కల్పించే కార్యక్రమాలను మోదీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. చెరకు రైతులకు రూ.6వేల కోట్ల రుణాలు అందించాలని మోది సర్కారు నిర్ణయించిందన్నారు. గత యుపిఎ ప్రభుత్వం బ్రెజిల్ నుండి చక్కెరను దిగుమతి చేసుకోవటం వల్ల దేశంలో చాలా చక్కెర కర్మాగారాలు నష్టాల్లో కూరుకుపోయి, రైతులకు బకాయిలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చక్కెర దిగుమతులపై సుంకాన్ని 15శాతం నుండి 40శాతానికి పెంచిందని, ఎగుమతులకు టన్నుకు రూ.4వేలు అందించాలని నిర్ణయించిందన్నారు. ఆయిల్ కంపెనీలు 10శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలిపే విధంగా చర్యలు తీసుకుందన్నారు. దీనివల్ల చెరకు రైతులకు అధిక ప్రయోజనం కలుగుతోందన్నారు. దేశంలోని అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర లభించే విధంగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
కొత్త బీమా పథకంతో భరోసా
దేశంలోని రైతులకు అండగా నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక కొత్త బీమా పథకాలను, వ్యవసాయ రంగం అభివృద్ధికి కార్యక్రమాలను చేపడుతోందని విజయ్‌ఫాల్‌సింగ్ తోమర్ చెప్పారు. శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు. గతంలోనే వాజ్‌పేయి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిచేసేందుకు సాగునీటి వనరులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో నదుల అనుసంధానాన్ని చేపట్టిందన్నారు. ఈసారి మాత్రం కేంద్రంలోని నరేంద్రమోది ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించటంతో పాటు ప్రకృతి వైపరీత్యాల్లో రైతులను ఆదుకునే విధంగా కొత్త పంటల బీమా పథకాన్ని ప్రవేఫెట్టిందన్నారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాన్ని పొందే విధంగా ఈ బీమా పథకాన్ని రూపొందించారన్నారు. గతంలో ప్రకృతి వైపరీత్యాల్లో పంటలు దెబ్బతిన్నపుడు రెవెన్యూ అధికారులు చుట్టూ రైతులు తిరగాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడా పరిస్థితి ఉండదన్నారు.