వినమరుగైన

మానవత్వమే మహనీయగుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిక్షాస్మృతుల్ని మిడిమేలంగా మతగ్రంథాలుగా మార్చివేశారు. అందువల్లనే శంబుకుడు ఆనాడే ప్రశ్నించాడు. ‘‘ఋషులకు మాత్రముండవలదే ఋజుమార్గము?’’ అని. అలా ప్రశ్నించేవాణ్ణి ఋషులెలా బ్రతకనిస్తారు? సమానత్వం కోసం శ్రమించే శంబుకుని పని పట్టేందుకు పరుగు పరుగునా పోగయ్యారు. ఆర్యఋషులూ వారి శిష్యగణమున్నూ! ‘ఇంటిలోన పోరు పడలేక విస్తళ్లు గుట్ట’ కొనేవాళ్లు సైతం సలహాదారులుగా మారిపోయారు. ఇంతకూ శంబుకుని తప్పు ఏమిటో?
శంబుకుడు అనార్యుడు. సరయూనదీ తీరంలో చిదానందాశ్రమం నిర్మించుకున్నాడు. తపస్సు చేసుకుంటున్నాడు. శిష్యులకు తత్త్వోపదేశం చేస్తున్నాడు. అక్కడి వాతావరణం తిలకించి పులకించిపోయిన శ్రీరాముడు శంబుకునితో తర్కించి జ్ఞాన సముపార్జితుడై ‘రాష్టవ్రాసులకెల్ల సమానములగు హక్కులనిచ్చి, పక్షపాత రహితముగా రాజ్యమేలుట మాకు విద్యుక్త ధర్మము కాన మీరు నిశ్చింతనుండుడు’’ అని మాట ఇచ్చిన మారాజు. మరునిమిషంలోనే గురువుగారి తప్పుడు ఆజ్ఞను పాలించవలసిన అవసరం ఏమొచ్చిందో? శిక్షించేముందు శంబుకుడు ద్రోహి అనే విషయం రుజువుకాకుండానే ఎందుకు హతమార్చవలసి వచ్చిందో?
‘‘రాజులు సర్వప్రజానురంజకులై నేలదగువారు గాని కొందరి యుపదేశములనమ్మి యపరాధ రహితులను బాధపరచుటకు దగువారు కారు అని చెప్పిన శ్రీరాముడు; ‘‘ఆర్యులమైన మనము అనార్యుల పాటి కృతజ్ఞులమై యుండదగదా’’ అని ప్రశ్నించిన పరంధాముడు; ‘‘ఒక జాతి సౌభాగ్యమునకయి మరియొక జాతిని సర్వకాల సర్వావస్థలయందు బానిసతనము నందుంచి మూర్ఖులను జేయుట రాజనీతియగునా?’’ అని మందలించిన రఘురాముడు; ‘‘పాపము జేసి మనుటకన్న బరోపకార మాచరించి, మరణించుటచే యశఃకాయుడగుట యుక్తము కాదో?’’ అని హితవు పలికిన దాశరధి పుటుక్కున శంబుకుని తలద్రుంచుటకు కారణమేమి? వశిష్ఠులవారు చెప్పేది నిజంగా న్యాయంగాకపోతే ఆ మహనీయుడు అంత పట్టుదలతో ఎందుకు చెప్తాడు అనే అనుమానమే పెనుభూతమయ్యింది. అలా ‘‘రాజుల్ని కీలుబొమ్మలుగా జేసి, జాతి అహంభావాలను రుజువుచేయటానికే శంబుకవధ కవిరాజు వ్రాసింది’’ అన్నారు ఆవుల గోపాలకృష్ణమూర్తిగారు. -సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-రావెల సాంబశివరావు