వినమరుగైన

మైదానం - చలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె జీవితం నదిలో స్నానాలుగా- అమీర్‌తో క్షణం క్షణం అమర సుఖాలుగా జీవితం అంతా దివ్యస్వప్నంలా - ఆమెకి పూర్వం తన భర్తతో లేని స్నేహం- చొరవ అన్నీ అమర్ దగ్గర లభించాయి. ఆమె మెదడు- శరీరం- హృదయం అన్నీ మేల్కొన్నాయి. తనకు దివ్యస్వప్నమే- కాని ఆమెని తిరిగి తీసుకువెళ్లడానికి వచ్చిన మామయ్య - లోకానికి ప్రతినిధి అయిన మామయ్య దృష్టిలో మాత్రం రాజేశ్వరిది పశుకామం. అది నిజంగా పశుకామమే అయితే తన భర్తతో కాపురం చేసుకుంటూనే - అనేకమంది పతివ్రతలలాగా-అమర్‌తో దాన్ని తీర్చుకునే అవకాశాలు ఆమెకి చాలా వున్నాయి. ఇట్లా బయటికి వచ్చి కాఫీలు- నెరుూ్య- కూరలూ- నగలూ- మంచి దుస్తులూ త్యాగం చెయ్యాల్సిన అవసరం లేదు. అతని స్నేహం ముందు అతని లాలన ముందు ఉధృతమైన అతని కోరిక ముందు అవన్నీ దిగదుడుపు అనే కదా! చీకటికి అలవాటుపడ్డవాళ్లకి వెలుగు కళ్లలో గుచ్చి బాధిస్తుంది- మావయ్య లాంటి వాళ్లకి. రాజేశ్వరి శరీరంలోని ప్రతి అణువూ పరిచయం అయిన అమర్‌కి ఆమెలో వచ్చిన మార్పు అర్థం కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆమెలో అంకురిస్తున్న మరో జీవి అతనికి ఇష్టం లేదు. రాజేశ్వరికి ఆ జీవి మీద కరుణ- అపారమైన ప్రేమ- పేగుబంధం.
దానికోసం ఇద్దరిమద్య ఘర్షణ-అమర్ ఆమెను వదలి వెళ్లిపోయినాడు. అయినా నిలబడింది. అమర్‌పై ప్రేమకీ, మాతృత్వానికీ మధ్య జరిగిన యుద్ధంలో అమర్ గెలిచాడు. అతన్ని విడిచి వుండలేని రాజేశ్వరి గర్భవిచ్ఛిత్తికై సిద్ధపడింది. అమర్ లేని దిగులుతో ఒంటరితనపు అభద్రతలో ఆమెపై ఇతరులు కన్నుపడినప్పుడు- అండగా నిలిచి ప్రేమను పంచిన మీరాకు దగ్గరైంది. అంతేకాదు, అమర్ కోరిన స్ర్తిని అతనికి స్వయంగా తెచ్చి ఇచ్చింది. తనకోసం ఆమె చేసిన త్యాగాలకు- ఆమె ఇచ్చిన ప్రేమను ఒక హక్కుగా పొందిన అమర్- ఆమె మీరా పట్ల ప్రేమగా వుండటం సహించలేడు. తన ప్రేమను ఇద్దరికీ పంచి అంతా సుఖంగా వుండేటట్లు చెయ్యలనుకున్న రాజేశ్వరి ప్రయత్నం ఫలించలేదు. అమర్‌నించి మీరా ప్రాణాన్ని, తన శరీరం అతనిపై కప్పి కాపాడింది రాజేశ్వరి. ఆ పసిప్రాణం అమర్ చేతిలో ఎప్పుడు పోతుందోనని తల్లడిల్లిపోయింది. రాజేశ్వరిని తన హక్కుగా భావించిన అమర్ పొడుచుకుని ప్రాణం తీసుకున్నాడు. అతన్ని రాజేశ్వరి పొడిచి చంపిందని భావించిన మీరా ఆ నేరాన్ని తన మీద వేసుకోబోతే కాదు అమర్‌ను చంపిది తనేనని శిక్ష అనుభవించింది. ఈ కథనంతా రాజేశ్వరి తన స్నేహితురాలైన ఒక భద్ర మహిళకు చెబుతున్నట్లుగా, ఆమె కంఠస్వరంతో చెబుతాడు చలం.
చలం పాత్ర నేల విడిచిన సాము అని విమర్శకులన్నారు. చలానికి లైంగిక కోణమే కాని ఆర్థిక కోణం లేదన్నారు. చలం పాత్రని వెక్కిరిస్తూ గోపీచంద్ కథ కూడా వ్రాశారు.
నిజానికి రాజేశ్వరి పాత్ర చలం ఐడియాలజీకి ఒక మెటఫర్ అని నేను అనుకుంటున్నాను.
చలం సృష్టించిన స్ర్తిలందరూ తాము నమ్మిన సత్యం కోసం నలిగిపోయిన వారే. ఆ పోరాటంలో ఓదార్పు పొందినవారు చివరికి ఫలితం ఏదైనా కానీ వారి పోరాటశక్తి గొప్పది.
రస విహీనమైన, స్నేహరహితమైన తన దాంపత్య జీవితాన్ని ఏవగించుకున్నప్పటికీ చాలామంది సాధారణ స్ర్తిలలానే రాజేశ్వరి తన ప్లీడరు భర్తతో కాపురం చేసుకుంటుంది. అమర్ తటస్థపడేవరకూ జీవితం ఎంత సుందరంగా జీవించవచ్చో తెలియదు.
-సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-పి.సత్యవతి