వినమరుగైన

ఆధునిక మహాభారతము - గుంటూరు శేషేంద్ర శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏక సూత్రత లేకపోవడం ఆధునిక మహాభారతం ఇతిహాస స్థాయిని అందుకోకపోయినా పాఠకుని మనస్సులో కవిత్వపు ముద్రల్ని బలంగా వేస్తుంది.
‘‘బ్రహ్మాండమైన నక్షత్రాల ఊరేగింపులో
వెనె్నల జెండా పుచ్చుకుని చంద్రుడు
ముందు నడుస్తున్నాడు’’
ఇది గొప్ప ఊహ, ఊహ నుంచి సందేశమేదైనా ఉందా అంటే తాళం చెవి దొరకడం కష్టం. కానీ
సముద్రం ఒకడి కాళ్ల ముందు
మొరగదు-
తుపాను గొంతుకు చిత్తం అంట
ఎరగదు
నేనింతా తలిస్తే పిడికెడు మనే్న కావచ్చు
కలమెత్తితే ఒక దేశపు జెండాకున్నంత
పొగరు నాకుంది’’
ఇది శేషేంద్ర ముద్ర. అభివ్యక్తి + సందేశం అలవోకగా సాగిపోయిన సందర్భాలలో మహాకవిగా అభివ్యక్తికి మాత్రమే ప్రాధాన్యమిచ్చినపుడు ఆధునిక కవిగా సందేశానికి మాత్రమే ప్రాధాన్యమ్చినపుడు తాత్త్వికునిగా కనిపిస్తాడు శేషేంద్ర ప్రతి వాక్యమూ కవిత్వోల్బణం సాగిపోయే ఆధునిక మహాకావ్యం ఆధునిక మహాభారతం-
పాటలుగా, పద్యాలుగా, గేయాలుగా, వచన కవిత్వంగా విభిన్న ధోరణులుగా సాగిన కవిత్వ సందర్భాల సమాహారమే ఆధునిక మహాభారతం.
ముందుగా జనవంశాన్ని చదివి తర్వాత ఆధునిక మహాభారతం చదివితే పాఠకునికి కవి త్వరగా అర్థమవుతాడు.
తిక్కన పూర్తిగా తెలియాలంటే నిర్వచనోత్తర రామాయణం చదివి తర్వాత భారతం చదివితే మంచిది కదా!
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
*
-అయిపోయంది

-రాళ్లబండి కవితాప్రసాద్