వినమరుగైన

మాతృమందిరము.. వేంకట పార్వతీశ్వర కవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నపూర్ణా మందిరంలో అమృతాన్నపానాలు, సరస్వతీ మందిరంలో సర్వవిద్యలు లభించడంతో అక్కడున్న వారందరికీ మాతృ మందిరం ఆనందమందిరం అయింది. అయితే అక్కడ నరక నిలయం కూడా వుంది. ప్రబోధానందస్వామి పాపాత్ములను అందులో వుంచి, పశ్చాత్తాపం కలిగేవరకు శిక్షణ కావించి, ప్రబోధమందిరంలో ఆపైన వారిని చేర్చి మనుషులను చేస్తాడు.
ఆ మాతృమందిరంలో బిల్వవనంలో ప్రబోధానందస్వామి ఆశ్రమం వుంది. ఆయన వయస్సు ఎంతో ఎవరూ చెప్పలేరు. ఆరోగ్యకరమైన అరవై సంవత్సరాల వయస్సున్న వానిలో ఆయన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తాడు. ఆయనే మాతృమందిర కథకు సూత్రధారి. కల్యాణానందస్వామి, ఆనందాదేవి ఆయన శిష్యులు.
ఈ శిష్యులతో, ఏ కార్యాలు స్వామి సాధించారో స్థూలంగా అదే నవలా ఇతివృత్తం. దేశభక్తి, సత్యసంధత, అహింసావ్రతం, సర్వమానవ సోదరత్వం మొదలగు సుగుణాలు కలిగి దొంగతనం, పడుపువృత్తి, పశుబలి, అంటరానితనం, మధుపానం, గోవధ లాంటి దురాచారాలు ఎలా సంస్కరించుకోవాలో ప్రబోధించిన ప్రబోధమే ఈ నవలలోని వస్తువు. అనేక పాత్రలతో మాతృమందిరము నవల కాన్వాస్ చాలా పెద్దదని ఇపుడు మనం భావించవచ్చు. ప్రస్తుతం నవలలోని కథ ఏమిటో పరిశీలిద్దాం.
ఒక రోజున గోదావరి నది ఒడ్డున వెంకట పార్వతీశ్వర కవులు సంపూర్ణ పూర్ణిమ చంద్రుని చూస్తుంటారు. ఆ చంద్రమండలం నుంచి సహస్ర శీర్షాలతో జగన్మాత వారికి సాక్షాత్కరిస్తుంది. ఆ వెలుగులలో ఒక కిరణం ఓ దివ్య మానవుడిగా దిగివచ్చి కవులను సమీపిస్తాడు. ఆయనలో కవులు తమ తమ తండ్రిని చూస్తారు. ఆయన వచ్చి, ఇరువురినీ చెరొక చేతితో కౌగిలించుకుంటాడు.
చంద్రమండలంలో అటు అమ్మ, భూమండలంలో ఇటు నాన్న. వెంటనే వారికి మాతృదేవోభవ, పితృదేవోభవ అన్న దివ్యవాక్యాలు వినిపిస్తాయి. కౌగిలించుకున్న దివ్య పురుషుడు వారికో పుస్తకం ఇస్తాడు. దివ్యకాంతిలో, స్వర్ణాక్షరాలలో ఆ పుస్తకం పేరు వుంటుంది. ఆ పేరు మాతృమందిరము. కుతూహలంతో వారు పుటలు తిప్పుతూ మాతృపూజా పరాయణులం, సోదరులం అయిన మన అందరినీ వారితో కలిసి చదవటానికి పిలుస్తారు. మనం కూడా పుస్తకం చదువుతాం.
కథ మూడు కుటుంబాల సభ్యులు, వారి పరిచయస్తులతో నడుస్తుంది. గౌరీపతి శాస్ర్తీ, భారతరావు, వెంకటేశ్వరరావులు ఆ కుటుంబాల పెద్దలు.గౌరీపతిశాస్ర్తీ పిఠాపురం రాజావారి ఆస్థాన పండితుడు. సార్థక నామధేయ అన్నపూర్ణ ఆయన అర్థాంగి. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు గణపతి శాస్ర్తీని మూడేండ్ల వయసప్పుడు దొంగలు తీసుకుపోతారు.
దిగులుతో శాస్ర్తీ పిఠాపురం వదిలి తన స్వస్థలం తణుకు వచ్చేస్తాడు. కూతురు సరస్వతి అక్షరాల సరస్వతే. ఆ అమ్మాయిని అన్నపూర్ణ మేనల్లుడు, తల్లిదండ్రులు లేనివాడు అయిన పరబ్రహ్మానికి ఇంట్లోనే పెంచి పిల్లనిస్తారు.
పరబ్రహ్మానిది ఆధ్యాత్మిక దృష్టి. సంసార మోహం లేదని అత్త మందలిస్తే ఎవరికీ చెప్పకుండా ఇల్లొదిలి పోతాడు.
*
-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కొలసాని సాంబశివరావు