వినమరుగైన

రాజమన్నారు నాటికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1920ల నాటికే రాజమన్నారు ఏకాంకికలు వెలువడినా.. అవి రావలసినంత పరిగణనలోకి రాలేదని తెలుపుతూ దానికి గల కారణాలను విశే్లషించారు గోపాలస్వామి గారు.
19వ శతాబ్దపు యూరోప్ సాంస్కృతిక ప్రభావం మోసుకువచ్చిన నైతికాడంబరత్వంతో రాజమన్నారుగారు పోరాడవలసి వచ్చింది. గొప్ప ఆశయ సిద్ధి కలిగిన ఆనాటి సంఘ సంస్కరణోద్యమం ఒక్కోచోట శుష్క శోత్రీయమై క్రమేణ మూఢనైతికత్వమై చివరికి డంబాచారంగా తయారైంది. ఆ ధోరణిపై రాజమన్నారు నాటికలు దెబ్బతీసాయి. హుందాగా, ధీమగా, సూటిగా- ఇదీ రాజమన్నారునాటికల సాహిత్య ప్రాధాన్యత.
రాజమన్నారు నాటికల కేంద్ర బిందువు స్ర్తి. ఆమె చుట్టూ అల్లుకుపోయిన అనేకానేక బంధాలు, సామాజిక నీతి నియమాల పళ్లమాను కింద నలిగిన ఆమె దయనీయస్థితి.
సమయం సందర్భం కలిసిరాగానే మనిషిలోని అసలు స్వరూపం బట్టబయలు అవుతుంది. నాటికలోని కథనాన్ని చాలా సహజంగా సాగిపోయేట్లు మలచడం.. వైవిధ్యభరితమైన పాత్రలను సమయానుకూలంగా ప్రవేశపెట్టడం, ఆ పాత్రల నడుమ వారి వారి మనస్తత్వ వైచిత్రిని, భావవిచారాలను, రాగద్వేషాలను దాపరికం లేకుండా ప్రకటించుకోగలిగే సహజ సందర్భాలను కలిగించడం- రాజమన్నారు లేఖినిలోని ఎత్తుగడ.
జన్మతః వేశ్య. ఆ తరువాత సినిమా తార అయిన కనకాంగిని పెళ్లాడి.. ఆమెను తనవారికి పరిచయం చేయడానికి తీసుకువచ్చిన సందర్భంలో వేణు లోని సంస్కార విశేషం బయటపడుతుంది ఏమి మగవాళ్లు! నాటికలో.
జబ్బుపడిన స్నేహితుడిని జాలిపడి భర్త ఇంటికి తీసుకువస్తే.. ఆ ఇల్లాలిలో ఇన్నాళ్లు నిక్షిప్తమై ఉన్న పరకీయ వెల్లడి అవుతుంది.
దెయ్యాల లంకకు విహారానికి వెళ్లిన కుటుంబంలోని బాలవితంతువులో అంతకాలం దాగివున్న భావుకురాలు ఒక్కసారిగా పున్నమి జాబిలిలా విప్పారుతుంది.
పాత్రల వాదోపవాదాలను ప్రకటించడం, న్యాయాన్యాయాలను విచారించడం, ధర్మాధర్మాలను విశే్లషించడం- అవన్నీ యథాలాపంగా కథానుగుణంగా ఎక్కడికక్కడ ఒదిగిపోతాయి.
దిమ్మతిరిగే ఉపన్యాసాలు కానీ, ప్రబోధాలు కానీ ఈ నాటికలలో తక్కువ. నాటికలలోని పర్యవసానాలే సందేశాలుగా పాఠకులను చేరతాయి.
కరుణార్ద్రతతో కూడిన పాత్రల లోతైన మనోభావాలే పాఠకునిలోని సున్నిత పార్శ్వాన్ని కదిలించి కంటతడి పెట్టిస్తాంయి. ఈ విధమైన హృద్యతను చిన్న నాటికలలో ఏకాంకికల్లో సాధించడం అంత సులభం కాదు.
ఒకే పాత్ర యొక్క భిన్న పార్శ్వాలను తడిమి చూడగల విస్తృత అవకాశం నాటకంలోనూ, నవలలోనూ ఉంది. ఏకాంకికలో చిన్న నాటికలో పరిమిత వ్యవధిలో పాత్ర యొక్క నిండైన వ్యక్తిత్వాన్ని మూర్తివంతం చేయడం సులువు కాదు. అది సాధ్యమూ కాదని నిరూపిస్తారు రాజమన్నారు, జయశ్రీ, కనకాంగి, చిత్రలేఖ, ప్రభ, సుధ తదితరులు.
రాజమన్నారు తన పాత్రలను ఆదర్శప్రాయం చేయరు. మానవ సహజాత లక్షణాలైన తప్పొప్పులను కోపతాపాలను భావోద్రేకాలను యధాతథంగా చిత్రిస్తారు.
అందుచేతనే కాబోలు- ఆదర్శమూర్తిగా, దైవాంశ సంభూతుడిగా, మానవ న్యాయ విచక్షణకు అతీతుడిగా తీర్చిదిద్దిన జానపద కథానాయకుడు సర్దార్ పాపడు కూడా ఓ సందర్భంలో కన్నతల్లిపైనే కత్తి దూయబోతాడు. అతని భార్య నాంచారు మద్యం మత్తులో క్షణిక విచక్షణను కోల్పోయాడని తెలుపుతుంది! సర్దార్ పాపడిలోని భావ పరిణామానికి ఇది ఒక ముఖ్య సన్నివేశమని తెలుస్తోంది.
పాత్రల పరిణతిలో ఔన్నత్యమూ వున్నది. దిగజారుడుతనం వున్నది. బాహ్య సౌందర్యాన్ని ప్రేమించిన జయశ్రీ ఆత్మత్యాగంతో మహోన్నత ప్రేమకు ప్రాణం పోసింది. కాలుజారిన బాలవితంతువును పెళ్లాడిన కొడుకును దూరం చేసుకొన్న కన్నవాళ్లు కన్న ప్రేమకే పెద్ద పీట వేసి, కొడుకును కోడలితో సహా ఇంటికి ఆహ్వానించారు.
తనకోసం చిత్రలేఖ ఎంత త్యాగం చేసిందీ తెలిసినా అసూయకు లోనై అవమానానికి తావై ఆమెనే విడిచివెళ్తాడు జమిందారు.
వేశ్య అనీ, తార అనీ తెలిసి పెళ్లాడినా ఒక చిన్న తాకిడికే కుసంస్కారాన్ని బట్టబయలు చేస్తాడు మరో సంస్కరణవాది.
రాజమన్నారు నాటికల ఇతివృత్తాలలో భిన్నత్వం ఉంది. వైశాల్యం ఉంది.
మానవ జీవితం ప్రేమ అనే ఇరుసుమీదే ఆధారపడింది. మిగిలిన భావాలన్నీ దానికి సానుకూలంగానో, వ్యతిరేకంగానో పుట్టేవే.
ఆ ప్రేమకు అనేక రూపాలు. వ్యక్తిగతంగా వెల్లివిరిసినా సమాజగతమై మిగులుతుంది. ప్రకృతి సహజమైన ప్రేమను మానవ నిర్మితమైన నీతి నియమాలలో బందీ చేయాలన్న ప్రయత్నం అన్నివేళలా ఫలప్రదం కాదు. ప్రేమ స్వరూప స్వభావం ఏదైనా ఆ పర్యవసానానికి గురి అయ్యేది స్రీయే.
*
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-పి.చంద్రలత