వినమరుగైన

పాండవోద్యోగ విజయాలు -తిరుపతి వేంకటకవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరం అణువైతే అణుశక్తి సాహిత్యం
అక్షరం సుమమైతే పరిమళం సాహిత్యం
అక్షరం మనిషైతే అంతరాత్మ సాహిత్యం
తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతమైన ఇతివృత్తంతో, నాటక ప్రక్రియలో ఈ శతాబ్దాన్ని పరవశింపజేసిన నాటకం పాండవోద్యోగ విజయాలు. దీని కర్తలు తిరుపతి వేంకటకవులు. తెలుగులో జంట కవులు అనగానే గుర్తొచ్చేది వీరే- శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్ర్తీగారు, శ్రీ దివాకర్ల తిరుపతి శాస్ర్తీగారు. వీరిద్దరూ ఒక నాటకమే కాదు కావ్యాలు, వ్యాసాలు, రాజసందర్శన చంపువులు కథలు గాథలు ఒకటేమిటి ఈ శతాబ్దపు తొలి అర్ధ శతాబ్దిపై వీరి ప్రభావం చాలా ఎక్కువ. అవధానవిద్యను ఆంధ్రదేశంలో పట్ట్భాషేకంగావించి కవిత్వం అంటే అవధానమే అనే దశకు తీసికొని వచ్చారు. కవియైన ప్రతిఒక్కడూ తనకు అవధానం చేయందే మోక్షం సిద్ధించదు అనే దశకు తీసుకొని వచ్చారు.
కవిత్వాన్ని ముఖ్యంగా పద్యకవిత్వాన్ని ప్రదర్శనాత్మకమైన కళగా ప్రాచుర్యం తెచ్చింది వీరే. క్రీ.శ. 15వ శతాబ్దంలో రామరాజభూషణుడు అవధానం ప్రవేశపెట్టినా అది కేవలం పండితైకవేద్యంగా ఉండేది. కాని దాన్ని పామరులు సైతం ఆనందించేలా తీర్చిదిద్దిన ఘనత తిరుపతి వేంకట కవులదే.
సాధారణ కవులకు అవధాన కవులకు వ్యత్యాసం ఉంటుంది. అవధానులు వ్రాసే కవిత్వంలో లయ ఎక్కువగా ఉంటుంది. ప్రజల నాడికి అనుగుణంగా శబ్దం ధ్వనిస్తుంది. పద్య శిల్పంలో సౌష్టవం ఉంటుంది. పద్యం నడకలో సౌందర్యం ఉంటుంది. కావ్య కవులలో ఇవి ఉన్నా అవధాన కవులలో ఈ లక్షణాల శాతం ఎక్కువ. అందుకే తిరుపతి వేంకట కవుల పద్యాలు జనంలోకి వెళ్లాయి. నటుల నాల్కలపై నర్తించాయి.
తిరుపతి వేంకటకవులు కావ్యాలు రాశారు. గీరతం, పాణిగ్రహీత, శ్రీ కామేశ్వరీ శతకం వంటివి. నానారాజ సందర్శనం జాతకచర్య, తిరుపతి వేంకటీయం, కథలు, గాథలు కూడా వీరి రచనలే. కానీ పాండవోద్యోగ విజయాలు నాటకానికి వచ్చినంత ఖ్యాతి మరే కృతికి రాలేదనేది నిర్వివాదాంశం.
పాండవోద్యోగ విజయాలు నాటకం ఈ శతాబ్దంలో ఎక్కువ ప్రభావం కలిగించిన నాటకాలలో అగ్రశ్రేణిలో వుంది. పౌరాణిక నాటకాలైన హత్యహరిశ్చంద్ర, రామాంజనేయ యుద్ధం, తులసీజలంధర వంటి నాటకాలు ఎన్ని ఉన్నా పాండవోద్యోగ విజయాలు అనగానే తెలుగువారు ఆత్మీయంగా పులకిస్తారు.
