వినమరుగైన

ఆలోచనలు కలిగించే కురుక్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటగా మనం కురుక్షేత్ర సంగ్రామము విషయం ముచ్చటించుకుందాం- దీన్ని నిజంగా పాండవ విజయం అనాలి. కానీ పాండవులకు లభించిన విజయం కవిరాజు దృష్టిలో ధర్మసంగతం కాదు. అందువల్లనే దీనికి కురుక్షేత్ర సంగ్రామము అని పేరు పెట్టారు. ఈ నాటక రచనకు రామస్వామిగారిని ఉసిగొల్పిన ప్రశ్నలేవి?
1.్ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డి అయినందున రాజ్యాన్ని పాలించే హక్కు ఆయనకు లేదనుకుంటే పాండురోగ పీడితుడైన పాండురాజుకెక్కడిది? ఒకవేళ వాళ్లిద్దరూ రాజ్యాన్ని పాలించేందుకు హక్కుదారులైతే సుపుత్రుని పొందేందుకు మూడవసారి తన కోడల్ని వ్యాసుని వద్దకు సత్యవతి ఎందుకు పంపుతుంది?
2.పెద్దవాడని ధృతరాష్ట్రుని సింహాసనం ఎక్కిస్తే ఆయన పెద్దకొడుకైన సుయోధనునికే ఆ సింహాసనం చెందదా?
3.కురురాజ్యం అవిభాజ్యం కదా-అందులో పాలు పంచటమేమిటి? అందుకు సుయోధనుడు ఎందుకు అంగీకరించాలి? యువరాజు రారాజు కావాలనుకోవటం సహజం కాదా?
4.పిత్రు భాగమని అన్యాయంగా పంచి ఇచ్చిన సగభాగాన్ని తిరిగి హస్తగతం చేసుకోకుండా ఎలా ఉండగలడు ఆ సుయోధనుడు? జూదానికని పిలిస్తే పరిగెత్తుకుపోవటమేనా? జూదపు షరతుల్నయినా సరిగా గమనించే పనిలేదా ఆ పాండవులకు? పదమూడేళ్లు పరాధీనమై ఆస్తి ఎవరిదవుతుంది?
5.ఐదూళ్లిమ్మన్నా ఇవ్వలేదని నెపమా? కౌరవులకిష్టమొచ్చిన ఐదూళ్లెందుకడగలేదు? అడిగిన ఐదూళ్లెటువంటివి. రెండు గురువుకు గురుదక్షిణగా ఇచ్చినవి, ఒకటి కర్ణుని స్వాధీనంలో ఉన్నది. ఇంకటి హస్తినకు సమీపంలో వుండి వేరొకరికిస్తే పక్కలో బల్లెమయ్యేది.
ఇక ఐదోది ఏ ఊరయినా ఫర్వాలేదట!
6.ఈ అన్నదమ్ములమధ్య తగవుకి దేశంలోని సైన్యమంతా వచ్చి పోరాడి ప్రాణాలు కోల్పోవటం ఎందుకు? తులారణంతో తేల్చుకోకూడదా!
దుర్మార్గుల్ని శిక్షించేటప్పుడు కొంచెం పెడమార్గం పట్టినా ఫర్వాలేదా? అలా పెడమార్గం పట్టి గెల్చిన వాళ్లెలా గొప్పవాళ్లు?
ఇటువంటి ప్రశ్నలు పాఠకుల లేక శ్రోతల లేక ప్రేక్షకుల మదిలో రేపి చివరకు పలికిన భరతవాక్యం ఏమిటి?
‘‘్ధర్మరాజుఁబ్రోలె నేఁటి వసుధాపతు లెల్లరు రాజ్యకాంక్ష దు
ష్కర్మము చేయకుండుదురుగాత, భయంకర ఘోర జన్యముల్
మర్మముతోడఁ జేయుటలు మానెడు గాత, మహేంద్ర జాలులన్
వర్మము గాఁగ జేసికొని వర్తిలకుందురుగాత మెప్పుడున్’’
ఈ పుణ్యభూమిలో అది అంత తేలికయిన పనా? రాజులూ రాజ్యాలూ పోయినా ప్రజారాజ్యాలు వచ్చినా మన సంస్కృతి అవిచ్ఛిన్నం కదా! శంబుకవధ నాటకం ఉత్తర రామచరితకు చెందిన ఉత్తమ సాక్ష్యం. ఈ నాటకం క్షాత్ర ధర్మానికీ, గురువాజ్ఞకూ మధ్య గుంజీళ్లు. రాముడు మనుష్య మాత్రుడో, రుూశ్వరుడో లేక త్రిశంకు స్వర్గవాసియో తేల్చదగిన వేదిక. వేదాలకూ, స్మృతులకూ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. శ్రీరాముడు మత రక్షణ కోసం శంబుకవధ చేయవలసి వచ్చిందని ఎవరెన్ని మాయమాటలు చెప్పినా, ఆ వధ రాజనీతి ప్రేరితమని కవిరాజు నిరూపించదలిచాడు.
భూదేవులు, ఆకాశదేవులు ఒక్కటై పన్నిన పన్నాగాన్ని మన కన్నుల గట్టించిన రూపకం శంబుకవధ. మానవుని స్వాతంత్య్రానికి ప్రతిబంధకం కల్పించే తీరును తేటతెల్లం చేసి, మానవత్వానికి మేలుకొలుపు పాడి, కాపట్యానికి తెరదించిన నాలుగంకాల నాటకం శంబుకవధ. శ్రీరాముడెప్పుడూ సంశయాత్ముడే. సీతను ఒక పర్యాయం అగ్నిపరీక్షకు గురి చేశాడు కదా- ఎవడో ఏదో అన్నాడని మళ్లీ అడవులకు పంపటం దేనికి? అయినా శ్రీరామచంద్రుణ్ణి తప్పు పట్టవలసిన దేముందిలే.. ఆయన నిమిత్తమాత్రుడు కదా! -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-రావెల సాంబశివరావు