వినమరుగైన

కన్యాశుల్కం - గురజాడ అప్పారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడుగుజాడ గురజాడ అది భావికిబాట
మనలో వెధవాయిత్వం మరపించేపాట
అడుగుజాడ
ఇవి శ్రీశ్రీ కవితా వాక్యాలు. ఇందులో గురజాడ సాహిత్య సారమంతా ఇమిడి ఉంది. గురజాడ అడుగుజాడని గుర్తించాలంటే ఆయన సాహిత్యాన్నంతా పరిశోధించాలి. అందుకు స్థూలంగా కన్యాశుల్కాన్ని పరిశీలించినా చాలు.
ప్రధానోద్దేశం
గురజాడ జీవితకాలపు కృషి, కన్యాశుల్కం నాటకం. అది విశదం చేసిన అంతరార్థమే గురజాడ అడుగుజాడ. కానీ ఇంతవరకూ తాత్కాలిక లక్ష్యాలకి బాల్య వివాహ, విధావ వివాహ, వేశ్యా సమస్యలకి పరిమితమై నాటకం ప్రయోగించబడింది. ఫలితంగా నాటక రచనకి ప్రాణమైన రచయిత ప్రాపంచిక దృక్పథం కనుమరుగైంది.
కనుమరుగైన కోణాన్ని శ్రోతల ముందుంచి కాస్త ఆలోచింపజేయడమే నా ప్రసంగ వ్యాసం ప్రధానోద్దేశం.
తరగని గని
ఈ నాటకం మీద జరిగినంత చర్చ మరే తెలుగు నాటకంమీద జరగలేదు. రెండు వందల పేజీల నాటకం మీద రెండువేల పేజీలకిపైన విమర్శనా సాహిత్యం వచ్చింది. ఈ నాటకానికున్న వివాదాస్పద లక్షణంవల్ల ఇక మీదట ఇంకా వస్తుంది.
మన సాహిత్య విమర్శకుల్లో కొందరు కన్యాశుల్కం నాట్యశాస్త్రం తూకపురాళ్లకి తూగడంలేదు గనుక నాటకం కాదన్నారు. మరికొందరు ప్రదర్శనాయోగ్యత లేదన్నారు. శ్రీపాద కామేశ్వరరావు లాంటి వారు ప్రాచ్య పాశ్చాత్య నాటక పద్ధతుల ప్రకారమే నాటకం ఎలాగైందో నిరూపించారు. నిజానికి ఇలాంటి విజ్ఞతే కొత్త కొత్త విషయాలెన్నో కన్యాశుల్కం నాటకం నుంచి తవ్వి తలకెత్తుతున్నారు. ఆ నాటకాన్ని తరగని గదిగా నిరూపిస్తున్నారు.
కెలడియో స్కోప్
కన్యాశుల్కం నాటకాన్ని కెలడియోస్కోప్ అన్నారు శ్రీనివాస చక్రవర్తి. అబ్బూరి రామకృష్ణారావుగారు ఈ నాటకాన్ని వున్నదున్నట్లుగా సలక్షణంగా ఎప్పుడో ఒకప్పుడు ప్రదర్శించాల్సి వుందన్నారు. వారాసించినట్టు, వ్యయ ప్రయాసలకోర్చి ప్రయోగించగల గీవ్ గుడ్ లాంటి ప్రయోక్త వచ్చి ప్రయోగించినపుడే ఆ కెలడియోస్కోప్ లక్షణం స్పష్టమవుతుంది.
కొన్ని కోణాలు
అబ్బూరివారు, నార్ల వారు బాల్య వివాహం కోణం నుంచి ఎడిట్ చేశారు. ఈ సంక్షిప్తీకరణలో లుబ్ధావధాన్లు ప్రధాన పాత్రయింది. మిగిలిన పాత్రలు- ముఖ్యంగా కథాకథన బోధక శక్తులైన గిరీశం, మధురవాణులు- ప్రధానమయినాయి. ఫలితంగా ఈ నాటకానికి ప్రాణమైన సమాజ వాస్తవికత - దాని సాయంతో రచయిత చేసిన అంతరార్థ విశదీకరణ కనుమరుగైంది.
మరో కోణం విధవా వివాహాన్ని ప్రధానంగా భావించిన సంక్షిప్తీకరణది. ఈ ఎడిటింగులో గిరీశం ప్రధాన పాత్రయింది. ఇదీ వెనుకటి ఎడిటింగ్స్‌లో లాగే చెరువు గట్టు దృశ్యంతో ముగుస్తుంది. ఫలితంగా వాస్తవికత విశదీకరణ కనుమరుగవడంతోపాటు గిరీశం కథానాయకుడిగా సూచితం కావడం జరిగింది. అయితే గిరీశాన్ని నాయకుడుగా భావించే కోణం కూడా సాహిత్యవేత్తలనుంచే వచ్చింది.
ఇందుకు కన్యాశుల్కాన్ని తరచి చూసిన శ్రీనివాస చక్రవర్తి అంచనాల్ని చూద్దాం. వారు గిరీశంలోని దుర్లక్షణాల్ని గుర్తించారు. కానీ వాళ్ల వీళ్ల కొంపలార్చి మేడలు మిద్దెలు కట్టే ఆలోచన వున్నట్లు కనిపించలేదన్నారు. ఈ పాత్రలోని కీలకాంశం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నారు. గిరీశాన్ని బఫూర్ కిందో, రోగ్ కిందో జమకట్టేస్తే అప్పారావుగారి ఆశయమే దెబ్బతింటుందన్నారు. ఆ పాత్ర బజారు మనిషి అయిపోయే ప్రమాదం వుందన్నారు.
ఆర్.ఎస్.సుదర్శనం గిరీశాన్ని పారిస్ విప్లవం నుంచి పుట్టిన స్వేచ్ఛకి ప్రతీకగా భావించారు. ఇలా భావిస్తున్న సాహిత్యవేత్తలు చాలామందే వున్నారు. కానీ కాస్త నిశితంగా చారిత్రక దృష్టితో చూడగలిగితే వీరి అంచనా అర్థసత్యమని తేలుతుంది.
నిజానికి రచయితే సౌజన్యారావు చేత గిరీశాన్ని ‘ఆషాఢభూతి’ అని వాచ్యంగా చెప్పించారు. అక్కడితో ఆగకుండా ఇది వంకరతీరని కుక్కతోక స్వభావం సుమా అని చివర్లో ‘డామిట్! కథ అడ్డం తిరిగింది’ అన్న ఆ పాత్ర వాక్యం ద్వారా సూచించి నాటకాన్ని ముగించాడు. కె.వెంకటేశ్వరరావు వేశ్యా సమస్య కోణం కూడా సూచితమయ్యేలా ఎడిట్ చేసి ప్రయోగించారు.
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
*
-సశేషం

-కాకరాల