తిరుపతి వెంకటకవులు భారతగాథని మొత్తాన్ని నాటకంగా రాశారు. దాన్ని ఆరు భాగాలుగా విభజించుకున్నారు. అవి
1.పాండవ జననం (ఏడంకాల నాటకం) 2.పాండవ ప్రవాసం (ఏడంకాల నాటకం) 3.పాండవోద్యోగం (ఆరంకాల నాటకం) 4.పాండవ విజయం ఎనిమిదంకాల నాటకం) 5.పాండవాశ్వమేధం (ఆరంకాల నాటకం) 6.పాండవ రాజకీయం (ఆరంకాల నాటకం)
అంటే 40 అంకాలలో యావద్భారతాన్ని నాటకీకరించారు. ఈ నాటకాలన్నీ సంస్కృత నాటక లక్షణాలను చాలావరకు పుణికి పుచ్చుకున్నాయి. నాంది, ప్రస్తావన, అంకము, విష్కంభము, చూళిక, భరతవాక్యం అన్నీ సలక్షణంగా వాడారు.
ముఖ్యంగా అంక విభజనలో వీరు సంస్కృత నాటక లక్షణమైన
‘‘ఏకైక దివసం వృత్తం ఏకనేతృ ప్రయోజనం
బహుపాత్ర ప్రవేశార్హం అంకమాసన్ననాయకం’’
అనే లక్షణం 40 అంకాలలో కనిపిస్తుంది. అన్ని అంకాలలో నాయకుడు లేకున్నా నాయక ప్రస్తావన అయినా ఉంటుంది. అలాగే నాటకంలో నాందీపద్యాన్ని శ్రీకారంతో ప్రారంభించకపోవడం ఒక రకంగా విశేషం. ఎందుకంటే సంస్కృత నాటకాలలో కూడా నాందీపద్యం శ్రీకారంతో ఉండదు.
కాళిదాసు శాకుంతలం యాసృష్టిఃసృష్టు రాద్యాతో ప్రారంభమయింది. ఇవేకాక తిరుపతి వేంకటకవులు ప్రభావతీ ప్రద్యుమ్నం, దంభవామనం, అనర్ఘనారదం- సుకన్య అనే నాటకాలు రాశారు.
కావ్యేషు నాటకం రమ్యం అనీ నాటకాంతః హి సాహిత్యం అనీ అలంకారికులు అంటారు. కాని తెలుగులో నన్నయ భట్టారకుని నుంచి అంటే 11వ శతాబ్దం నుండి 19 శతాబ్దం వరకు సలక్షణాలైన నాటకాలు కనపడవు. తిక్కన, ఎర్రన, శ్రీనాథ, పోతన, అష్టదిగ్గజాలు ఎవ్వరూ నాటక ప్రక్రియజోలికి పోకపోవడం ఆశ్చర్యం.
అనంతరకాలంలో చేమకూర వెంకన్న దక్షిణాంధ్ర యుగంలో యక్షగానాలు వచ్చాయిగానీ నాటకాలు రాలేదు. కానీ అదే కాలంలో సంస్కృత నాటకాలైన దిజ్నాగుని కుందమాల, కాళిదాసు శాకుంతలం, భాసుని ప్రతిమ- స్వప్నవాసవదత్త, భవభూతి, ఉత్తరమరామ చరిత్ర, శూద్రకుని మృచ్ఛకటికం, విశాఖదత్తుని ముద్రారాక్షసం- ఇంకా అనేక నాటకాలు తెలుగు కవుల రచనలపై ప్రత్యక్ష పరోక్ష ప్రభావాన్ని కలిగించాయి. వారంతా ఈ నాటకాలు చదివినవారే. ఆదికవి నన్నయ్య భారతావతారికలో పురాణ విదులు, నటులు, నాటకాలు ఉన్నట్లు చెప్పారు. కానీ అవేవీ కావ్య గౌరవాన్ని పొందలేదేమో. అదీకాక కావ్యాలు, యక్షగానాలపైననే తెలుగువారికి, తెలుగు రాజులకు మోజు ఉండటం కూడా కారణం కావచ్చు.
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
*
-సశేషం

-రాళ్ళబండి కవితాప్రసాద్