వినమరుగైన

బారిష్టర్ పార్వతీశం- మొక్కపాటి నరసింహశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పార్వతీశం లిఫ్టు ఎక్కి, అది ఒక గది అనుకొని అది పైకి పోతుంటే గంగారుపడ్డాడు. ఇలా చాలా చిన్న విషయాలను తీసుకొని హాస్యరసస్ఫోరకంగా అందించారు శాస్ర్తీగారు. పార్వతీశానికే గాదు క్రొత్త ప్రదేశానికి వెళ్లిన ప్రతివారికి ఏవో కొన్ని ఇలాంటి అనుభవాలు తప్పవు. బారిష్టరు పార్వతీశం రెండవ భాగంలో హాస్యంతోపాటు కొంత శృంగారం కూడా జోడించారు మొక్కపాటివారు.
ఒకరోజు పార్వతీశానికి అతని గోదావరి జిల్లా మిత్రుడు ఇంటి దగ్గర నుండి వచ్చిన ఆవకాయ తెచ్చి ఇచ్చాడు. మన పార్వతీశానికి ఇంటి యజమానురాలికి ఆవకాయ రుచి చూపించాలని బుద్ధిపుట్టింది. కొంత ఇచ్చాడు. అదేదో జాము అనుకొని ఆమె రొట్టెలనిండా బాగా పట్టించి నోట్లో పెట్టుకొన్నది. ఇంకేముందు కేకలు పెడబొబ్బలు. మన పార్వతీశం అపుడు ఆవకాయ అన్నం పిసికి తింటున్నాడు. ఆ కారం చేత్తోనో ఆమె కళ్లు తుడిచాడు. మంట ద్విగుణీకృతం. అద్భుతమైన ప్రహసనం. తమ ప్రాంతానిది కాని ఆహారం తినడంవల్ల ఏర్పడ్డ వికృతి అది. ఈ సంఘటనలోనుండి హాస్యం వుత్పన్నమయింది.
ఈ భాగంలో పార్వతీశం చాలా ప్రయోజకుడయ్యాడు. ట్యూషను చదివి అతి స్వల్పకాలంలోనే ఎంట్రెన్సు పరీక్ష పాసయ్యాడు. ఎం.ఎ., బారిష్టరు చదువులు ఏకకాలంలో పూర్తిచేశాడు. అప్పుడప్పుడు ఇంటి యజమానురాలు కూతుళ్లను ముద్దుపెట్టుకోవడం సాగించాడు. ఒక గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా సంపాదించాడు. షికార్లు, కౌగిలింతలతో ప్రేమాయణం లాంటిది నడిపాడు. హద్దుమీరలేదు కాని హద్దుమీద నిలబడి ఆనందించాడు.
మానవుడు చాలా చిత్రమైన జీవి. తాను ఏ కారణాలవల్ల బాధపడ్డాడో అవి ఇతరులకు సంభవిస్తే సానుభూతి చూపించడంపోయి హేళన చేస్తాడు. పార్వతీశం గతాన్ని మరిచి క్రొత్తగా ఇంగ్లండు వచ్చిన రమణ అనే కుర్రాణ్ణి ఆట పట్టించాడు. తాను కచికలపొడి మూట కట్టుకు వచ్చింది మరచిపోయి ముక్కుపొడుం వెంట తెచ్చుకున్న తెలుగువాణ్ణి ముక్కుపొడుంగాడని హేళన చేశాడు. మొక్కపాటివారు మానవ బలహీనతను ఇక్కడ చమత్కారంగా చూపించాడు.
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, సరోజినీదేవి నాయుడు మొదలైన స్వాతంత్య్రోద్యమ నాయకుల ప్రస్తావన, ప్రపంచ యుద్ధం విషయాలు ఈ గ్రంథానికి గౌరవాన్ని పెంచాయి.
మూడవ భాగంలో హాస్య సన్నివేశాలు తక్కువ, విదేశయానం చేసి వచ్చిన పార్వతీశానికి తండ్రి ప్రాయశ్చిత్తం చేయించాడు. ప్రజలు ఇంగ్లండు పోయి వచ్చాడని పార్వతీశానికి బ్రహ్మరథం పట్టారు. సన్మానాలు జరిగాయి. ఒక గొప్ప లాయరు కుమార్తెతో వివాహం జరిగింది. మద్రాసులో ప్రాక్టీసు పెట్టి సమర్థులైన లాయరుగా పేరు, ధనం సంపాదించాడు. స్వాతంత్య్రోద్యమంలో పార్వతీశం దంపతులు పాల్గొన్నారు. కథనిలా ముగించారు మొక్కపాటివారు. హాస్య సన్నివేశాల్ని వివరించి చెప్పటం అంత బాగుండదు. ఎవరికివారే ఈ గ్రంథాన్ని చదివి అనుభూతి పొందడం ఉత్తమమని నా భావన. ఫిఫ్త్ఫురం దాకా చదివిన కుర్రాడు ఊరు పేరు చెప్పకుండా రైల్వే స్టేషన్‌లో ఒక టిక్కట్టివ్వమని అడుగుతాడా అని మనం సందేహించాల్సిన పనిలేదు. అజ్ఞానానికి, పొరపాట్లకు, భంగపాట్లకు ఔచిత్య విచారమేమిటి. ఇక్కడ అవేగదా హాస్య హేతువులు. అసలు హాస్యరసం మనసారా నవ్వుకుంటానికేగాని ఔచిత్యతర్కంతో బుర్రబద్ధలు కొట్టుకుంటానికి కాదు.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- మొక్కపాటి నరసింహశాస్ర్తీ