వినమరుగైన

కీర్తిశేషులు - భమిడిపాటి రాధాకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారి రచనలమీద సర్వహక్కులు వదిలితే, అందేది కేవలం పది రూపాయల నించి 20 రూపాయలు మాత్రమే.
ఇలాంటి హృదయ విదారక సంఘటనలు, అలనాటి సాంఘిక పరిస్థితులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తెలుసుకుని మూగబాధతో రోదించగా, తన మనసులో రగిలిన ఒక చిన్న నిప్పుకణం, కీర్తిశేషులు నాటకమని, రచయిత రాధాకృష్ణగారు స్వయంగా ఆవేదనతో అన్నారు.
అసలు నాటకత్వమనేది, సంఘర్షణాత్మకమైన సంఘటనల సమిష్ట్ఫిలం. అందుకు సజీవ పాత్రలు, పాత్రోచిత భాష, సంభాషణా చాతుర్యం, సన్నివేశ వాతావరణ కల్పన. ఇవన్నీ ఈ నాటకంలో, ఆసాంతం అమోఘంగా దర్శనమిస్తాయి. నాటకంలో కథానాయకుడు వాణీనాధమే అయినా మురారి పాత్ర రూపకల్పన అమోఘం, అద్భుతం. ఈ పాత్ర ద్వారానే రచయిత తన మనసులో రగిలిన నిప్పుకణాన్ని ప్రజ్వరిల్లింపజేసింది.

-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు
- శీర్షిక నుంచి..

-కీశే పుచ్ఛా భార్గవ రామోజీ